* మెరుపులు * కాలం
** మెరుపులు **
————————
సమయం కరిగిపోతున్న
కాలం ఆగదు
ఆలోచన పెరుగుతున్న
ఆశ చావదు !! 551
బంధించి వుంచలేము
కాలాన్ని పట్టి
కాలంతో పోరాడలేము
హృదయాన్ని తట్టి !! 552
ఆగమంటే ఆగేదికాదు
కాలం ఎపుడు
సాగమంటే సాగేదికాదు
కాలం ఎపుడు !! 553
ఉన్నాము మనం
దాని గుప్పిట్లో
అనుకున్నాం మనం
అదిబానిసని అప్పట్లో !! 554
కాలం నాగుపామైతది
కాటు వేయుటకు
తప్పించు కోవాల్సివస్తది
మనం బ్రతుకుటకు !! 555
తాండ్ర చిరంజీవి
Comments
Post a Comment