పనిని నమ్ముకుంటే... (మెరుపులు)

⚡⚡ మెరుపులు ⚡⚡
—————————————

బతకడం కోసం
చేయాలి పని
మణుల కోసం
తవ్వాలి గని !! 761

పని పాతరేస్తే
ఇంట్లో జాతరే
బీదల ఆదరిస్తే
వెదజల్లు అత్తరే !! 762

పనిని నమ్ముకుంటే
దేవుడు ఉన్నట్టే
అదృష్టం వదులుకుంటే
పైకిరావు అన్నట్టే !! 763

ఇతరులపై ఏడుపు
తెచ్చిపెట్టు క్షామం
కోరుకో వారిగెలుపు
కలుగునీకు క్షేమం !! 764

అధిక ధనమున్న
కాపాడదు ప్రాణం
అధిక బలమున్న
నెగ్గము రణం !! 765

తాండ్ర చిరంజీవి
వరంగల్ అర్భన్ .

Comments

Popular posts from this blog

రాఖీ మెరుపులు

అతనెక్కడికీ వెళ్లలేదు - చిత్తలూరి ఎస్సెన్