నువ్వూ, నేనూ, వాడూ, వీడూ....
పసికందు పారిపోలేకపోయింది చిన్నారిని చిదిమేశారు మగువ మసకబారింది స్త్రీ మూర్తి చితికిపోయింది ముసలవ్వలకూ తప్పలేదు మగతనపు మదం, బలుపు. చేసేదేం లేదా అంటే చెయ్యాల్సింది చాలానే వుంది నువ్వూ, నేనూ, వాడూ, వీడూ ఇంకెవ్వడైనా, ఎక్కడైనా కనిపించిన ప్రతి స్త్రీ ని కని పెంచిన అమ్మలానే చూస్తే, కనిపించిన మగ మృగాలను మరపురాని రీతిన బడిత పూజ చేస్తే బరితెగించిన బడ్డూ గాల్లకి బ్రతికే హక్కుని హరింపజేస్తే రేపటి మాతృ మూర్తులకైనా రక్షణ వస్తుందేమో. నువ్వూ, నేనూ, వాడూ, వీడూ ఇంకెవ్వడైనా, ఇంకెప్పుడైనా ఆడదంటే 'అవసరం' కాదు "ఆదిశక్తి" స్వరూపం అనుకుంటే రేపటి మాతృ మూర్తులకైనా మంచి రోజులు వస్తాయేమో ఈ అనాగరికపు ఆలోచనకి నువ్వూ, నేనూ, వాడూ, వీడూ బాధ్యత వహిస్తే, మగాడికి, మగువంటే ఏంటో తెలిపే బాధ్యత నువ్వూ, నేనూ, వాడూ, వీడూ భుజానెత్తుకుంటే, రేపటి మాతృ మూర్తులకైనా రక్షణకవచం మనమౌతామేమో, రేపటి మాతృ మూర్తులకైనా మంచి రోజులు వస్తాయేమో RV Writings......