" ఘనుడు నాన్న — త్యాగధనుడు నాన్న "

అంశం : " ఘనుడు నాన్న — త్యాగధనుడు నాన్న "


కష్టజీవిగా ఇలలో బ్రతికేవాడు నాన్న
నష్టజీవిగా తన సుఖసంతోషాలను వదులుకునేవాడు నాన్న
కుటుంబ సభ్యులను రక్షించేందుకు...
ధన్యజీవిగా ఈ లోకంలో పుట్టినవాడు నాన్న !!

ఇంటికి ఆదెరువైతడు నాన్న
కంటికి వెలుగైతడు నాన్న
పిల్లల చేయి పట్టి నడుపుతూ...
వారికి బ్రతుకుబాట నేర్పిస్తడు నాన్న !!

సమస్యలలో నలుగుతడు నాన్న
కష్టములలో కుములుతడు నాన్న
అయిన ధైర్యం వీడక....
జీవన పోరులో కాడైతడు నాన్న !!

ఘనుడుగ అందరిలో బ్రతికేవాడు నాన్న
త్యాగధనుడుగ కుటుంబం కోసం ప్రాణాలర్పించేవాడు నాన్న
ఓటమిని ఒడసి పట్టి....
కొత్త పాఠం పిల్లలకు నేర్పిస్తడు నాన్న !!

పిల్లలు జన్మకు పురిటినోప్పులు పడనివాడు నాన్న
వారి భవిష్యత్తుకై ఒంటి నొప్పులు పడుతూ జీవించేవాడు నాన్న
దుఃఖాన్ని దిగమింగుకొని సంతోషాన్ని పంచుతూ...
ప్రాణం పోయేవరకు ఇంటిలో "పులి"లా బ్రతుకేవాడు నాన్న !!



తాండ్ర చిరంజీవి
ఖిలా వరంగల్ , పడమర కోట
వరంగల్ అర్భన్ జిల్లా
సెల్ : 9959180762.

Comments

Popular posts from this blog

రాఖీ మెరుపులు

అతనెక్కడికీ వెళ్లలేదు - చిత్తలూరి ఎస్సెన్