నీ బంటును నేను...

నువ్వు నాతోనే ఉండాలనుకునే స్వార్థం కాదు నాది
నిత్యం నీతో నవ్వుండాలనుకునే ప్రేమ నాది
అనుక్షణం నన్నే ధ్యానించాలనే స్వార్థం కాదు నాది
క్షణక్షణం నిన్నే ధ్యానించే భక్తి భావం నాది

నిన్ను ప్రేమిస్తున్నానంటే నువ్వు నాకు కావాలనే భావం కాదు
నీ సంతోషమే నా జీవితమనే అర్థం దానిది
ప్రేమంటే ఏదో చేయాలనే మోహం కాదు నాకు
నిన్ను గెలిపించేందుకు ఏదైనా సరే చేయాలనే తపన నాది
నీతో పాటే ఎందరినో చూసే రకం కాదు నేను
అందరిలోనూ నిన్నేవెతకే నీ బంటును నేను
అవును ఎప్పటికయినా నీకై వెతకే నీ బంటునే నేను

Comments

Popular posts from this blog

రాఖీ మెరుపులు

అతనెక్కడికీ వెళ్లలేదు - చిత్తలూరి ఎస్సెన్