తెలంగాణ అవతరణ...(మెరుపులు)
తెలంగాణ అవతరణ — జూన్ 2
———————————————
( మెరుపులు )
పోరాటమే ఊపిరిగా
బతికింది తెలంగాణ
ఎదురెల్లి బలయ్యెనుగా
వీరవనిత జాణ !! 816
అరవైతొమ్మిదిలో పోరు
ఆగలేదెన్నడు
యాబైయారెండ్ల పోరు
సావలేదెన్నడు !! 817
వంటా వార్పులకు
కుతకుత ఉడికింది
రైల్ రోకోలకు
ఊచలు లెక్కెట్టింది !! 818
సడక్ బంద్ లకు
సన్నగిల్ల లేదు
మిలియన్ మార్చ్ లకు
సోలిపోలేదు !! 819
గన్ డౌన్ లకు
గడగడ లాడలేదు
పెన్ డౌన్ లకు
పెట్రేగి పోలేదు !! 820
ఉద్యమాన్ని పట్టి
ఊర్రుత లూగించింది
కలాలను పట్టి
పాటలను రాసింది !! 821
ఎదగుండెను తట్టి
ఊపందుకున్నవి పోరుపాటలు
హృదయాలను పట్టి
నిదురలేపినవి ఉద్యమపాటలు !! 822
రబ్బరు బుల్లెట్లు
రంజిపడ్డాయి
లాటిలు తూటాలు
విరచుకు పడ్డాయి !! 823
అహంకారం అనగదొక్కింది
తెలంగాణ పోరు
అణచివేతలకు గురైంది
తెలంగాణ ఊరు !! 824
ప్రాణాలు ఇడసినగాని
పట్టు విడువలేదు
మాట మార్చినగాని
పోరు ఆపలేదు !! 825
సకలజనుల సమ్మె
సక్కంగా జరిగింది
ప్రభుత్వపు దిమ్మె
గట్టిగా విరిగింది !! 826
సోనియమ్మ ఏడ్చింది
గుండె పగిలెలా..
తెలంగాణ ఇచ్చింది
జై.. కొట్టెలా… !! 827
ఢిల్లినే వణికించే
తెలంగాణ పోరు
గల్లినే కదిలించే
తెలంగాణ పోరు !! 828
ప్రాణాల విలువతెలిసి
పార్లమెంటు అరిచెనూ
త్యాగాల చిట్టచూసి
లోకమంత ఏడ్చెనూ !! 829
విజయశాంతి కెసిఆర్ లు
పట్టుబట్టి నిలచిరి
అనేక రాష్ర్టాలు
వీరికి మద్దతిచ్చిరి !! 830
సుశ్మాస్వరాజ్ చిన్నమ్మ
గొంతెత్తి అరచింది
సోనియమ్మ పెద్దమ్మ
తెలంగాణ ఇచ్చింది !! 831
అరవైఏండ్ల గోస
తీరినాదిప్పుడు
తెలంగాణచేయాలి బాస
అభివృధ్ధిలో నడవాలిపుడు !! 832
కెసిఆర్ సారు
కోరిక తీరింది
తెలంగాణ పేరు
మారు మోగింది !! 833
అడ్డుగోడ కూలి
మనుషులను కలిపింది
వారికున్న జాలి
కరచాలనం చేసింది !! 834
అమరవీరులను కన్న
తల్లులకు వందనాలు
ప్రగతిపథాన నడుపుతున్న
కెసిఆర్ కు వందనాలు !! 835
ఆవిర్భావ తెలంగాణ
మాపెండ్లి రోజు
నూరెండ్ల మాగాణ
సిరులుపండాలి రోజు !! 836
తాండ్ర చిరంజీవి
వరంగల్ అర్భన్
సెల్ : 9959180762.
Comments
Post a Comment