⚡⚡ మెరుపులు ⚡⚡ దేనికి భయపడని గుండెధైర్యం మాది
⚡⚡ మెరుపులు ⚡⚡
—————————————
ఓ... కరోనా
జలుబుతో వస్తావే
నీవల్ల హైరానా
త్వరలో చస్తావే !! 571
దేనికి భయపడని
గుండెధైర్యం మాది
అసలే మాటతప్పని
మనసు మాది !! 572
చేతులు కడుగి
నిన్ను చంపుతాము
టిష్యులు వాడి
నిన్ను బొందపెడతాము !! 573
మాట తప్పే
మనుషులం కాము
రోగాన్ని కప్పే
మనుషులం కాము !! 574
అహంతో విర్రవీగుట
నీ వంతు
నిన్ను విరిచివేయుట
మా వంతు !! 575
నీకు కనపడకుండ
చంపే గుణముంది
మేము చావకుండ
కఠిన నియమముంది !! 576
నిన్ను హత్యచేస్తుంది
మా శుభ్రతే
మాకు రక్షణనిస్తుంది
మా భద్రతే !! 577
సానిటైజర్ ను వాడి
చక్కగ బతుకుదాము
షేక్ ఆండ్ లను వీడి
దండాలు పెడదాము !! 578
వీరులను కన్న
దేశం మాది
ఐక్కతతో ఉన్న
సమాజం మాది !! 579
కరోనాను చంప
అందరోక్క టౌవుదాము
నియమాలు పాటింప
కఠినంగా వుందాము !! 580
తాండ్ర చిరంజీవి
వరంగల్ అర్భన్
సెల్ : 9959180762.
Comments
Post a Comment