వందనం ఓ సైనికా వందనం...
వందనం ఓ సైనికా వందనం
వందనం ఓ నాయకా వందనం
ముందున్నది ముప్పు అని తెలిసి ముందడుగేసిన నీ మొండి ధైర్యానికి వందనం
వెన్నుపోటు పొడిచే విరోధులు ఉండే దారినెంచిన నీ వీరత్వానికి వందనం
మృత్యువుని వెంటపెట్టుకు తిరిగే తెగింపుకు వందనం
సరిహద్దును ముద్దాడే నీ సంకల్పానికి వందనం
ఏ దిక్కునుండి ఏ దాడి జరుగుతుందో తెలియని అనిశ్చి తిలో సైతం
ఆనందాన్ని వెతుక్కునే నిబ్బరానికి వందనం
వందనం ఓ వీరుడా వందనం…
భరత భూమే నీ తల్లి అనుకున్నా వు
రణరంగమే నీ తండ్రి అనుకున్నావు
భరత మాతకు నీ భవిష్యత్తుని అంకితం చేశావు
పిరికి పందలోలే వచ్చి దొంగదెబ్బ తీస్తే
ఆరడుగుల మా ధైర్యం రక్తపు ముద్దై పోతే…
మీరు అమరులైన మంటల్లో భారతమే మండింది…
ఆ పోగల్లోంచి వచ్చిన కసి దేశమంతా పాకింది…
తిరగబడి తరిమితే ఆ చీకటి మూకలు ముక్కలైపోతాయి..
ఆ రాక్షస కోరల మదం అనిగిపోయెలా
తగిన బుద్ధి చెప్పేందుకు దేశం తహలాడుతోంది
మీ ఆత్మ శాంతికి నివాళులై మిగిలేందుకు
మీ త్యాగాలను మా గుండెల్లో నింపుకుని 130 కోట్ల జనం మీ వెంటే ఉంది.
దేశ రక్షణకై మీరుంటే మీ కుటుంబ రక్షణకు దేశమే కదిలొస్తున్నది..
మరువని త్యాగం మీది.. సడలని ధైర్యం మీది..
వందనం ఓ సైనికా వందనం
వందనం ఓ వీరుడా శతకోటి వందనం.
RV Writings
Comments
Post a Comment