Posts

Showing posts from 2020

దబాయింపు - నిరంతర

 దబాయింపు                          - నిరంతర కళ్ల ముందు కనిపించేదాన్ని చూపించొద్దంటావ్ వినిపడినదాన్ని వినిపించొద్దంటావ్ మాట్లాడాల్సినదాన్ని మాట్లాడొద్దాంటావ్ ప్రశ్నించాల్సినదాన్ని ప్రశ్నించొద్దంటావ్ మాటా లేక  చూపూ లేక నేనో నువ్వో ఉన్నామన్న  అలికిడే లేక గడ్డ కట్టిన శిలలా పడివుండమంటావ్ ప్రాంతమొద్దంటావ్  కులం‌లేదంటావ్  మతం‌లేదంటావ్  వాదం లేదంటావ్  వివాదానికి తావులేదంటావ్  అసలు చర్చకు  తావేలేదంటావ్  జరుగుతున్న వాస్తవాలేవీ  ఉటంకించొద్దంటావ్  రాయటానికివన్నీ నిషేధమే అయినపుడు ఇంకా రాయటమెందుకు? ఎండకు ఎండి  వానకు తడిసి గమ్మునుండే శిలాజంలా పడివుండటానికి మనిషిగా‌ నీకో పేరెందుకు? పైగా దానికి కవిత్వమని దబాయింపెందుకు?                  - నిరంతర

జాషువా గారి కోసం... కాస్తంత కవిత్వంగా- చిత్తలూరి

Image
 జాషువా గారి కోసం... కాస్తంత కవిత్వంగా-చిత్తలూరి   Follow the below youtube link for more Chittaluri Kavithalu https://www.youtube.com/channel/UCertyXyNh5qIfgj_LVvpl0A

చిత్తలూరి- మీ కవిత- నా విశ్లేషణ 3

Image
చిత్తలూరి- మీ కవిత- నా విశ్లేషణ 3   Follow the below youtube link for more Chittaluri Kavithalu https://www.youtube.com/channel/UCertyXyNh5qIfgj_LVvpl0A

Exclusive interview with poet, Lyricist Thandra Chiranjeevi

Image
Exclusive interview with poet, Lyricist Thandra Chiranjeevi            

అతనెక్కడికీ వెళ్లలేదు - చిత్తలూరి ఎస్సెన్

Image
 అతనెక్కడికీ వెళ్లలేదు                      - చిత్తలూరి ఎస్సెన్ అతనెక్కడికీ వెళ్లలేదు మంచివాళ్లెక్కడికైనా వెళ్లగలరా? ఒక పాటగానో మాటగానో ప్రజల మనసుల్లో చెరగని ముద్రలు వేసినవాళ్లు ఎక్కడికెళ్లగలరు? గుండెల్లోనే గూడుకట్టుకుని వుంటారు ప్రజల ప్రాణ శ్వాసకు స్వర కల్పనలు చేస్తూ వినిపిస్తారు అతనూ అంతే అతనెక్కడికీ వెళ్లిపోలేదు మన నరాలను వీణా తంత్రుల్ని చేసి మీటినవాడు మన దేహాలను   సంగీతం పెట్టెలా మార్చి పులకింప చేసినవాడు మన యాసలో ధ్యాసలో మన శ్వాసలో పాటల ప్రాణవాయువై మోగినవాడు అతనెక్కడికెళ్లగలడు? అతనెక్కడికీ వెళ్ల లేదు దేశానికి పాటనిచ్చి ప్రపంచానికి మనదైన స్వరాన్నిచ్చి మన కీర్తి ప్రతిష్టలకు తనదైన బాణీ  కూర్చి ఇచ్చినవాడు మన గుండె లబ్ డబ్ ల సంగీతంలో శృతి లయలై పరుచుకున్నవాడు అతనెక్కడికీ వెళ్లలేదు కొత్త కొత్త చరణాలు తూలిపడుతున్న చోట పల్లవిగా నిలబడి పాట భుజం తట్టినవాడు పాడుతా తియ్యగా అంటూ పలకరించినవాడు అతనెక్కడికెళ్లగలడు? మన పాటకి పల్లవిగా మన రాగానికి తాళంగా మన జీవన సంగీతానికి మధురమైన స్వరంగా ...

గంధర్వుల చెంత గానకచేరికేగెనో...

 ...✒️ బింగిదొడ్డి వెంకటేష్, ...📞 9885380371.              భువిపై శ్రోతల నలరించిన బాలు కోట్లాది హృదయాల గెలిచేసిన బాలు దివిపై దేవతల ఆహ్వానమందెనో గంధర్వుల చెంత గానకచేరికేగెనో మధురమైన స్వరంతో మైమరిపింపజేయంగ స్వర్గానికి చేరారు సురులనలరించగ.           --*-- బాధాతప్త హృదయంతో  గానగంధర్వ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారికి అశ్రునయన నివాళి😢😢..

