నా జీవన్మరణం
నా జీవన్మరణం
నిన్న ఒక గతకాలపు చరిత్ర,
రేపు ఆశాప్రయానపు సౌధం,
జీవిత గమణంలొ నేడు ఒక అందమైన సత్యపు నిజం.
ఈ సృష్తిలొ భువి ఒక ఆధార మర్గం,
బ్రమ్మ ఒక మిధ్యాశాస్త్రం,
విష్ణుమూర్తి వీణాప్రళయవిహంగం,
మహేశ్వర నాట్యం గతిచక్రం.
జననమరణాలు అనురాగ బంధాల విస్పొటనం,
గతకాలపు చరిత్రలొ,
మిధ్యాసౌధపు సాధనలొ,
వీణాప్రళయపు సృష్తిమర్మంలో,
గతిచక్రపు సత్యనాట్యం,
ఈ భువిపై నా జీవన్మరణం.
---చంద్రహాసన్
Comments
Post a Comment