⚡⚡ మెరుపులు ⚡⚡ కవి

⚡⚡ మెరుపులు ⚡⚡
—————————————

కవి మాటలు
నాన్యమైన కోటలు
కవి పాటలు
జీవపు ఊటలు !! 491

పిల్లల్ని అదుపుచేస్తే
భవిషత్తు బంగారం
పైసలను మదుపుచేస్తే
జీవితాలు సింగారం !! 492

అన్ని అవయవాలుంటే
అందగాడు కాదు
మనసందం లేకుంటే
అసలుమనిషే కాదు !! 493

డబ్బుతో కొనలేము
మనిషి ప్రాణంవిలువ
ఖరీదు పెట్టలేము
మనసు విలువ !! 494

కాయాన్ని తిరిగివ్వడు
కాటి కాపరి
పైసలు దానమివ్వడు
నేటి మదుపరి !! 495

ధైర్యం నీకుంటే
నడక సాగుతది
అధైర్యం వుంటే
నడక ఆగుతది !! 496

క్రొవ్వత్తి కరిగిపోతూ
కాంతిని ఇస్తుంది
దీపం ఆరిపోతూ
కండ్లు తెరిపిస్తుంది !! 497

చేయి జారితే
వస్తువు వుండదు
మాట జారితే
విలువ వుండదు !! 498

బాలకవి అర్జున్
చిన్న బుడతడు
కవిత్వంలో అర్జున్
వడితిరిగిన బడితెడు !! 499

రాసేటి మెరుపులు
రమణీయముగా వుండు
అనుభవాల తీపులు
కమనీయముగా వుండు !! 500
తాండ్ర చిరంజీవి
వరంగల్ అర్భన్

Comments

Popular posts from this blog

రాఖీ మెరుపులు

అతనెక్కడికీ వెళ్లలేదు - చిత్తలూరి ఎస్సెన్