రైతు రాజుగావాలే...(కోకిలమ్మ పదాలు)
కోకిలమ్మ పదాలు
—————————
దున్నడానికి అరక
ఎద్దుతినేది పరక
రైతుకంటేది మరక
ఓ…కోకిలమ్మా…. !!
రైతుచేసేది యవుసం
యవుసంతో గాసం
గాసంతోగడుస్తది మాసం
ఓ….కోకిలమ్మా…. !!
మంచిగా పండాలి పంట
లేకుంటే పెద్ద తంట
చేనుకు పెడతడ మంట
ఓ….కోకిలమ్మా….. !!
ధాన్యానికి రావాలి ధర
లేకపోతే కొరకొర
చావుకై పరుగు బిరబిర
ఓ….కోకిలమ్మా….. !!
రైతుకుండదు కొవ్వు
చెవిన పెడతరు పూవ్వు
రైతుకు రాదు నవ్వు
ఓ….కోకిలమ్మా…. !!
పంటకోసం అప్పుతెస్తడు
ఎండలోన పనిచేస్తడు
నమ్మే దేవునికి ప్రార్థిస్తడు
ఓ….కోకిలమ్మా….. !!
దున్నడానికి ట్రాక్టరు
రైతు రియల్ యాక్టరు
అతనిది గుడ్ క్యారెక్టరు
ఓ….కోకిలమ్మా….. !!
రైతుపెట్టును అన్నం
రైతుకు మిగులు సున్నం
రైతువేయడసలు కన్నం
ఓ….కోకిలమ్మా….. !!
రైతు రాజుగావాలే
భూమిని పండించాలే
అందరి కడుపునింపాలే
ఓ…..కోకిలమ్మా…… !!
తాండ్ర చిరంజీవి
ఖిలా వరంగల్ , పడమర కోట
వరంగల్ అర్భన్ జిల్లా
సెల్ : 9959180762 .
Comments
Post a Comment