Posts

Showing posts from June, 2020

మెరుపులు - ఊహల గాలం

🙏మెరుపులు 🙏 ————————— ఉదయమే మనకు ఊహా జనితము మనం సాయంత్రంవరకు దానితో పోరాడుతము !! 858 పడుకొని వుంటే పంటికిందికి రాదు కలలు కంటుంటే మనకు మంచిదికాదు !! 859 కనిపించే కాలం పరుగెడుతనే వుంటది మనఊహల గాలం దాన్ని ఆపనంటది !! 860 తాండ్ర చిరంజీవి వరంగల్ అర్భన్

తలుపుల మెరుపులు

తలుపుల మెరుపులు —————————— తలుపులు ఇంటికి ఆలు మగలు మనిషి కంటికి అవికర్ర వస్తువులు !! 851 కోట్లతో ఇల్లుకట్టిన తలుపులులేక వ్యర్థం తలుపులుంటే గుడిసెకైన అదే నిగుడార్థం !! 852 మారుపేర్లు రక్షణకు ఇంటికున్న తలుపులు గురిచేయవు భక్షణకు కాపాడే మలుపులు !! 853 కర్రైనా లోహమైన ఇంటికి రక్షణ ఒదులుతవి ప్రాణమైన చేయనీయవు భక్షణ !! 854 తలుపులను తన్నినా తగువు పెట్టుకోవు విరగగొట్టుటకు వలవేసినా విజృంభిస్తూ మీదికిరావు !! 855 ఓర్చుకొని ఉండరా ఓరి.. మానవుడా తగ్గించుకొని బతకరా మాయమయ్యే విగతజీవుడా !! 856 అమ్మానాన్న ఉన్నఇల్లు సంతోషంగా ఉంటది తలుపులున్న ఇల్లు అతిసుందరంగా ఉంటది !! 857 తాండ్ర చిరంజీవి వరంగల్ అర్భన్  సెల్ : 9959180762.

ఓటమి ఎరుగని సమరం

ఓటమి ఎరుగని సమరం రససాగర సమరంలో విజయాలెవరివి  చుంబన వింధులో మదురం ఎవరిది  బాహువుల బందీల్లో పరాజయాలెవరివి రతితీరం అంచున ఫలితం ఎవరిది నఖలేఖన ముద్రల వివరం ఎవరిది సుఖజీవన రాత్రుల సమయం ఎవరిది మైమరచిన మనసుల మాటలెవరివి గతితప్పిన హృదపు ద్వనులెవరివి సుతిమెత్తని మధుర స్వరాలెవరివి సృష్ఠికార్యపు తలంపుల మోహం ఎవరిది అతివేగపు ఆత్మల పయణం ఎవరిది గ్గీంకార పెదవుల నాధం ఎవరిది రమారమి సమరంలో ఓటమి ఎవరిది లవణజలదారలో స్వేదం ఎవరిది పెనవేసిన తనువుల అందాలెవరివి చీకటిరాత్రి అళలలో సొగసులెవరివి దుర్భేద్యమైన ఎడారిలో దాహం ఎవరిది రసికమయ నాట్యంలో గెలుపు ఎవరిది భువనచర లోకంలో బందం ఎవరిది రాసలీలల సంసారంలో బహుమానం ఎవరిది ఇట్లు పద్మతార నాభిలో ఇంద్రజాల దండం --- చంద్రహాసన్

ప్రతాపః కావ్యః

ప్రతాపః కావ్యః జగన్నాటకంలో నేనొక నిమిత్త ప్రాయుడను నేను సంగీతం ఎరుగను, సాగరసంగమాల వారసుడను కాను నా పసితనంలో సంస్కృతం మూడు, నాలుగు కక్ష్యలలో నామమాత్రంగా అభ్యసించాను నేను తెలుగు భాషా ప్రావీనుడనుకాను నా అక్షరమాల ఇప్పటికీ గతి తప్పుతూనేఉంటుంది నాలోని భావాలను సంభాషణ ద్వారా వ్యక్త పరచలేని స్వరనాళిక ఉన్న మూగవాడిని నామదిలోని భావాలను వ్యక్తపరచాలనే కుతూహలం నన్ను వెంటాడుతుంది భావ వ్యక్తీకరణకు నేను ఎంచుకున్న మార్గమే నా ఈ కావ్యరూప అక్షరాలు --- చంద్రహాసన్

సుందర సృష్ఠి సాక్షాత్కరించె మన పల్లెలోన

సుందర సృష్ఠి సాక్షాత్కరించె మన పల్లెలోన జల్లు జల్లు మంది వాన జర జరా సాగింది గంగ గళ్ళు గళ్ళున గోమాత చెంగు చెంగున పైరగాలి   వెన్నెల గానం మ్రోగించె విక్రయశాల వికసించె లక్ష్మీ మీట పరిచయమాయె గంగిరెద్దుల ఆటవిడుపు   అక్షర ఙనం మదినచేరె పరిణయబందం ఏర్పరిచె ఉత్తమ కార్యం జరిపించె సిరివెన్నెల ముత్యం చిందులువేసె   అద్బుత సంఘం సహకరించె సేవామార్గం ప్రజ్వరిల్లె జనగణమన అదినయకుడాయె బ్రహ్మపాదం మోపె మన బంగారు పల్లెలోన... --- చంద్రహాసన్

ప్రళయం-విలయం-భీకరం

ప్రళయం-విలయం-భీకరం తొందర పడకు ఓ భూపరి ఈ భువిపై ఉన్నవి రెండే జతులు ఒకటి సజీవ రాశి రెండు నిర్జీవ రశి   అచిర కాలపు స్వప్నంలో, సృష్ఠికార్యపు తీరం అంచున మిథ్యానాదపు సాధన వలలో, హృదయం వీడి, తనువే మరచి, మైమరచిన జీవం జాడలు, ఆత్మ మూలాలు ఎరుగని ఓ భూపరి   చరిత్ర విజయం నీదే అంటివి, అజీవలోకం శాసనమాయె, నీలాకాషపు భ్రమలో నిలబడి, పూర్వపు గాద నీదే అంటివి   ప్రళయకాలపు అంకురంలొ, నిర్జీవ రాశుల విలయ తాండవం భీకర జీవశ్చవాల ఆర్తనాదం, సంఘజీవుల శోకసంద్రం   పూర్వపు చరిత్ర పుటల్లో శోధించు, వర్తమానంలో జీవించు అనుభవంతో భవిష్యత్ ను శాసించు ఓ భూపరి ఈ ఇహలో నీకంఠ పడని గోప్యాలెన్నో, మరుగున పడిన రహస్యాలెన్నో అన్వేశించి తర్కించు జీవనపయణం సాగించు ఓ భూపరి --- చంద్రహాసన్

అశ్రు ప్రళయంలో పన్నీటి జల్లు

అశ్రు ప్రళయంలో పన్నీటి జల్లు జన సమ్మతిలో నిజవల్లుడవై, వెలిగిపో ఓ మహత్మా జగమే యెరుగని, నటనే తెలియని జీవన పయణంలో, అహింసా మార్గం నీది నూతన ఆయుధ శాంతి పథంలో ఎగిరింది ఎగిరింది త్రివర్ణం, బెదిరింది బెదిరింది శ్వేతవర్ణం అశాంతి గుండెల్లో, సుశాంతివై సాగావు హింసా సమయంలో, నిర్భయుడవై వెలిగావు అధర్మ పయణంలో ధర్మపాదమై నిలిచావు బ్రిటిష్ పాలన వణికింది, చరిత్ర గమణం మారింది నూతన ఆశయాలు వెలిసాయి, నాలుగు పాదాల ధర్మసత్రం వెలసింది ఈ నవయుగ ప్రపంచంలో నీ ఆయుధమెరుగని నాధుడు లేడు నీ మార్గమే సమసమాజ నిర్మాణానికి వారధిగా నిలిచింది. జన సమ్మతిలో నిజవల్లుడవై, వెలిగిపో ఓ మహత్మా ---చంద్రహాసన్

