నా శ్వాసకి నీ పేరే...

నా శ్వాసకి నీ పేరే పెట్టుకున్నా నిరంతరం నిన్నే పిలవచ్చనే ఆశతో

నా ధ్యాసలో నిన్నే నింపుకున్నా నీ భక్తిలో మునిగిపోవాలని

నా అద్దం నిన్నే చూపిస్తుంది నన్ను నీలో పోగొట్టుకున్నాక

నీలాకాశం వ్యాపిస్తానంటుంది నా ప్రేమను చూపిస్తానని బెట్టు చేసింది మరి

నేలమ్మ ఓడిపోయానంటుంది నీ ప్రేమ భారాన్ని మోసికూడా నేనలసిపోలేదని తెలిసి

నీటి ప్రవాహం వెనకబడిపోయింది నా ప్రేమ ప్రవాహాన్ని అందుకోవడం చేతకాక

నిప్పుకూడా భగ్గున మండింది నా ప్రేమ జ్వాలని  అందుకుందామని ప్రయత్నం కాబోలు

ప్రకృతి పరవశించిపోయింది  అంతం కానిదొకటుందనే సత్యం తెలిసి

అంతమైనవన్నీ నాముందు మోకరిల్లుతున్నాయి మరి, వాటన్నిటిని నా ప్రేమలో లీనం చేసుకోమని ప్రార్థిస్తూ

Comments

Popular posts from this blog

రాఖీ మెరుపులు

అతనెక్కడికీ వెళ్లలేదు - చిత్తలూరి ఎస్సెన్