నేనున్నాను…

నేనున్నాను…………..

నిమిష నిమిషానికి నిజాన్ని వెతుక్కుంటూ

నాలో ఉన్న నేనేంటో ఆరాతీస్తూ

దాగి ఉన్న కన్నీటిని లోలోనే కడిగేస్తూ

దారివైపు ఎదురుచూపుల్ని బలవంతంగా తప్పిస్తూ

నేనున్నాను…………..

తొంగి చూసే మనసుని తప్పని తిడుతూ

తెలవారే నింగికై ఆశగా ఎదురుచూస్తూ

కదలని ఈ కాలాన్ని పొమ్మని గొడవచేస్తూ

కళ్ళనిండా నిండిన కలల్ని కల్లలని భావిస్తూ

నేనున్నాను…………..

మాటరాని మౌనంతో క్షణక్షణం రోదిస్తూ

మనసులోని ఆత్రుతని అనుక్షణం అణిచేస్తూ

నిదురే రాని కన్నుల్ని తెరుస్తూ మూసేస్తూ

నీదరి చేరని నన్ను నిత్యం నిందిస్తూ

గతాన్ని పదే పదే తోడేస్తూ

గడిచే కాలాన్ని గంగలో తొక్కేస్తూ

నేనున్నాను…………..

అస్తమించే నేటిని ఆభగా చూస్తూ

ఉదయించే రేపటికై ఆశగా ఎదురుచూస్తూ...

Comments

Popular posts from this blog

రాఖీ మెరుపులు

అతనెక్కడికీ వెళ్లలేదు - చిత్తలూరి ఎస్సెన్