⚡⚡మహిళ⚡ ⚡ మెరుపులు⚡⚡
⚡⚡ మెరుపులు ⚡⚡
—————————————
సృష్టికి మూలం
తల్లియైన మహిళ
ఆమెచేతులు హలం
కష్టపడే మహిళ !! 522
బరువులను మోసేది
బాధ్యతగల మహిళ
ఇంటికిపేరు తెచ్చునది
నైపుణ్యమున్న మహిళ !! 523
మహిళ మనసు
వెన్నపూస
ఆమెకు తెలుసు
నలిగే గోస !! 524
సమస్యలను మౌనంగా
ఎదుర్కోను మహిళ
కష్టాలకు అనుగునంగా
మసలుకొను మహిళ !! 525
కడుపులో దుఃఖాన్ని
కళ్ళనుండి కారానీయదు
మనసులో దుఃఖాన్ని
మదినుండి జారనీయదు !! 526
ఆకాశం ఎత్తుని
తాడుతో కొలువలేము
మహిళ మనసుని
దేనితో తూచలేము !! 527
ఓపిక మంతురాలు
ఓర్చుకొను మహిళ
ఇంటిలో గుణవంతురాలు
అర్థంచేసుకొను మహిళ !! 528
మనసు గాయమైన
దిగులు చెందు
పని చేతనైన
అభివృద్ది చెందు !! 529
మహిళ పొయ్యిగాదు
ప్రతినిత్యం మండుతది
మహిళ నెయ్యికాదు
రుచులను వండుతది !! 530
మహిళ విలువ
వెలపెట్టి కొనలేము
ఆమెజీవితాన్ని మలువ
త్యాగాలు చేయ్యలేము !! 531
మహిళ మాట
గుండెలోదిగే తూట
ఆమెనడుచు బాట
పరిమళించు తోట !! 532
తాండ్ర చిరంజీవి
—————————————
సృష్టికి మూలం
తల్లియైన మహిళ
ఆమెచేతులు హలం
కష్టపడే మహిళ !! 522
బరువులను మోసేది
బాధ్యతగల మహిళ
ఇంటికిపేరు తెచ్చునది
నైపుణ్యమున్న మహిళ !! 523
మహిళ మనసు
వెన్నపూస
ఆమెకు తెలుసు
నలిగే గోస !! 524
సమస్యలను మౌనంగా
ఎదుర్కోను మహిళ
కష్టాలకు అనుగునంగా
మసలుకొను మహిళ !! 525
కడుపులో దుఃఖాన్ని
కళ్ళనుండి కారానీయదు
మనసులో దుఃఖాన్ని
మదినుండి జారనీయదు !! 526
ఆకాశం ఎత్తుని
తాడుతో కొలువలేము
మహిళ మనసుని
దేనితో తూచలేము !! 527
ఓపిక మంతురాలు
ఓర్చుకొను మహిళ
ఇంటిలో గుణవంతురాలు
అర్థంచేసుకొను మహిళ !! 528
మనసు గాయమైన
దిగులు చెందు
పని చేతనైన
అభివృద్ది చెందు !! 529
మహిళ పొయ్యిగాదు
ప్రతినిత్యం మండుతది
మహిళ నెయ్యికాదు
రుచులను వండుతది !! 530
మహిళ విలువ
వెలపెట్టి కొనలేము
ఆమెజీవితాన్ని మలువ
త్యాగాలు చేయ్యలేము !! 531
మహిళ మాట
గుండెలోదిగే తూట
ఆమెనడుచు బాట
పరిమళించు తోట !! 532
తాండ్ర చిరంజీవి
వరంగల్ అర్భన్
Comments
Post a Comment