తల్లి భాష చేత తమిళ తంబియైన

 మా తెలుగు తల్లికి మల్లెపూదండ అంటూ రాష్ట్ర గీతాన్ని రాసిన ప్రసన్న కవి కీర్తిశేషులు శంకరంబాడి సుందరాచారి గారి జయంతి సందర్భంగా ఆయనకు ఇష్టమైన తేటగీతిలో 1 తల్లి భాష చేత తమిళ తంబియైన పుట్టి పెరిగినట్టి తెలుగు భూమియందు మమతఁజూపుచూ వేసేను మల్లె దండ రాష్ట్ర గీతమై వినిపించె రాజ్యమంత! 2. బాపు హత్యను ఖండించి బాధపడుచు  కంట నీరిడె బలిదాన కావ్యమందు  భక్తిఁ జాటెను సుందర భారతమున రక్తిఁగట్టించె సుందర రామ చరిత! 3. ఏడుకొండలవాడిని వేడుకొనుచు  శతక శ్రీనివాసమురాసె చక్కగాను బుద్ధగీతినఁదెలిపెను బుద్ధ చరిత సకల ప్రక్రియ లందున సవ్యసాచి! 4. తెలుగు తోటను బుట్టిన తేటగీతి  పద్య మందునఁజక్కని భావములను మృదు మధురముగఁజాటుతూ మదినిదోచె శంకరంబాడి సుందరాచారి శైలి 🙏రాచమల్ల మల్లికార్జున్

రాఖీ మెరుపులు

 ⚡⚡రాఖీ మెరుపులు ⚡⚡ ——————————————— ఆస్తులన్ని పోయినా అన్నాచెల్లెల్లు విడిపోరు దోస్తులు ఎందరైనా అన్నాచెల్లెల్లకంటే గొప్పకారు !! 932 చెల్లిఅంటే అన్నకు అమితమైన ప్రేమ అన్నంటే చెల్లకు తోడుంటాడనే దీమ !! 933 రాఖీపండుగ అనగానే చెల్లమ్మకు సంబురం రాఖీని కట్టగానే అన్నందుకుంటడు అంబురం !! 934 కోట్లతోకొనలేని బంధం అన్నాచెల్లల్లది బహుమతులతో ముడిపెట్టనిబంధం సోదరిసోదరులది !! 935 చెల్లెమ్మను చూడగానే అన్నకు కడుపునిండుతది అన్నను చూడగానే చెల్లెమ్మకు కన్నీరుతన్నుకొస్తది !! 936 పుట్టినింటి దీపం ముద్దుల చెల్లెమ్మ మెట్టినింటి వరం బంగారు చెల్లెమ్మ !! 937 మనసువిప్పి మాట్లాడుకునే పండుగ రాఖీ గోరుముద్దలు తినిపించుకునే జ్ఞాపకాలగుర్తు రాఖీ !! 938 కష్టంలో తోడుంటానని అన్న బాసచేస్తడు కన్నీరు తుడుస్తనని అన్న హామిఇస్తడు !! 939 చెల్లెమ్మ అడుగే ఇంటికి వెలుగైతది చెల్లెమ్మ దీవిస్తేనే మనకు బతుకైతది !! 940 తాండ్ర చిరంజీవి

* మానవత మెరుపులు *

* మానవత మెరుపులు * ————————————— మానవత్వం లేని మనిషి ఎందుకు మంచి మనసులేని మనిషి బ్రతుకెందుకు !! 866 కష్టాల్లో ఉన్నవారికి మానవత్వం చాటన్నా నీయొక్క జీవితానికి అదేమంచి మేలన్నా !! 867 కొంటే దొరికేదికాదు మంచితనం అనేది అజ్ఞానులకు అర్థంకాదు మానవత్వం అనేది !! 868 కులాల మాటెత్తకు మానవత్వం ముందు మతాల మాటెత్తకు మంచిపనుల ముందు !! 869 చేయిచేయి కలిపి చెలిమితోడ బ్రతుకుదాం జీవితాలు మలిచి మంచిచేసి బ్రతుకుదాం !! 870 డబ్బుకు విలువలేదు మానవత్వం ముందు హోదాకు చోటులేదు మంచితనం ముందు !! 871 మానవత్వం కులంగాదు దాహమేస్తే నీళ్ళిస్తుంది మానవత్వం మతంకాదు ఆకలేస్తే అన్నంపెడుతుంది !! 872 కరోనా వచ్చింది మానవత్వం పెరిగింది వలసల ఆకలితీర్చింది నేనున్నానని చెప్పింది !! 873 మానవత్వం పరిమళిస్తే దేశసంబంధాలు హెచ్చు ఈభావం పెంపొందిస్తే మంచిపేరు వచ్చు !! 874 కులగోడలు కూల్చాలి మానవత్వం చూపి మతగడీలు పేల్చాలి హెచ్చుతగ్గులు బాపి !! 875 మహారాజైన సైనికుడే మానవత్వం లేకపోతే అధికారైన బిచ్చగాడే మానవత్వం చూపకపోతే !! 876 కరోనా పుట్టింది మనిషిని చంపింది మానవత్వం లేచింది మనిషిని బ్రతికించింది !! 877 జీవితానికి ఒకపేజి చేసిన సాయం మానవత్వం చూపనిప...

