సుందర సృష్ఠి సాక్షాత్కరించె మన పల్లెలోన

సుందర సృష్ఠి సాక్షాత్కరించె

మన పల్లెలోన


జల్లు జల్లు మంది వాన

జర జరా సాగింది గంగ

గళ్ళు గళ్ళున గోమాత

చెంగు చెంగున పైరగాలి

 

వెన్నెల గానం మ్రోగించె

విక్రయశాల వికసించె

లక్ష్మీ మీట పరిచయమాయె

గంగిరెద్దుల ఆటవిడుపు

 

అక్షర ఙనం మదినచేరె

పరిణయబందం ఏర్పరిచె

ఉత్తమ కార్యం జరిపించె

సిరివెన్నెల ముత్యం చిందులువేసె

 

అద్బుత సంఘం సహకరించె

సేవామార్గం ప్రజ్వరిల్లె

జనగణమన అదినయకుడాయె

బ్రహ్మపాదం మోపె మన బంగారు పల్లెలోన...


---చంద్రహాసన్

Comments

Popular posts from this blog

రాఖీ మెరుపులు

అతనెక్కడికీ వెళ్లలేదు - చిత్తలూరి ఎస్సెన్