⚡⚡నాన్న మెరుపులు ⚡⚡
⚡⚡నాన్న మెరుపులు ⚡⚡
————————————
నాన్న కష్టంలేనిది
కుడుపు నిండదు
నాన్న ఇష్టంలేనిది
అమ్మకూర వండదు !! 646
ఎప్పుడు నలిగిపోతడు
నాన్న అన్నింటిలో
ఎప్పుడు వెలిగిపోతడు
నాన్న విజయాలలో !! 647
నవమాసాలు మోసేది
జన్మనిచ్చే అమ్మ
నిరంతరం నలిగేది
నడకనేర్పు నాన్న !! 648
తలతాకట్టు పెడతడు
కుటుంబం కోసం
ఉన్నందంత పెడతడు
బంధాల కోసం !! 649
శ్రమనే నమ్ముతడు
పోషన కొరకు
దేనిని అమ్మడు
ముందుచూపు కొరకు !! 650
అవమానాలు ఎన్నైనా
అరిగించు కుంటడు
కష్టాలు ఎన్నైనా
ఇష్టంగ చేసుకుంటడు !! 651
కనబడని సంద్రాన్ని
కళ్ళల్లో మోస్తడు
చెరగని ధైర్యాన్ని
మనకేమో ఇస్తడు !! 652
సూటిపోటి మాటల్ని
పెడచెవిన పెడతడు
బతికేటి రాతల్ని
మనముందు పెడతడు !! 653
కలలేన్నో కంటడు
కష్టాల్ని మరచి
నిదురపోక మేల్కోంటడు
మార్పుకొరకు అరచి !! 654
ఆస్తులు లేకున్న
ఆనందిస్తడు
కోట్లు ఇవ్వకున్న
నమ్మకమనే రెక్కలిస్తడు !! 655
తాండ్ర చిరంజీవి
Comments
Post a Comment