జర పయిలం బిడ్డా...

జర పయిలం బిడ్డా...

నువ్వు సరైన దారిలో వెళ్ళాలనుకున్నావు కాబట్టి నిన్ను వదిలేస్తారు వాళ్ళు...
జర పయిలం బిడ్డా...
నువ్వు అవినీతి చెయ్యవు కాబట్టి నీ వెనకాల వుండడానికి సందేహిస్తరు జనం...
జర భద్రం సుమీ..
నీకు చెడ్డ అలవాటు లేదని నీ సోపతి జెయ్యరు కొడుకా...
మంచి ఇప్పుడు చెడ్డదయింది...
చెడు ఆదర్శమయ్యింది...
నువ్వు మందులో మునగాలి...
ధూమపానం పొగలో ఆరి తేరి ఊగిపోవాలి...
అప్పుడే నువ్వు అందరికీ దొస్తువయితవ్...
పదిమందిని ముంచే తెలివుంటే, వంద మంది నీ ఎనకాల ఉంటారు...
ఎంత గుంజగలిగితే అంత శక్తిమంతుడు అయినట్టు బిడ్డా...
నీకు నువ్వు కష్టపడి సంపాదిస్తే  క్షమించరాని నేరం నాయనా...
తుంగలో తొక్కేస్తరు నిన్ను... జర జూసుకో అయ్యా...
అంతా తలకిందులయ్యింది... జర భద్రం బిడ్డా...
పయిలంగ నడువు...
నడిచేది ముండ్లదారి కదా మరి..

Comments

Popular posts from this blog

రాఖీ మెరుపులు

అతనెక్కడికీ వెళ్లలేదు - చిత్తలూరి ఎస్సెన్