నీ హస్తపు కౌగలిలోనే...
అనుమానపు అగ్నిలో
నిజం దహనమైపోతే...
నమ్మకపు లోటులో
ప్రేమే కరువై, కనుమరుగై పోతే...
ఓదార్చాల్సిన చేయి విదిలించి కసిరిస్తే...
నీ భుజంపైనే నీ తల వాల్చుకునేందుకు నువ్వెప్పుడూ సిద్ధంగా ఉండాలి
నీ హస్తపు కౌగలిలోనే నువ్వు సేదతీరాలి...

ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురుచూస్తే
ఎందరో వస్తారు, ఎన్నో చేస్తారు, నీకు కావలసింది తప్ప..
అవసరం తనదైతే ఆకాశంనుంచైనా ఊడి పడతారు
ఆపద నీదైతే అందకుండా పోతారు
అందర్నీ కావాలనుకునే బలహీనత నీదైతే
ఒంటరిగా నడిచే బలం కూడా నీదవ్వాలి...
నలుదిక్కుల నుండి నిశీధి కమ్మేసినా
నీ లోపలి దివిటీ తో వెలుగును నింపెయ్యాలి...

RV writings
Comments
Post a Comment