100% లవ్...

సముద్రమయినా భూమిపై 70% మాత్రమే నిండి ఉంది
కాని నువు నాలో 100% నిండి వున్నావు.
సూర్యుడైనా రోజులో 12 గంటలే కనిపిస్తాడు
కాని 24 గంటలు నా ఊహల్లో నువ్వే కనిపిస్తావు, నువ్వే నివసిస్తావు.
చంద్రుడైనా మాసానికోసారే పరిపూర్ణంగా కనిపిస్తాడు
నువ్వుంటే చాలు ప్రతి క్షణం నేను పరిపూర్ణుడినే అవుతాను.
ఎండాకాలం, వానాకాలం, శీతాకాలం
ఏ కాలమైనా సరే ఓ నాలుగు నెల్లుండిపోతుంది
కష్టకాలం, ఇష్టకాలం ఏ కాలమైనా సరే
అన్ని కాలాల పాటు నేను నీతోనే ఉంటాను, నీలోనే ఉంటాను.
అప్పుడో ఇప్పుడో ఎప్పుడో
పుట్టిన ప్రతీది చావాల్సిందే
ఒక్కసారే పుట్టినా నేను చచ్చేంతవరకు చావనిది నీపై నా ప్రేమొక్కటే.

నిన్ను గెలిపించేందుకు తాను ఓడేవాడు ఒక్కరైనా ఉంటే ఆ ఒక్కరు నేనే.

నిన్ను గెలిపించేందుకు ఓడేవారు చాలామంది ఉంటే, అందులో మొదటి వ్యక్తిని నేనే 

ఈ జీవితం నీది నిన్ను వదిలేస్తే జీవితాన్ని వదిలేసినట్టే.
నిన్ను మర్చిపోతే జీవితాన్ని మరిచినట్టే

నువ్వు బ్రతికిననంతకాలం నీకు బ్రతుకునిస్తా
నువ్వు చస్తే నిన్ను బ్రతికిస్తా..

నీ సంతోషానికి అవసరమైతే చావునైనా ప్రేమిస్తా…
నీ కన్నీటికి కారణమైతే ప్రేమనైనా ద్వేషిస్తా………
నాకు తెలిసినంతవరకు ప్రేమంటే నీ సంతోషమే….

నువ్వు సంతోషంగా ఉండేందుకు చావుకైనా సిద్ఢమే.

కొన్నింటికి కారణాలు కావాలి
కాని నువు నాతో ఉంటే నా సంతోషానికి ఇంకే కారణం అక్కర్లేదు.

నిరంతరం నిన్ను నాలో చూస్తూనే ఉన్నా

నన్ను నీలో చూసుకునే క్షణం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నా….

నా జీవితమనే పుస్తకంలో ప్రతి పేజీ నేదే
నా జీవితమనే పుస్తకంలో ప్రతి అక్షరం నువ్వే.

Comments

Popular posts from this blog

రాఖీ మెరుపులు

అతనెక్కడికీ వెళ్లలేదు - చిత్తలూరి ఎస్సెన్