నీకై ఈ పరుగు...

నీకోసం పరుగెత్తడం కన్నా నీతో పరుగెత్తడం ఇంకా బాగుంది
గెలుపు రుచెలా ఉంటుందో  తెలియలేదు నాకు
కాని నీకై చేసే ఈ ప్రయాణం చాలా బాగుంది
నువ్వు నన్ను గెలిపంచాలంటే
ముందుగా నిన్నునేను గెలిపించాలని అర్థమైంది

నా ప్రతి అడుగు నీవైపే వేస్తున్నా
ఈ నా పరుగు నిన్ను గెలిపించేంత వరకు ఆగదు
నీకై నేను గెలిచేవరకు ఆగదు
నిన్ను చేరడం కోసం ఎందాకైనా ఈ పరుగు సాగిస్తా
నిన్ను చేరిన క్షణం ఆ గెలుపునే నీకర్పిస్తా...

Comments

Popular posts from this blog

రాఖీ మెరుపులు

అతనెక్కడికీ వెళ్లలేదు - చిత్తలూరి ఎస్సెన్