⚡⚡ మెరుపులు ⚡⚡ ధైర్యమే బతికిస్తది

⚡⚡ మెరుపులు ⚡⚡
—————————————

భయమే చంపేస్తది
మనలను ఇపుడైన
ధైర్యంమే బతికిస్తది
మనలను ఎపుడైన !! 581

ఉద్యమాలు చేశాము
తెలంగాణ కోసము
అడుగులను దాచాము
కరోనా కోసము !! 582

మనకు కనబడకుంటనే
శరీరంలోకి వస్తుంది
మనం దగ్గరుంటనే
ప్రాణాలు బలిచేస్తుంది !! 583

కరోనానుండి బ్రతుకుటకు
ఇల్లేమనకు శరణ్యం
సమాజాన్ని కాపాడుటకు
మాటేమనకు శరణ్యం !! 584

కరోనా ఎంతటిదైన
మనశుభ్రత ఖతంచేస్తది
ఇట్లుండుట కష్టమైన
ఫలితం చూపిస్తది !! 585

అడ్డమైనవి తిని
కొత్తరోగాలు తేవద్దు
వాటిని అంటిపెట్టుకొని
పదిమందిని బలిచేయ్యద్దు !! 586

సపాయి కార్మికులు
చేస్తున్నరు శుభ్రత
నిజమైన ధార్మికులు
వారిపనివల్ల మనకుభద్రత !! 587

నిదురలేదు గర్జించేసింహాలకి
మనకోసం తిప్పలుపడుతున్నరు
కరోనా కట్టడికి
లాఠీలు పడుతున్నరు !! 588

ఏవ్యాధికి భయపడద్దు
ప్రాణంపోయు వైద్యం
వైరస్ లకు జడియద్దు
డాక్టర్లుపెడతరు నైవేద్యం !! 589

హిమాలయ కొండల్లో
గస్తిగాస్తు వుంటరు
శత్రువుల గుండెల్లో
జవాన్లు నిదురపోతువుంటరు !! 590

పోలిసులు జవాన్లు
ప్రజల రక్షణకొరకు
సపాయిలు డాక్టర్లు
ప్రజల సేవకొరకు !! 591

ఈనలుగురు బ్రతికుంటారు
ఎపుడు హృదయాలలో
వారు కూడబెట్టుకుంటారు
ధనాన్ని అభిమానరుపాలలో !! 592
తాండ్ర చిరంజీవి
వరంగల్ అర్భన్

Comments

Popular posts from this blog

రాఖీ మెరుపులు

అతనెక్కడికీ వెళ్లలేదు - చిత్తలూరి ఎస్సెన్