నా ప్రాణసఖి

నా ప్రాణసఖి ఈ భువిపై ఉన్నవి రెండే తనువులు మొదటిది నా ప్రాణసఖి, చివరిది ఈ ఇష్ఠ సఖుడు ప్రకృతిలో సంచరిసున్న నాకు సృష్ఠి అందాలు ఆసాంతం నీలో పల్లవించాయి తొలిచూపులో మైమరచి, హరివిల్లుపై ఊయలలూగాం సూర్యుడేహోమగుండమై, ఉరుములు-మెరుపులు భాజాభజంత్రీలై, సె లయేటి ద్వనులు పెళ్ళి మంత్రాలై పంచభూతాల సమక్షంలో మనువాడాం సప్తలోకాలలో ఇంద్రపాన్పుపై, పారిజాతాపూల పరిమళాలతో విరజిల్లే షయ్యపై, అమృత రుచిని అందించే ద్రాక్ష తోటపై వెన్నెల వెలుగులలో ఇద్దరం పెనవేసుకొని ఒకరిలో ఒకరం మమేకమయ్యాం. చంద్రహాసన్

నా చిన్ని జన్మ

నా చిన్ని జన్మ ఈ అలసిన దేహనికి నీ కౌగిలి... హృదయపు ఆశలురేపే పెదాలచుంబనం ఇంద్రజాల హస్తానికే రసరమ్యాలునేర్పే ఆ నడుంవంక మనసుకి ప్రశాంతతచేకూర్చే నీ మనోహర కన్ళు ముణివేళ్ళకు సైతం జీవంపోసే నీ విశాలమెడ నాలో అణువనువు ప్రేరేపింపజేసే నీ సుగంథ పరిమల మేని ఈ ఇంద్రజాల ప్రపంచంలో నా చిన్ని జన్మ... రమణులొలికే నీ సాష్ఠాంగ అందాలకే అంకితం. చంద్రహాసన్

నా చిన్ని ఆశ

నా చిన్ని ఆశ నీ ఊపిరి జ్వాలల హృదయపు దారులలో నా చిన్ని ఊహపు అళ... నీ ఆత్మసౌంధర్యము, బాహ్యసౌంధర్యము నా అనువణువునూ ప్రేరేపిస్తున్నాయి జన్మజన్మల ఈ పాదసేవకుడిని ఈ జన్మకైనా కరుణించవా ఓ చెలి... నీ విశాలహృదయంలో పవలించాలన్న నా చిన్ని ఆశ, మన్నిస్తావు కదూ… చంద్రహాసన్

నామామృతం

నామామృతం ఓ ప్రియ నీ వెచ్చని శ్వాసతొ నా మనసుని మేల్కొల్పావు అమృతంకై పరితపించిన నా హృదయం నీ ఊపిరిలో మువ్వలా స్పదిస్తుంది ప్రాణవాయువుకై శోదించే నేను నీ అంమృతజ్వాలతొ అమరుడనైనాను నా నిర్జీవ శరీరానికి ప్రాణంపోసిన నీ శ్వాసల ఊపిరితో యుగాతాలను సైతం శాషించే అజేయుడనై జన్మతా నీ నామస్మరణ గావిస్తాను. చంద్రహాసన్

ఓ సొగసరి

ఓ సొగసరి ఓ సొగసరి నీ అందలను వర్ణించదనికి, నా కలం బాసలు వెతుకుతుంది నీ నవ్వుల చిత్రాలు నా హృదయాన్ని స్పర్శిస్తున్నాయి నీ చక్కిల్ల వర్ణాలకు నామనసు దాసోహం నీ శిల్పాన్ని మలచిన ఆ బ్రహ్మ ఓ చమత్కారి నీ రమణులను వర్నించే నాకలం నీ పాదాలకే అంకితం.   చంద్రహాసన్

నా జీవన్మరణం

నా జీవన్మరణం నిన్న ఒక గతకాలపు చరిత్ర, రేపు ఆశాప్రయానపు సౌధం, జీవిత గమణంలొ నేడు ఒక అందమైన సత్యపు నిజం.   ఈ సృష్తిలొ భువి ఒక ఆధార మర్గం, బ్రమ్మ ఒక మిధ్యాశాస్త్రం, విష్ణుమూర్తి వీణాప్రళయవిహంగం, మహేశ్వర నాట్యం గతిచక్రం.   జననమరణాలు అనురాగ బంధాల విస్పొటనం, గతకాలపు చరిత్రలొ, మిధ్యాసౌధపు సాధనలొ, వీణాప్రళయపు సృష్తిమర్మంలో, గతిచక్రపు సత్యనాట్యం, ఈ భువిపై నా జీవన్మరణం. --- చంద్రహాసన్

⚡⚡ మంచిచేయు మెరుపులు ⚡⚡

⚡⚡ మంచిచేయు మెరుపులు ⚡⚡ ఒదిగి వుంటే ఎదుగుదల అన్నట్లు అహంకారంతో వుంటే అడుగుస్థాయి అన్నట్లు !! 671 మంచి మాటలేపుడు మాలలు అవుతాయి మంచి పనులేపుడు జ్ఞాపికలు అవుతాయి !! 672 రంగు ఏదైనా పరిగణలోకి రాదు ఎత్తుపల్లాలు ఏవైనా లెక్కలోకి రాదు !! 673 మంచిచేయుట కొరకు మనిషి బతకాలి మంచిమార్గముల కొరకు మనిషి వెతకాలి !! 674 స్వార్థబుద్దిని ఎపుడు సమాధి చేయాలి మంచిబుద్దిని ఎపుడు భుజాలపై మోయాలి !! 675 ఉన్నందంత నీవు ఊడ్చి ఇవ్వకు ఇచ్చేవారిని చూసినీవు ఎపుడు ఏడ్వకు !! 676 దాతగా బతికితే నీకు దండాలు రక్తదాతగా బతికితే వేయి దండాలు !! 677 పుట్టుకతో ఏమి తేలేదు భూమికి వెళ్ళెటప్పుడు ఏమి తీసుకుపోలేము ఆకాశానికి !! 678 మంచి చెడులు రెండు దారులు మనంవేసే అడుగులు కావాలి మంచిదారులు !! 679 అహమన్నది చస్తేనే ఇలలో వుంటాము అందరితో కలిసుంటేనే పరంలో వుంటాము !! 680 దోచుకొని దాచువాడు దాత కాలేడు నిత్యము పెట్టువాడు అవినీతుడు కాలేడు !! 681 కష్టంలో మనము చేయి సాపాలి దాతృత్వంలో మనము చేయి ఒదలాలి !! 682 అస్థిరము ఐనది ఈ అస్థిపంజరము స్థిరమేమో కానిది ఈ చిలకపంజరము !! 683 నవ్వుతూ బతికితే ఆయుష్యు పెరుగు నలుగురిని ఓర్చితే సంపదలు కలుగు !! 684 ద్వేషం విరిగి...

⚡⚡ ఆరోగ్య మెరుపులు ⚡⚡

⚡⚡ ఆరోగ్య మెరుపులు ⚡⚡ ————————————————— ఆరోగ్యం ఉండాలంటే వ్యాయమం చేయ్యాలి భాగ్యం ఉండాలంటే కష్టం చేయ్యాలి !! 656 విష పదార్థాలతో విందులు ఎందుకు ఆల్కాహాల్ లతో ఆరోగ్యం పాడెందుకు !! 657 కోట్లున్నయని కరోనా వదిలి పెడుతుందా చేస్తుంది హైరానా ప్రాణంపోనిది ఒదులుతుందా !! 658 పొద్దుగాల నడక మంచి ఆరోగ్యమిచ్చు త్వరగా పడక దేహ ధారుడ్యమిచ్చు !! 659 గొంతు ఎండకుండ తాగాలి నీరెపుడైన కడుపు మండకుండ తినాలి అన్నమెపుడైన !! 660 ఎక్కువ నీరు శరీరానికి అందం కొట్టదు బోరు నడకే అందం !! 661 ప్రాణం వుంటేనే తిండి బాధ మనిషే లేకుంటే కన్నీటి రోధ !! 662 మనిషికి తెలిసింది డబ్బుతో రక్షణలేదని మనసుకు తెలిసింది బంధంలేనిది బుతుకులేదని !! 663 అల్లం వెల్లుల్లి అబ్బో ఎంతఘాటు అవిచేయవు లొల్లి శరీరానికి చేటు !! 664 ఆరోగ్యం అంటే ఆకుకూరల తిండి మహాభభాగ్యం అంటే వ్యాయామమే కదండి !! 665 పాలు పెరుగులు శరీర బలాలు పప్పు దినుసులు ఐరనిచ్చు కణాలు !! 666 నేరుగా పండుతింటే అది ఆరోగ్యం ఐస్ లోవేసి తాగుతుంటే అది అనారోగ్యం !! 667 భాదాంలు పిస్తలు తెలివిని పెంచుతాయి ఖర్జూర చెర్రీలు చురుకుగ నిలుపుతాయి !! 668 కలిసుండే నవ్వు అందరిలో ఆరోగ్యమిచ్చు కష్టపడే చిరునవ్వు...

