నా ప్రాణసఖి

నా ప్రాణసఖి


ఈ భువిపై ఉన్నవి రెండే తనువులు

మొదటిది నా ప్రాణసఖి, చివరిది ఈ ఇష్ఠ సఖుడు

ప్రకృతిలో సంచరిసున్న నాకు సృష్ఠి అందాలు ఆసాంతం నీలో పల్లవించాయి

తొలిచూపులో మైమరచి, హరివిల్లుపై ఊయలలూగాం

సూర్యుడేహోమగుండమై, ఉరుములు-మెరుపులు భాజాభజంత్రీలై,

సెలయేటి ద్వనులు పెళ్ళి మంత్రాలై పంచభూతాల సమక్షంలో మనువాడాం

సప్తలోకాలలో ఇంద్రపాన్పుపై, పారిజాతాపూల పరిమళాలతో విరజిల్లే షయ్యపై,

అమృత రుచిని అందించే ద్రాక్ష తోటపై వెన్నెల వెలుగులలో

ఇద్దరం పెనవేసుకొని ఒకరిలో ఒకరం మమేకమయ్యాం.



చంద్రహాసన్

Comments

Popular posts from this blog

రాఖీ మెరుపులు

అతనెక్కడికీ వెళ్లలేదు - చిత్తలూరి ఎస్సెన్