అది నువ్వేనా అని...

మది నిండా నువ్వున్నా.., ఇంకేదో వెతుకుతున్న.

తపనెంతో కలుగుతున్నా.., తప్పొప్పులు చూస్తున్న.

 

అనుక్షణం కన్నులలో నీ రూపే తలుస్తున్నా…

నిరంతరం సంఘర్షణతో వెనకడుగే వేస్తున్న.

 

చెలించే నా మదిలో చెలించని చెలి రూపును,

చెరిపేయాలనుకున్నా… చేయలేకపోతున్న.

 

వలదని వారించెడి మెదడును మొద్దుబార పడుకోబెట్టి,

ఎగిసిపడే యదసవ్వడిని సమాధానపరుస్తున్న.

 

దాచిన దాగని వలపు ఉధ్రృతిగ కురుస్తున్నా…

సమయం కాదిదని దాని పీకనొక్కి అణుస్తున్న.

 

ఏమాయో నీ కళ్ళలో సూటిగ చూడలేకున్న.

నిరాయుధవైయున్నా నీ ఎదురుగ నిల్చోలేకున్న.

 

అనుక్షణం కన్నులలో నీ రూపే తలుస్తున్నా…

నిరంతరం సంఘర్షణతో వెనకడుగే వేస్తున్న.

Comments

Popular posts from this blog

రాఖీ మెరుపులు

అతనెక్కడికీ వెళ్లలేదు - చిత్తలూరి ఎస్సెన్