⚡⚡నాన్న మెరుపులు ⚡⚡

⚡⚡నాన్న మెరుపులు ⚡⚡ ———————————— నాన్న కష్టంలేనిది కుడుపు నిండదు నాన్న ఇష్టంలేనిది అమ్మకూర వండదు !! 646 ఎప్పుడు నలిగిపోతడు నాన్న అన్నింటిలో ఎప్పుడు వెలిగిపోతడు నాన్న విజయాలలో !! 647 నవమాసాలు మోసేది జన్మనిచ్చే అమ్మ నిరంతరం నలిగేది నడకనేర్పు నాన్న !! 648 తలతాకట్టు పెడతడు కుటుంబం కోసం ఉన్నందంత పెడతడు బంధాల కోసం !! 649 శ్రమనే నమ్ముతడు పోషన కొరకు దేనిని అమ్మడు ముందుచూపు కొరకు !! 650 అవమానాలు ఎన్నైనా అరిగించు కుంటడు కష్టాలు ఎన్నైనా ఇష్టంగ చేసుకుంటడు !! 651 కనబడని సంద్రాన్ని కళ్ళల్లో మోస్తడు చెరగని ధైర్యాన్ని మనకేమో ఇస్తడు !! 652 సూటిపోటి మాటల్ని పెడచెవిన పెడతడు బతికేటి రాతల్ని మనముందు పెడతడు !! 653 కలలేన్నో కంటడు కష్టాల్ని మరచి నిదురపోక మేల్కోంటడు మార్పుకొరకు అరచి !! 654 ఆస్తులు లేకున్న ఆనందిస్తడు కోట్లు ఇవ్వకున్న నమ్మకమనే రెక్కలిస్తడు !! 655 తాండ్ర చిరంజీవి

⚡⚡ మెరుపులు ⚡⚡ శుభ్రత లేకుంటే

⚡⚡ మెరుపులు ⚡⚡ ————————————— కరోనా వచ్చిందని కంగారు పడోద్దు వైరస్ పోతుందని చేతులుకడుగుట మానద్దు !! 638 మనకు భయముంటే ఎక్కువకాలం బతకలేము శుభ్రత లేకుంటే ఆరోగ్యంగ ఉండలేము !! 639 చైనోని దురాగతం కరోనా బాధ మనుషుల అంతం అదిఒక గాధ !! 640 అడ్డమైనవి తింటే కరోనా పుట్టుక ఇల్లు దాటకుంటే మనముంటాం గిట్టక !! 641 కుక్కలపాముల కూరలు మనుషులు తింటరా గబ్బిలాల కూరలు ఆలోచిస్తే తింటరా !! 642 ఆరోగ్యమును ఇచ్చె ఆకుకూరలు ఉన్నవి ఐరన్ లను ఇచ్చె పప్పు దినుసులున్నవి !! 643 మనుషుల పోలిన రాక్షాసులు మీరు వైరస్ లను సృష్టించిన దుష్టులు మీరు !! 644 వస్తులను కొనకుండ చైనాకుబుద్ది చెప్పాలి వైరస్ పాకకుండ బొందలేసి కప్పాలి !! 645 తాండ్ర చిరంజీవి

⚡⚡మాట మెరుపులు ⚡⚡

⚡⚡మాట మెరుపులు ⚡⚡ ——————————————— మాట అహమైతది ప్రాణాలు తీయడానికి మాట మమైతది ప్రాణాలు పొయ్యడానికి !! 623 మాట ఆవిరైతది నమ్మకం లేనప్పుడు మాట ఊపిరైతది నమ్మకం ఉన్నప్పుడు !! 624 మాట బలపడుతది తోడు ఉన్నప్పుడు మాట సన్నగిల్లుతది ఒంటరి అయినప్పుడు !! 625 మాట పరిమళిస్తుంది మంచిగా ఉన్నప్పుడు మాట నశిస్తుంది " చీ " కొట్టినప్పుడు !! 626 మాట గేయం రాగంతో పాడినపుడు మాట గాయం ఆలోచించక మాట్లాడినపుడు !! 626 మాట మంత్రం నమ్మినోళ్ళు ఉన్నప్పుడు మాట తంత్రం అనుసరించి నడచినప్పుడు !! 627 మాట ఆహారం సంతోషంగ ఉన్నప్పుడు మాట ఓకారం చెప్పింది విననప్పుడు !! 628 మాట మమకారం అమ్మ మాట్లాడినపుడు మాట " ఓం " కారం తండ్రి చెప్పినప్పుడు !! 629 మాట స్వీకారం పెద్దలనుండి గ్రహించినపుడు మాట వికారం మంచేదో తెలువనపుడు !! 630 మాట ఉత్తదే ఎవరు విననప్పుడు మాట గట్టిదే ఐక్యంగ ఉంచినప్పుడు !! 631 మాట ఎగిరిస్తది ఉత్తమ నటుడిగా మాట ఒదిగిస్తది ఉత్తమ ఇల్లాలిగా !! 632 మాట వేదనపడుతది నిజాన్ని మార్చినప్పుడు మాట బాధపడుతది తొందర పడ్డప్పుడు !! 633 మాట ఇస్తది మంచి నైవేద్యం మాట చేస్తది ఉత్తమ వైద్యం !! 634 మాట సుగంధం ఇతరుల నవ్వించినప్పుడు మాట ద...

⚡⚡ మెరుపులు ⚡⚡ సాయమొక్కటి చాలు

⚡⚡ మెరుపులు ⚡⚡ ఉదయం చూడని హృదయం వ్యర్థం ఉత్సాహంగా పాడని స్వరపేటిక వ్యర్థం !! 606 మేడలు అద్దాలుకావు రాయితో పగలడానికి గోడలు కాగితాలుకావు చేతితో చింపడానికి !! 607 సాయమొక్కటి చాలు నీతిగ బతికినందుకు గాయమొక్కటి మేలు తిరిగితప్పు చేయనందుకు !! 608 దోచి పెట్టెందుకు రాశులు వుండాలి పంచి పెట్టెందుకు పైసలు వుండాలి !! 609 నువ్వెత్తే పిడికిలి దున్నే నాగలవ్వాలి ముగ్గుసే ముంగిలి హితభోద నేర్పాలి !! 610 పోయిన దొరుకుతది కష్టపడ్డ సొమ్ము ఇష్టం అయినది కష్టకాలమందు అమ్ము !! 611 రాజులు పాలించారని గాజులపై చరిత్రల్లేవు రాజులు పోయారని బతుకుల్లో మార్పుల్లేవు !! 612 ఉద్దండ పిండమంటె పోటికి రాడు సత్తిగాడు సన్నగంటె అసలు ఊరుకోడు !! 613 నీరుగారోద్దు ఎపుడు నీరుత్సాహంతో ఉన్నా పొంగిపోవద్దు ఎపుడు ఉత్సాహంతో ఉన్నా !! 614 మాటవినని మనిషి లేకున్న ఒక్కటే తీసుకుంటాడు మనిషి ఎప్పటికైన నిర్ణయమొక్కటే !! 615 మనసు మంచిగుంటే నయనం నాట్యమాడుతది పాత్ర మంచిగుంటే అభినయం కొట్టస్తది !! 616 గాలిలో మేడలు స్థిరము కాదెపుడు కలలో జాడల...

