*కరోనాను మించిన హైరానా* ...✒️ *బింగిదొడ్డి వెంకటేష్* *విద్వద్గద్వాల సాహితీ సేవకులు*
కరోనాకి క్లోనింగ్ చేస్తే
అచ్చంగా మానవుడే మళ్లీ పుడతాడు
వీడు మనిషని జాలిపడితే
ఖచ్చితంగా వైరస్ను తలదన్నే
విషపుజీవై మళ్ళీ మళ్ళీ కుడతాడు
పచ్చని కానలను
మొక్కజొన్న కంకుల్లా కాల్చుకుతిన్నాడు
వెచ్చని కాంక్రీటు కీకారణ్యంలో
బంధాన్ని అందాన్ని బందూకులా మార్చాడు
కండ్లున్నా అంధగాడిలా నటిస్తూ
నర్మగర్భంగా ఊరేగుతున్నాడు
విలువల్ని వలువల్లా గాలికొదిలేస్తూ
నగ్నంగా చెలరేగుతున్నాడు
అయ్యా.!ఎవరయ్యా.!కరోనా
అత్యంత ప్రమాదకరమని అరిచింది
ఓరయ్యో.!కనరయ్యా.! దాన్ని మించిన వింతజీవెప్పుడో అవతరించింది.
<hr />
<em>ఇంట్లో ఉందాం</em>
<em>సామాజిక దూరం పాటిద్దాం</em>
<em>ఆరోగ్యంగా ఉందాం,ఉంచుదాం</em>
Comments
Post a Comment