⚡⚡మాట మెరుపులు ⚡⚡

⚡⚡మాట మెరుపులు ⚡⚡
———————————————
మాట అహమైతది
ప్రాణాలు తీయడానికి
మాట మమైతది
ప్రాణాలు పొయ్యడానికి !! 623

మాట ఆవిరైతది
నమ్మకం లేనప్పుడు
మాట ఊపిరైతది
నమ్మకం ఉన్నప్పుడు !! 624

మాట బలపడుతది
తోడు ఉన్నప్పుడు
మాట సన్నగిల్లుతది
ఒంటరి అయినప్పుడు !! 625

మాట పరిమళిస్తుంది
మంచిగా ఉన్నప్పుడు
మాట నశిస్తుంది
" చీ " కొట్టినప్పుడు !! 626

మాట గేయం
రాగంతో పాడినపుడు
మాట గాయం
ఆలోచించక మాట్లాడినపుడు !! 626

మాట మంత్రం
నమ్మినోళ్ళు ఉన్నప్పుడు
మాట తంత్రం
అనుసరించి నడచినప్పుడు !! 627

మాట ఆహారం
సంతోషంగ ఉన్నప్పుడు
మాట ఓకారం
చెప్పింది విననప్పుడు !! 628

మాట మమకారం
అమ్మ మాట్లాడినపుడు
మాట " ఓం " కారం
తండ్రి చెప్పినప్పుడు !! 629

మాట స్వీకారం
పెద్దలనుండి గ్రహించినపుడు
మాట వికారం
మంచేదో తెలువనపుడు !! 630

మాట ఉత్తదే
ఎవరు విననప్పుడు
మాట గట్టిదే
ఐక్యంగ ఉంచినప్పుడు !! 631

మాట ఎగిరిస్తది
ఉత్తమ నటుడిగా
మాట ఒదిగిస్తది
ఉత్తమ ఇల్లాలిగా !! 632

మాట వేదనపడుతది
నిజాన్ని మార్చినప్పుడు
మాట బాధపడుతది
తొందర పడ్డప్పుడు !! 633

మాట ఇస్తది
మంచి నైవేద్యం
మాట చేస్తది
ఉత్తమ వైద్యం !! 634

మాట సుగంధం
ఇతరుల నవ్వించినప్పుడు
మాట దుర్గందధం
ఇతరుల ఏడిపించినపుడు !! 635

మంచి తూట
ప్రాణం తీస్తది
మంచి మాట
చరిత్రలో నిలుస్తది !! 636
తాండ్ర చిరంజీవి
వరంగల్ అర్భన్

Comments

Popular posts from this blog

రాఖీ మెరుపులు

అతనెక్కడికీ వెళ్లలేదు - చిత్తలూరి ఎస్సెన్