⚡⚡ కరోనా మెరుపులు ⚡⚡

⚡⚡ కరోనా మెరుపులు ⚡⚡ ———————————————— మనుషులను చంపేది కనపడని వైరస్ మనుషులను బతికించేది ఐక్యంగావుండే కోరస్ !! 591 కరోనాకు కళ్లులేవు అందరిని చూస్తుంది కరోనాకు చేతుల్లేవు అందరిని చంపేస్తుంది !! 592 కరోనాకు జాలిలేదు అందరిని మింగుతుంది కరోనాకు బాధలేదు చంపికుప్ప పెడుతుంది !! 593 నీళ్ళు తాగకుంటే కరోనా వచ్చు శుభ్రంగా వుంటే కరోనా చచ్చు !! 594 ఇంట్లో ఉండడం కరోనాకు మందు కుటుంబంతో గడపడం అందరికి విందు !! 595 మాస్కులు వాడితే కరోనా చచ్చు దండాలు పెడితే మర్యాద హెచ్చు !! 596 పెంపొందు అనురాగం ఇంట్లో వుంటే అదేమనకు బంగారం అందరితో కలిసుంటే !! 597 లాక్ డౌన్ అంటే లాక్ వేయడంకాదు మనుషులు అంటే బయట తిరగడంకాదు !! 598 మనకమనం వేసుకోవాలి కఠినమైన శిక్ష ఆరోగ్యాలను దాచుకోవాలి అదేమనకు రక్ష !! 599 కరోనాను చంపుట డాక్టర్ల లక్ష్యం కరోనాను పంపుట మనందరి లక్ష్యం !! 600 రోడ్లను ఊడ్చేను సఫాయి కార్మికులు రోగాలతో ఏడ్చేను కష్టబోతు శ్రామికులు !! 601 వారివల్ల మనకు ఎపుడు శుభ్రత కలలోనైన కనకు కరోనాకులేదు భద్రత !! 602 చేతులెత్తి మొక్కాలి వారి త్యాగాలకు విలువిచ్చి చూడాలి వారి పనులకు !! 603 కరోనాను చంపుటకు డాక్టర్లే దేవుళ్ళు దాన్ని తరిమేయుట...

⚡⚡ మెరుపులు ⚡⚡ ధైర్యమే బతికిస్తది

⚡⚡ మెరుపులు ⚡⚡ ————————————— భయమే చంపేస్తది మనలను ఇపుడైన ధైర్యంమే బతికిస్తది మనలను ఎపుడైన !! 581 ఉద్యమాలు చేశాము తెలంగాణ కోసము అడుగులను దాచాము కరోనా కోసము !! 582 మనకు కనబడకుంటనే శరీరంలోకి వస్తుంది మనం దగ్గరుంటనే ప్రాణాలు బలిచేస్తుంది !! 583 కరోనానుండి బ్రతుకుటకు ఇల్లేమనకు శరణ్యం సమాజాన్ని కాపాడుటకు మాటేమనకు శరణ్యం !! 584 కరోనా ఎంతటిదైన మనశుభ్రత ఖతంచేస్తది ఇట్లుండుట కష్టమైన ఫలితం చూపిస్తది !! 585 అడ్డమైనవి తిని కొత్తరోగాలు తేవద్దు వాటిని అంటిపెట్టుకొని పదిమందిని బలిచేయ్యద్దు !! 586 సపాయి కార్మికులు చేస్తున్నరు శుభ్రత నిజమైన ధార్మికులు వారిపనివల్ల మనకుభద్రత !! 587 నిదురలేదు గర్జించేసింహాలకి మనకోసం తిప్పలుపడుతున్నరు కరోనా కట్టడికి లాఠీలు పడుతున్నరు !! 588 ఏవ్యాధికి భయపడద్దు ప్రాణంపోయు వైద్యం వైరస్ లకు జడియద్దు డాక్టర్లుపెడతరు నైవేద్యం !! 589 హిమాలయ కొండల్లో గస్తిగాస్తు వుంటరు శత్రువుల గుండెల్లో జవాన్లు నిదురపోతువుంటరు !! 590 పోలిసులు జవాన్లు ప్రజల రక్షణకొరకు సపాయిలు డాక్టర్లు ప్రజల సేవకొరకు !! 591 ఈనలుగురు బ్రతికుంటారు ఎపుడు హృదయాలలో వారు కూడబెట్టుకుంటారు ధనాన్ని అభిమానరుపాలలో !! 592 తాండ...

నిజమైన దేవుడు " డాక్టరే " !!

నిజమైన దేవుడు " డాక్టరే " !! —————————————— మనుషులకు దేవుడిపై నమ్మకం వుండాలి అంతేకాని గుడ్డినమ్మకం కాదు పూజలు,ప్రార్థనలు , నమాజులు చెప్పాయా "కరోనా " ఎపుడు చచ్చి పోతుందని ఏదో చెప్పాలి కాబట్టి అందరు ఏవేవో మాటలు వారి కడుపు తిప్పల కోసం చెబుతున్నారు కంటికే కనిపిస్తలేదు " కరోనా " ఐన ప్రపంచాన్ని కల్లోలం చేసి శవాలుగా మారుస్తుంది ఇంకా కొందరు ఈదేవుడని ఆదేవుడని బుకాయింపు మాటలు చెబుతున్నారు దేవుళ్ళే గుడి తలుపులు మూసుకొని పడుకున్నారు ఇక దయ్యాల ఊసేలేదు మహామహా సంపన్న దేశాలే కరోనా కత్తికి భలైపోతుంటే ఇంకా గుడ్డినమ్మకాలే....! మంత్రాలకు చింతకాయలు రాలవని తెలిసిన మన పద్దతులు ఆచారాలు... కరోనాకు ఆడమగ తేడాలేదు వున్నోళ్ళు లేనోళ్ళు అని తేడాలేదు చిన్నాపెద్దా , ఈమతం ఆమతం, నలుపు తెలుపు అనే తేడాలు అసలు లేవు క్షణాలలో ఎటునుంచి ఎటైన వచ్చి చంపేస్తుంది మనల్ని మనం రక్షించుకోవాలంటే ఇల్లుదాటి బయటకు రాకుండా వుండడమే అనునిత్యం శుభ్రతను పాటించడమే ఇప్పుడు ప్రపంచానికి ఒక్కదేవుడే వున్నాడు ఆయనే ప్రాణంపోసే " డాక్టరు " ఆ వైద్యుని నిరంతర పోరాట ఫలితమే మన ప్రాణాలకు రక్షణ. అతడు కనిపెట్టే మందు కరోన...

⚡⚡ మెరుపులు ⚡⚡ దేనికి భయపడని గుండెధైర్యం మాది

⚡⚡ మెరుపులు ⚡⚡ ————————————— ఓ... కరోనా జలుబుతో వస్తావే నీవల్ల హైరానా త్వరలో చస్తావే !! 571 దేనికి భయపడని గుండెధైర్యం మాది అసలే మాటతప్పని మనసు మాది !! 572 చేతులు కడుగి నిన్ను చంపుతాము టిష్యులు వాడి నిన్ను బొందపెడతాము !! 573 మాట తప్పే మనుషులం కాము రోగాన్ని కప్పే మనుషులం కాము !! 574 అహంతో విర్రవీగుట నీ వంతు నిన్ను విరిచివేయుట మా వంతు !! 575 నీకు కనపడకుండ చంపే గుణముంది మేము చావకుండ కఠిన నియమముంది !! 576 నిన్ను హత్యచేస్తుంది మా శుభ్రతే మాకు రక్షణనిస్తుంది మా భద్రతే !! 577 సానిటైజర్ ను వాడి చక్కగ బతుకుదాము షేక్ ఆండ్ లను వీడి దండాలు పెడదాము !! 578 వీరులను కన్న దేశం మాది ఐక్కతతో ఉన్న సమాజం మాది !! 579 కరోనాను చంప అందరోక్క టౌవుదాము నియమాలు పాటింప కఠినంగా వుందాము !! 580 తాండ్ర చిరంజీవి వరంగల్ అర్భన్ సెల్ : 9959180762.

