⚡⚡ కరోనా మెరుపులు ⚡⚡
⚡⚡ కరోనా మెరుపులు ⚡⚡
————————————————
మనుషులను చంపేది
కనపడని వైరస్
మనుషులను బతికించేది
ఐక్యంగావుండే కోరస్ !! 591
కరోనాకు కళ్లులేవు
అందరిని చూస్తుంది
కరోనాకు చేతుల్లేవు
అందరిని చంపేస్తుంది !! 592
కరోనాకు జాలిలేదు
అందరిని మింగుతుంది
కరోనాకు బాధలేదు
చంపికుప్ప పెడుతుంది !! 593
నీళ్ళు తాగకుంటే
కరోనా వచ్చు
శుభ్రంగా వుంటే
కరోనా చచ్చు !! 594
ఇంట్లో ఉండడం
కరోనాకు మందు
కుటుంబంతో గడపడం
అందరికి విందు !! 595
మాస్కులు వాడితే
కరోనా చచ్చు
దండాలు పెడితే
మర్యాద హెచ్చు !! 596
పెంపొందు అనురాగం
ఇంట్లో వుంటే
అదేమనకు బంగారం
అందరితో కలిసుంటే !! 597
లాక్ డౌన్ అంటే
లాక్ వేయడంకాదు
మనుషులు అంటే
బయట తిరగడంకాదు !! 598
మనకమనం వేసుకోవాలి
కఠినమైన శిక్ష
ఆరోగ్యాలను దాచుకోవాలి
అదేమనకు రక్ష !! 599
కరోనాను చంపుట
డాక్టర్ల లక్ష్యం
కరోనాను పంపుట
మనందరి లక్ష్యం !! 600
రోడ్లను ఊడ్చేను
సఫాయి కార్మికులు
రోగాలతో ఏడ్చేను
కష్టబోతు శ్రామికులు !! 601
వారివల్ల మనకు
ఎపుడు శుభ్రత
కలలోనైన కనకు
కరోనాకులేదు భద్రత !! 602
చేతులెత్తి మొక్కాలి
వారి త్యాగాలకు
విలువిచ్చి చూడాలి
వారి పనులకు !! 603
కరోనాను చంపుటకు
డాక్టర్లే దేవుళ్ళు
దాన్ని తరిమేయుటకు
మనఇల్లే లోగిళ్ళు !! 604
రక్షకదలాలు మనపాలిట
సురక్షిత వలయాలు
కరోనావైరస్ పాలిట
వారువేసిరి కంచెవలయాలు !! 605
తాండ్ర చిరంజీవి
సెెెెెె
Comments
Post a Comment