పుస్తక మెరుపులు
⚡⚡ పుస్తక మెరుపులు ⚡⚡
———————————————
జ్ఞానం ఇచ్చేది
మంచి పుస్తకం
మార్పు పొందేది
మన మస్తిస్కం !! 766
ఆది గ్రంథాలుంటే
ఇతిహాసాలు తెలుస్తవి
నేటి గ్రంథాలుంటే
పోకడలు తెలుస్తవి !! 767
ప్రశ్నించేతత్వం నేర్పేవి
కొన్ని పుస్తకాలు
పాపంచేయకని చెప్పేవి
కొన్ని పుస్తకాలు !! 768
విలువలు నేర్పేవి
మంచి పుస్తకాలు
మంటలు ఆర్పేవి
జ్ఞానమిచ్చు పుస్తకాలు !! 769
పుస్తకం దగ్గరుంటే
స్నేహితుడు ఉన్నట్లు
పుస్తకానికి దూరముంటే
అందరికి శత్రువులమన్నట్లు !! 770
ఇంటి బాధలకు
ఇగురం చెబుతది
ఒంటి బాధలకు
మందులను చెబుతది !! 771
సంసారమే మిన్న
చావడం ఎందుకు
పుస్తకం చదవరాకన్న
బాధపడడం ఎందుకు !! 772
కఠిన సమస్యలకు
పొత్తం పరిస్కారమిస్తది
కంగారుపెట్టె కన్య్పూజన్లకు
పొత్తం సమాధానమిస్తది !! 773
హృదయాలు దోచలేవు
కోట్లున్నగాని
పదిమందికి పంచలేవు
పైసలున్న గాని !! 774
కష్టాలలో కన్నీరు
తడుచును పుస్తకము
తీయ్యని పన్నీరు
అనుభవాల పుస్తకము !! 775
భాషతో అలరిస్తది
మంచి పుస్తకము
యాసతో పులకరిస్తది
ప్రాంతీయ పుస్తకము !! 776
జాతక చక్రాల
జాడ తెలుపుతది
వాహన చక్రాల
స్పీడు తెలుపుతది !! 777
పుస్తకం అట్టజూసి
ఆగమవ్వద్దు
పుస్తకం బరువుజూసి
భారంగా ఫీలవ్వద్దు !! 778
క్రీడలకు మంచి
జాడలు పుస్తకాలు
చెడును తుంచి
సద్గునమునిచ్చు పుస్తకాలు !! 779
సైన్ టిస్టుల చేసి
శాస్ర్తాలు నేర్పుతవి
అధికారుల జేసి
అందల మెక్కిస్తవి !! 780
తాండ్ర చిరంజీవి
వరంగల్ అర్భన్
Comments
Post a Comment