*కరోనాను మించిన హైరానా* ...✒️ *బింగిదొడ్డి వెంకటేష్* *విద్వద్గద్వాల సాహితీ సేవకులు*

&nbsp; కరోనాకి క్లోనింగ్ చేస్తే అచ్చంగా మానవుడే మళ్లీ పుడతాడు వీడు మనిషని జాలిపడితే ఖచ్చితంగా వైరస్ను తలదన్నే విషపుజీవై మళ్ళీ మళ్ళీ కుడతాడు పచ్చని కానలను మొక్కజొన్న కంకుల్లా కాల్చుకుతిన్నాడు వెచ్చని కాంక్రీటు కీకారణ్యంలో బంధాన్ని అందాన్ని బందూకులా మార్చాడు కండ్లున్నా అంధగాడిలా నటిస్తూ నర్మగర్భంగా ఊరేగుతున్నాడు విలువల్ని వలువల్లా గాలికొదిలేస్తూ నగ్నంగా చెలరేగుతున్నాడు అయ్యా.!ఎవరయ్యా.!కరోనా అత్యంత ప్రమాదకరమని అరిచింది ఓరయ్యో.!కనరయ్యా.! దాన్ని మించిన వింతజీవెప్పుడో అవతరించింది. <hr /> <em>ఇంట్లో ఉందాం</em> <em>సామాజిక దూరం పాటిద్దాం</em> <em>ఆరోగ్యంగా ఉందాం,ఉంచుదాం</em>

** కరోనా పాట **

** కరోనా పాట ** ————————— పల్లవి :— ————— కరోనా..కరోనా — ఉయ్యాలో తుంగుటుయ్యాలో చైనాలో పుట్టింది — ఉయ్యాలో తుంగుటుయ్యాలో !! 2 !! చరణం :— ————— నూరేండ్ల కోసారి — ఉయ్యాలో తుంగుటుయ్యాలో కొత్తపేరుతో వస్తావే — ఉయ్యాలో తుంగుటుయ్యాలో !! 2 !! చరణం :— ————— మాయాదారి మహామ్మారివే — ఉయ్యాలో తుంగుటుయ్యాలో మనుషులను సంపుతుంటివే — ఉయ్యాలో తుంగుటుయ్యాలో !! 2 !! చరణం :— ————— నిను బొందపెడతామే — ఉయ్యాలో తుంగుటుయ్యాలో నిను కాల్చివేస్తామే — ఉయ్యాలో తుంగుటుయ్యాలో !! 2 !! చరణం :— ————— చేతులను కడుగుతాము — ఉయ్యాలో తుంగుటుయ్యాలో శుభ్రంగా వుంటాము — ఉయ్యాలో తుంగుటుయ్యాలో !! 2 !! చరణం :— ————— మాస్కులు వేస్తాము — ఉయ్యాలో తుంగుటుయ్యాలో టిష్యులు పెడతాము — ఉయ్యాలో తుంగుటుయ్యాలో !! 2 !! చరణం :— ————— వేడివేడిగా తింటాము — ఉయ్యాలో తుంగుటుయ్యాలో వేడినీరు తాగుతాము — ఉయ్యాలో తుంగుటుయ్యాలో !! 2 !! చరణం :— ————— ఉద్యమాలనే ఉరకలెత్తించినం — ఉయ్యాలో తుంగుటుయ్యాలో నిను సంపుడొలెక్కా — ఉయ్యాలో తుంగుటుయ్యాలో !! 2 !! చరణం :— ————— తెలంగాణ బిడ్డలం — ఉయ్యాలో తుంగుటుయ్యాలో గర్జించే సింహాలం — ఉయ్యాలో తుంగుటుయ్యాలో !! 2 !! చరణం :— ————— ...

⚡⚡ మెరుపులు ⚡⚡ కావాలి జాగ్రత్త

⚡⚡ మెరుపులు ⚡⚡ ———————————— దగ్గు జలుబులతో కరోనా వైరస్సు త్రాగే నీళ్ళతో చంపచ్చు వైరస్సు !! 556 అసలే తాగద్దు చల్లని పానియాలు అసలే తాకద్దు చల్లని గాలులు !! 557 ఎండలలో తిరగి కరోనాను చంపండి వేడివేడిగా తిని కరోనాను పంపండి !! 558 చేతులు శుభ్రంలేకున్న కరోనా వచ్చు దండం పెట్టకున్న కరోనా వచ్చు !! 559 విందులు వినోధాలు దూర ముంచుదాం షాపింగులు సినిమాలు బందు పెడదాం !! 560 సకలజనుల సమ్మెను సంక్కంగ జేత్తిమి కరోనాను సంపను తీర్మానము జేత్తిమి !! 561 ఒక్కరం వేరైన ఓడి పోయినట్లే అందరం ఒక్కటైన కరోనాను చంపినట్లే !! 562 అనుమాన మనిపిస్తే వైద్యున్ని చేరాలి మందులను మానేస్తే పేషెంట్ గా మారాలి !! 563 ఒక్కొక్క నీటిబొట్టు చెరువైనట్టు నియమాలుపాటిస్తే ఒట్టు మనం బ్రతికినట్టు !!564 కావాలి జాగ్రత్తలు మనం బ్రతకడానికి పాటించాలి నియమాలు కరోనాను చంపడానికి !! 565 తాండ్ర చిరంజీవిి

* మెరుపులు * కాలం

** మెరుపులు ** ———————— సమయం కరిగిపోతున్న కాలం ఆగదు ఆలోచన పెరుగుతున్న ఆశ చావదు !! 551 బంధించి వుంచలేము కాలాన్ని పట్టి కాలంతో పోరాడలేము హృదయాన్ని తట్టి !! 552 ఆగమంటే ఆగేదికాదు కాలం ఎపుడు సాగమంటే సాగేదికాదు కాలం ఎపుడు !! 553 ఉన్నాము మనం దాని గుప్పిట్లో అనుకున్నాం మనం అదిబానిసని అప్పట్లో !! 554 కాలం నాగుపామైతది కాటు వేయుటకు తప్పించు కోవాల్సివస్తది మనం బ్రతుకుటకు !! 555 తాండ్ర చిరంజీవి

** మెరుపులు ** విద్యార్థులు

** మెరుపులు ** ———————— విద్యార్థులు అంటే వికసించే పూవ్వులు గుర్తోస్తాయి వారినిచూస్తుంటే పరిమళించు నవ్వులు !! 546 మార్కులు రావాలంటే కష్టపడి చదవాలి పేరు నిలపాలంటే ఇష్టపడి చదవాలి !! 547 విందులు వినోదాలకు దూరం ఉండండి చిందులు మందులకు దరి చేరకండి !! 548 దిక్కులు చూసిన సమయం పోవు పక్కలు చూసిన పరీక్ష పోవు !! 549 పరీక్షలు ఇచ్చు మంచి ఫలితాలు రాయకపోతే వచ్చు దుష్ ఫలితాలు !! 550 తాండ్ర చిరంజీవి వరంగల్ అర్భన్

⚡ మెరుపులు ⚡అమ్మ

⚡⚡ మెరుపులు ⚡⚡ ————————————— అమ్మలేని జన్మ అసలు వుండదు జరగకపోతే కర్మ స్వర్గం వుండదు !! 533 మాటలో స్పష్టత దారి చూపిస్తది వేటలో నిపుణత గురి చేదిస్తది !! 534 గుండెలుతీసిన బంటు బండలు కొట్టడు విలువతెలువని చింటు ఎంగిలి ముట్టడు !! 535 విమర్శలే విజయాలు ఓపికతో వున్నవారికి ప్రశంసలే అపజయాలు గర్వంతో నడచువారికి !! 536 బాధ్యతలనేవి ఎపుడు బరువులు కాదు మాటలనేవి ఎపుడు అరుపులు కాదు !! 537 మోముపై చిరునవ్వు రోగాలు నయం నవ్వాలి చిరునవ్వు విజయం కాయం !! 538 కన్ను చిన్నదైన మిన్నంత జూస్తది కలము చిన్నదైన బుక్కంత రాస్తది !! 539 అతుకుల బతుకుకు అర్థం ఉండదు గతికే మెతుకు ఆకలి తీర్చదు !! 540 పూవ్వులు విరభూస్తే నవ్వులు వస్తవి రాతలు రంజిస్తే హృదయాలు సంతసిస్తవి !! 541 తాండ్ర చిరంజీవి

*అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు* 🌹🌹🌹🙏🌹🌹🌹

<em>అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు</em> 🌹🌹🌹🙏🌹🌹🌹 కాలం మహాచక్రం కాళ్లకు చక్రాలను ధరించి కాలంతో పోటీపడి మనల్నీ మనకుటుంబాన్ని మనం వసిస్తున్న వసుధైకకుటుంబాన్ని అభివృద్ధి వైపు పరుగెత్తిస్తున్న, అతివలు అవనియంతటి ఓపికతో తరుణులు కల్పతరువులా కాంతలు కామధేనువులా మహిలో మకుటంలేని మహారాణులు మహిళలు... కుటుంబంలో కార్యాలయంలో కార్ఖానాలో కర్షకవృత్తిలో హర్షాతిరేకాలతో వారికి వారి పనికి గౌరవంను విలువను ఇచ్చి మనస్ఫూర్తిగా అభినందిద్దాం <em>అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో</em> 🌹🌹🌹🌹🙏🌹🌹🌹🌹 <em>బింగిదొడ్డి వెంకటేష్</em>

⚡⚡ మెరుపులు ⚡⚡మహిళ

⚡⚡ మెరుపులు ⚡⚡ ————————————— సృష్టికి మూలం తల్లియైన మహిళ ఆమెచేతులు హలం కష్టపడే మహిళ !! 522 బరువులను మోసేది బాధ్యతగల మహిళ ఇంటికిపేరు తెచ్చునది నైపుణ్యమున్న మహిళ !! 523 మహిళ మనసు వెన్నపూస ఆమెకు తెలుసు నలిగే గోస !! 524 సమస్యలను మౌనంగా ఎదుర్కోను మహిళ కష్టాలకు అనుగునంగా మసలుకొను మహిళ !! 525 కడుపులో దుఃఖాన్ని కళ్ళనుండి కారానీయదు మనసులో దుఃఖాన్ని మదినుండి జారనీయదు !! 526 ఆకాశం ఎత్తుని తాడుతో కొలువలేము మహిళ మనసుని దేనితో తూచలేము !! 527 ఓపిక మంతురాలు ఓర్చుకొను మహిళ ఇంటిలో గుణవంతురాలు అర్థంచేసుకొను మహిళ !! 528 మనసు గాయమైన దిగులు చెందు పని చేతనైన అభివృద్ది చెందు !! 529 మహిళ పొయ్యిగాదు ప్రతినిత్యం మండుతది మహిళ నెయ్యికాదు రుచులను వండుతది !! 530 మహిళ విలువ వెలపెట్టి కొనలేము ఆమెజీవితాన్ని మలువ త్యాగాలు చేయ్యలేము !! 531 మహిళ మాట గుండెలోదిగే తూట ఆమెనడుచు బాట పరిమళించు తోట !! 532 తాండ్ర చిరంజీవి వరంగల్ అర్భన్

⚡⚡ మెరుపులు ⚡⚡మాటలు

⚡⚡ మెరుపులు ⚡⚡ ————————————— మాటలు బాణాలైన మనసులు విరిగిపోవును మాటలు పూవ్వులైన మనసులు కరిగిపోవును !! 513 మాట మంత్రముకాదు చింతకాయ రాలుటకు మాట తంత్రముకాదు చనిపోయిన లేపుటకు !! 514 మాట మృదువైన నడిచేటి బాట మాట సున్నితమైన వికసించు తోట !! 515 మంచి మాట కారము కాదు జీవితంలో మాట భారము కాదు !! 516 పైసలతో కానివి మాటతో అయితవి ప్లాట్లున్న కానివి మాటతో అయితవి !! 517 మంచిమాట లెల్ల మర్యాదతెచ్చు చెడుమాట లెల్ల హృదయంలో గుచ్చు !! 518 మాటల పూదోటలు అందరికి కావాలి వికసించే తోటలు అందరు నడవాలి !! 519 మాటలు అభయము చెడుకు దారితీయ్యనప్పుడు మాటలు దుర్లబము మంచిని గ్రహించనప్పుడు !! 520 మాటలల్ల ఆప్యాయత విరిసిన పుష్పము మాటలల్ల సారుప్యత గుబాలించు పుష్పము !! 521 తాండ్ర చిరంజీవి

⚡⚡ మెరుపులు ⚡⚡విజయ చిహ్నాలు

⚡⚡ మెరుపులు ⚡⚡ ————————————— గాయాలు చేతులకు శ్రమకు ఆయుధాలు కిరీటాలు తలకు విజయ చిహ్నాలు !! 504 పైసలతో కొనలేము హృదయంలో అభిమానము సైగలతో చేయలేము దేవునికి విజ్ఞాపనము !! 505 నేర్పును జీవితాన్ని అనుభవజ్ఞుల మాటలు వదలద్దు మార్గాన్ని దారిచూపు బాటలు !! 506 శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వాదం ఇచ్చినారు అనుభవాలను తెలిపి బ్రతుకు నేర్పినారు !! 507 మాటలతో చెప్పలేను మదిలోని సంతసాన్ని రాతలతో చెప్పలేను దాగివున్న నిజాన్ని !! 508 అనుకరించుటకు మీరు గిరిగీసిన హద్దులు పాటించుటకు మీరు మాటతప్పని బద్దులు !! 509 మాటలకు దిగులుచెంది ఒంటరిగా నలిగితిని దీవెనలను పొంది చిరుదివ్వెగా వెలిగితిన !! 510 తాండ్ర చిరంజీవి

⚡⚡ మెరుపులు ⚡⚡ కవి

⚡⚡ మెరుపులు ⚡⚡ ————————————— కవి మాటలు నాన్యమైన కోటలు కవి పాటలు జీవపు ఊటలు !! 491 పిల్లల్ని అదుపుచేస్తే భవిషత్తు బంగారం పైసలను మదుపుచేస్తే జీవితాలు సింగారం !! 492 అన్ని అవయవాలుంటే అందగాడు కాదు మనసందం లేకుంటే అసలుమనిషే కాదు !! 493 డబ్బుతో కొనలేము మనిషి ప్రాణంవిలువ ఖరీదు పెట్టలేము మనసు విలువ !! 494 కాయాన్ని తిరిగివ్వడు కాటి కాపరి పైసలు దానమివ్వడు నేటి మదుపరి !! 495 ధైర్యం నీకుంటే నడక సాగుతది అధైర్యం వుంటే నడక ఆగుతది !! 496 క్రొవ్వత్తి కరిగిపోతూ కాంతిని ఇస్తుంది దీపం ఆరిపోతూ కండ్లు తెరిపిస్తుంది !! 497 చేయి జారితే వస్తువు వుండదు మాట జారితే విలువ వుండదు !! 498 బాలకవి అర్జున్ చిన్న బుడతడు కవిత్వంలో అర్జున్ వడితిరిగిన బడితెడు !! 499 రాసేటి మెరుపులు రమణీయముగా వుండు అనుభవాల తీపులు కమనీయముగా వుండు !! 500 తాండ్ర చిరంజీవి వరంగల్ అర్భన్

⚡⚡ మంచిచేయు మెరుపులు ⚡⚡

⚡⚡ మంచిచేయు మెరుపులు ⚡⚡ ——————————————————————— ఒదిగి వుంటే ఎదుగుదల అన్నట్లు అహంకారంతో వుంటే అడుగుస్థాయి అన్నట్లు !! 671 మంచి మాటలేపుడు మాలలు అవుతాయి మంచి పనులేపుడు జ్ఞాపికలు అవుతాయి !! 672 రంగు ఏదైనా పరిగణలోకి రాదు ఎత్తుపల్లాలు ఏవైనా లెక్కలోకి రాదు !! 673 మంచిచేయుట కొరకు మనిషి బతకాలి మంచిమార్గముల కొరకు మనిషి వెతకాలి !! 674 స్వార్థబుద్దిని ఎపుడు సమాధి చేయాలి మంచిబుద్దిని ఎపుడు భుజాలపై మోయాలి !! 675 ఉన్నందంత నీవు ఊడ్చి ఇవ్వకు ఇచ్చేవారిని చూసినీవు ఎపుడు ఏడ్వకు !! 676 దాతగా బతికితే నీకు దండాలు రక్తదాతగా బతికితే వేయి దండాలు !! 677 పుట్టుకతో ఏమి తేలేదు భూమికి వెళ్ళెటప్పుడు ఏమి తీసుకుపోలేము ఆకాశానికి !! 678 మంచి చెడులు రెండు దారులు మనంవేసే అడుగులు కావాలి మంచిదారులు !! 679 అహమన్నది చస్తేనే ఇలలో వుంటాము అందరితో కలిసుంటేనే పరంలో వుంటాము !! 680 దోచుకొని దాచువాడు దాత కాలేడు నిత్యము పెట్టువాడు అవినీతుడు కాలేడు !! 681 కష్టంలో మనము చేయి సాపాలి దాతృత్వంలో మనము చేయి ఒదలాలి !! 682 అస్థిరము ఐనది ఈ అస్థిపంజరము స్థిరమేమో కానిది ఈ చిలకపంజరము !! 683 నవ్వుతూ బతికితే ఆయుష్యు పెరుగు నలుగురిని ఓర్చితే సంపదలు కల...

*అమ్మ ...సృష్టికి రక్షకకవచం*

*అమ్మ ...సృష్టికి రక్షకకవచం*🧑👸 ****...**** బింగిదొడ్డి వెంకటేష్, ననుగన్న మాయమ్మా.. ననుపెంచిన మాయమ్మా... నాజన్మ మర్మమేమి అనురాగపు ముద్దుగుమ్మా నేెనుగన్న నాముద్దులకొడుకా నేపండించిన మురిపాల పూదోటా పురుడుపోసిన తొలినాడే చెప్పా మతిమరుపు మైనపుముద్దా తుమ్మమొద్దువోలే కదలకమెదలకుండక కుంచెపట్టి చిత్రించడమే కలంపట్టి సృష్టించడమే గానించి నృత్తించడమే అనురాగాన్ని లాలించడమే ఆనందాన్ని పంచడమే అలుపెరుగక పయనించడమే నినునమ్మిన బతుకుల్లో వెలుగులు పూయించడమే యెంతెదిగినా...నాపసిబాలుడా జీవితమే బొమ్మలాట ఆడుకో నీకనువైనచోట భంగపడకు నీవెచ్చోటా బాధ్యతతో నడుచుకో ప్రతిచోటా ఎల్లవేళలా.. రక్షకకవచమై నేనుంటా. ( *మాతృదినోత్సవవేళ పాదాభివందనంతో అమ్మలందరికీ అంకితం* ) 🌹🌹🙏🌹🌹

పనిని నమ్ముకుంటే... (మెరుపులు)

⚡⚡ మెరుపులు ⚡⚡ ————————————— బతకడం కోసం చేయాలి పని మణుల కోసం తవ్వాలి గని !! 761 పని పాతరేస్తే ఇంట్లో జాతరే బీదల ఆదరిస్తే వెదజల్లు అత్తరే !! 762 పనిని నమ్ముకుంటే దేవుడు ఉన్నట్టే అదృష్టం వదులుకుంటే పైకిరావు అన్నట్టే !! 763 ఇతరులపై ఏడుపు తెచ్చిపెట్టు క్షామం కోరుకో వారిగెలుపు కలుగునీకు క్షేమం !! 764 అధిక ధనమున్న కాపాడదు ప్రాణం అధిక బలమున్న నెగ్గము రణం !! 765 తాండ్ర చిరంజీవి వరంగల్ అర్భన్ .

తెలంగాణ అవతరణ...(మెరుపులు)

తెలంగాణ అవతరణ — జూన్ 2 ——————————————— ( మెరుపులు ) పోరాటమే ఊపిరిగా బతికింది తెలంగాణ ఎదురెల్లి బలయ్యెనుగా వీరవనిత జాణ !! 816 అరవైతొమ్మిదిలో పోరు ఆగలేదెన్నడు యాబైయారెండ్ల పోరు సావలేదెన్నడు !! 817 వంటా వార్పులకు కుతకుత ఉడికింది రైల్ రోకోలకు ఊచలు లెక్కెట్టింది !! 818 సడక్ బంద్ లకు సన్నగిల్ల లేదు మిలియన్ మార్చ్ లకు సోలిపోలేదు !! 819 గన్ డౌన్ లకు గడగడ లాడలేదు పెన్ డౌన్ లకు పెట్రేగి పోలేదు !! 820 ఉద్యమాన్ని పట్టి ఊర్రుత లూగించింది కలాలను పట్టి పాటలను రాసింది !! 821 ఎదగుండెను తట్టి ఊపందుకున్నవి పోరుపాటలు హృదయాలను పట్టి నిదురలేపినవి ఉద్యమపాటలు !! 822 రబ్బరు బుల్లెట్లు రంజిపడ్డాయి లాటిలు తూటాలు విరచుకు పడ్డాయి !! 823 అహంకారం అనగదొక్కింది తెలంగాణ పోరు అణచివేతలకు గురైంది తెలంగాణ ఊరు !! 824 ప్రాణాలు ఇడసినగాని పట్టు విడువలేదు మాట మార్చినగాని పోరు ఆపలేదు !! 825 సకలజనుల సమ్మె సక్కంగా జరిగింది ప్రభుత్వపు దిమ్మె గట్టిగా విరిగింది !! 826 సోనియమ్మ ఏడ్చింది గుండె పగిలెలా.. తెలంగాణ ఇచ్చింది జై.. కొట్టెలా… !! 827 ఢిల్లినే వణికించే తెలంగాణ పోరు గల్లినే కది...

రైతు రాజుగావాలే...(కోకిలమ్మ పదాలు)

కోకిలమ్మ పదాలు ————————— దున్నడానికి అరక ఎద్దుతినేది పరక రైతుకంటేది మరక ఓ…కోకిలమ్మా…. !! రైతుచేసేది యవుసం యవుసంతో గాసం గాసంతోగడుస్తది మాసం ఓ….కోకిలమ్మా…. !! మంచిగా పండాలి పంట లేకుంటే పెద్ద తంట చేనుకు పెడతడ మంట ఓ….కోకిలమ్మా….. !! ధాన్యానికి రావాలి ధర లేకపోతే కొరకొర చావుకై పరుగు బిరబిర ఓ….కోకిలమ్మా….. !! రైతుకుండదు కొవ్వు చెవిన పెడతరు పూవ్వు రైతుకు రాదు నవ్వు ఓ….కోకిలమ్మా…. !! పంటకోసం అప్పుతెస్తడు ఎండలోన పనిచేస్తడు నమ్మే దేవునికి ప్రార్థిస్తడు ఓ….కోకిలమ్మా….. !! దున్నడానికి ట్రాక్టరు రైతు రియల్ యాక్టరు అతనిది గుడ్ క్యారెక్టరు ఓ….కోకిలమ్మా….. !! రైతుపెట్టును అన్నం రైతుకు మిగులు సున్నం రైతువేయడసలు కన్నం ఓ….కోకిలమ్మా….. !! రైతు రాజుగావాలే భూమిని పండించాలే అందరి కడుపునింపాలే ఓ…..కోకిలమ్మా…… !! తాండ్ర చిరంజీవి ఖిలా వరంగల్ , పడమర కోట వరంగల్ అర్భన్ జిల్లా సెల్ : 9959180762 .

పుస్తక మెరుపులు

⚡⚡ పుస్తక మెరుపులు ⚡⚡ ——————————————— జ్ఞానం ఇచ్చేది మంచి పుస్తకం మార్పు పొందేది మన మస్తిస్కం !! 766 ఆది గ్రంథాలుంటే ఇతిహాసాలు తెలుస్తవి నేటి గ్రంథాలుంటే పోకడలు తెలుస్తవి !! 767 ప్రశ్నించేతత్వం నేర్పేవి కొన్ని పుస్తకాలు పాపంచేయకని చెప్పేవి కొన్ని పుస్తకాలు !! 768 విలువలు నేర్పేవి మంచి పుస్తకాలు మంటలు ఆర్పేవి జ్ఞానమిచ్చు పుస్తకాలు !! 769 పుస్తకం దగ్గరుంటే స్నేహితుడు ఉన్నట్లు పుస్తకానికి దూరముంటే అందరికి శత్రువులమన్నట్లు !! 770 ఇంటి బాధలకు ఇగురం చెబుతది ఒంటి బాధలకు మందులను చెబుతది !! 771 సంసారమే మిన్న చావడం ఎందుకు పుస్తకం చదవరాకన్న బాధపడడం ఎందుకు !! 772 కఠిన సమస్యలకు పొత్తం పరిస్కారమిస్తది కంగారుపెట్టె కన్య్పూజన్లకు పొత్తం సమాధానమిస్తది !! 773 హృదయాలు దోచలేవు కోట్లున్నగాని పదిమందికి పంచలేవు పైసలున్న గాని !! 774 కష్టాలలో కన్నీరు తడుచును పుస్తకము తీయ్యని పన్నీరు అనుభవాల పుస్తకము !! 775 భాషతో అలరిస్తది మంచి పుస్తకము యాసతో పులకరిస్తది ప్రాంతీయ పుస్తకము !! 776 జాతక చక్రాల జాడ తెలుపుతది వాహన చక్రాల స్పీడు తెలుపుతది !! 777 పుస్తకం అట్టజూసి ఆగ...

పట్టాలపై పాదయాత్ర

పట్టాల పై పాదయాత్ర ————————————— కరోనా…? ఎంతటి దౌర్భాగ్య స్థితి తెచ్చావే ? పొట్టకూటి కోసం వలస కూలీలుగా వచ్చినవారు బతక లేక మూటముల్లే సదురుకోని సంకలల్ల బిడ్డల్ని ఎత్తుకొని సక్కగా రైలు పట్టాలెంబడి పాదయాత్ర చేసుకుంటూ వాళ్ళ రాష్ర్టాలకు బోతుండ్లు ! కలో గంజో తాగి ఈడనే వుందా మనుకుంటే కరోనా గజ్జున వణికిస్తుండే.. కరుణించే జాడలు లేక ఆకలికి తట్టుకో లేక ఉన్నఊరే ఉత్తమమని నడకను నమ్ముకోబట్టే ! నడక సాగితే మంచిదే కానీ..! ఓ పక్క మూటలు మరో పక్క అల్లరిచేసే తూటలు గంటెత్తు కుంటనే గుంజిసత్తది చేయి ఇప్పుడు… ఎన్ని గంటలైతాందో మోయబట్టి ! కరోనా…ఉన్నకాడుండక చైనా నుంచి ఉరికి వత్తివి వచ్చిందానివి ఓ మూలనుండక లోకాన్ని చుట్టేస్థివి అంతటితో ఆగితివా..? పాణాలు తీసుకుంట పరిహాస మాడుతాంటివి ! ఇంకెన్ని రోజులు నీ ఆటలు కరోనా..? ఓ మందు , సూదో వచ్చేవరకే " నవ్విన నాపచేను పండదన్నట్లు " నిన్ను చంపే టైం దగ్గర్లనే వుంది !! మా వలస కూలీల పాదాలకు విశ్రాంతి టైం అతి దగ్గరలోనే వుంది !! తాండ్ర చిరంజీవి వరంగల్ అర్భన్ సెల్ : 9959180762.

కత్తిలాంటి పోలిసన్నకు సెల్యూట్ ... !

కత్తిలాంటి పోలిసన్నకు సెల్యూట్ ... ! —————————————————— కరోనా మహామ్మారి కాలయముడై.. కాలకూఠ విషాన్ని కక్కుతుంటె కాలు కదప కుండ కఠిన నియమాలతో... కారు చీకట్లను పారదోలడానికి కార్యోన్ముకుడవై... కదిలావు కత్తిలా దండువై.. కనబడిన వారికి జాగ్రత్తలు చెబుతూ.. కఠినంగా నియమాలు అనుసరిస్తూ.. కంటికి రెప్పలా ప్రాణాలు కాపాడుతూ.. కలియుగ దైవం అనిపించుకున్నావు !! కుటుంబాలను విడచిపెట్టి కన్నపిల్లలకు దూరముండి కరోనా నిరోధానికి.. కత్తుల వలె లాఠిలు పట్టి కంగారుల వలె పరుగెత్తుతూ కంటి నిదురను చంపుకొని కాసుకు కూర్చున్నావు పోలిసన్నా !! కలిగిందే తిన్నావు కదలకుండ వున్నావు కుట్టినా దోమలను చంపుకుంటూ.. కారు చీకట్లలో పడుకున్నావు కరోనా రోగానికి జడియక కంచెలను వేశావు కాకి వేగం పుంజుకొని కారడవిలో తిరిగినట్లు... కార్లల్లో తిరుగుతూ.. కఠినంగా ప్రజలతో వ్యవహారించావు !! కమ్మనైన మనసు నీది కరోనాను అంతమొందించు ఆలోచన నీది కవ్వింపులకు తావులేదు కరోనాకు బతికే హక్కు లేదు కార్యశీలుడా మా పోలిసన్న " సెల్యూట్ " !! తాండ్ర చిరంజీవి ఖిలా వరంగల్ , పడమర కోట వరంగల్ అర్భన్ జిల్లా సెల్ : 9959180762.

⚡⚡ మెరుపులు ⚡⚡ అమ్మ- నాన్న

⚡⚡ మెరుపులు ⚡⚡ ————————————— అమ్మకు నవమాసాలు పురిటి నొప్పులు నాన్నకు బ్రతికినన్నాల్లు ఒంటి నొప్పులు !! 837 నాన్న నలిగిపోతడు అవమానాలన్నింటిలో నాన్న ఇబ్బందిపడతడు కష్టాలన్నింటిలో !! 838 నాన్న దుఃఖాన్ని కడుపులోనే దాచుకుంటడు నాన్న బాధల్ని గుండెలోనే దిగమింగుకుంటడు !! 839 నాన్నకు ఎపుడు పిల్లలపై ధ్యాస పిల్లలు పుట్టినపుడు ఒదలనని చేశాడుబాస !! 840 నాన్న తోడుంటే కొండంత బలం నాన్న లేకుంటే ఇల్లు ఎండినపోలం !! 841 పిల్లల భవిష్యత్తుకు తహతహ లాడుతడు వారి ఎదుగుదలకు తలతాకట్టు పెడతడు !! 842 నాన్న సంతోషాలను మనతో పంచుకుంటడు నాన్న దుఃఖాలను ఎదలోనే దాచుకుంటడు !! 843 నాన్న ముందుండి కార్యం జరిపిస్తడు నాన్న అడ్డముండి కష్టాలను తొలగిస్తడు !! 844 నాన్న వుంటే ఇంట్లో పులివున్నట్లు నాన్న లేకుంటే చలికూడ చంపుతదన్నట్లు !! 845 అమ్మ పేరుమీద రచించారు ఎన్నోబుక్కులు నాన్న పేరుమీద మిగిలేవి హక్కులు !! 846 నాన్న ఎంతపనిచేసినా అమ్మకన్న తక్కువంటం ఎవరన్న కొట్టినా "అమ్మా" అనేఅంటం !! 847 నాన్న బరువుమోసే మునగని పడవ అమ్మ నీటినిమోసే పగలని కడవ !! 848 ఇంటికి ఇద్దరు రెండ...

⚡⚡మహిళ⚡ ⚡ మెరుపులు⚡⚡

⚡⚡ మెరుపులు ⚡⚡ ————————————— సృష్టికి మూలం తల్లియైన మహిళ ఆమెచేతులు హలం కష్టపడే మహిళ !! 522 బరువులను మోసేది బాధ్యతగల మహిళ ఇంటికిపేరు తెచ్చునది నైపుణ్యమున్న మహిళ !! 523 మహిళ మనసు వెన్నపూస ఆమెకు తెలుసు నలిగే గోస !! 524 సమస్యలను మౌనంగా ఎదుర్కోను మహిళ కష్టాలకు అనుగునంగా మసలుకొను మహిళ !! 525 కడుపులో దుఃఖాన్ని కళ్ళనుండి కారానీయదు మనసులో దుఃఖాన్ని మదినుండి జారనీయదు !! 526 ఆకాశం ఎత్తుని తాడుతో కొలువలేము మహిళ మనసుని దేనితో తూచలేము !! 527 ఓపిక మంతురాలు ఓర్చుకొను మహిళ ఇంటిలో గుణవంతురాలు అర్థంచేసుకొను మహిళ !! 528 మనసు గాయమైన దిగులు చెందు పని చేతనైన అభివృద్ది చెందు !! 529 మహిళ పొయ్యిగాదు ప్రతినిత్యం మండుతది మహిళ నెయ్యికాదు రుచులను వండుతది !! 530 మహిళ విలువ వెలపెట్టి కొనలేము ఆమెజీవితాన్ని మలువ త్యాగాలు చేయ్యలేము !! 531 మహిళ మాట గుండెలోదిగే తూట ఆమెనడుచు బాట పరిమళించు తోట !! 532 తాండ్ర చిరంజీవి వరంగల్ అర్భన్