జీవ స్వరం

బాలసుబ్రమణ్యం గారి e సంకలనానికి రాసినది ఈ కవిత అంశం : జీవ స్వరం ప్రక్రియ : మెరుపులు పేరు    : తాండ్ర చిరంజీవి ఊరు   : ఖిలా వరంగల్ , పడమర కోట జిల్లా    : వరంగల్ అర్భన్ , తెలంగాణ మెరుపులు —————— తేనేకంటే తియ్యనిది బాలుగారి కమ్మనిస్వరం తెలుగువారికి పెన్నిది బాలుగారే మనకువరం !! జీవముంది బాలుగారిస్వరానికి మళ్ళిమళ్ళి వినాలనిపిస్తుంది క్రమశిక్షణుంది వారిజీవితానికి అనుసరించాలని అనిపిస్తుంది !! ఎన్నెన్నో స్వరాలను అవపోసన పట్టాడు అవలీలగ పాటలను పాడటం నేర్చుకున్నాడు !! ఒదిగినట్టిజీవితం బాలుగారిది ఠీవిగుండు వారుకూర్చున్నసభ చరితార్థజీవితం వారిది జనాధరమెండు పాటపాడినసభ !! హామిపత్రం : —————— ఇది నా సొంత రచన. దేనికి అనువాదం కాని అనుసరణ కాని కాదు.బాలుగారి సంకలనానికి ప్రత్యేకంగా రాసినది. తాంఢ్ర చిరంజీవి.

పట్టువదలని విక్రమార్కుడు

ఉభయ గోదావరి జిల్లాల భగీరదుడు కాటన్ దొర సంకలనానికి ఈ కవిత. అంశం : పట్టువదలని విక్రమార్కుడు ప్రక్రియ : మెరుపులు పేరు    : తాండ్ర చిరంజీవి ఊరు   : ఖిలా వరంగల్ , పడమర కోట జిల్లా   : వరంగల్ అర్భన్ , తెలంగాణ సెల్ : 9959180762. మెరుపులు ————— రైతులబాధలు చూసిన హృదయమున్న మనిషి ప్రాజెక్టుకట్టుటకు అడుగేసిన కాటన్ దొర గొప్పమనిషి !! వృధాగా పోనియ్యలేదు నీళ్లను ఆభగీరదుడు ప్రాజెక్టుకట్టెవరకు నిదురపోలేదు కార్యోన్ముకుడు ఆధీరుడు !! ఉభయగోదావరి జిల్లాలు నిండుకుండలుగా మారాయి కరీఫ్ రబీ ఎన్నోపంటలు బహుబాగా పండాయి !! మనసున్న కాటన్ దొర పరాయైన మనవాడే ఆంధ్రకేతలమానికం ఔర హృదయాలు దోచినాడే !! హామిపత్రం : —————— ఈ కవిత నా సొంతము. దేనికి అనుకరణ కాని అనుసరణ కాని కాదు. తాండ్ర చిరంజీవి.

కత్తిలాంటి పోలిసన్నకు సెల్యూట్ ... !

కత్తిలాంటి  పోలిసన్నకు సెల్యూట్ ... ! —————————————————— కరోనా మహామ్మారి కాలయముడై.. కాలకూఠ విషాన్ని కక్కుతుంటె కాలు కదప కుండ కఠిన నియమాలతో... కారు చీకట్లను పారదోలడానికి కార్యోన్ముకుడవై... కదిలావు కత్తిలా దండువై.. కనబడిన వారికి జాగ్రత్తలు చెబుతూ.. కఠినంగా నియమాలు అనుసరిస్తూ.. కంటికి రెప్పలా ప్రాణాలు కాపాడుతూ.. కలియుగ దైవం అనిపించుకున్నావు !! కుటుంబాలను విడచిపెట్టి కన్నపిల్లలకు దూరముండి కరోనా నిరోధానికి.. కత్తుల వలె లాఠిలు పట్టి కంగారుల వలె పరుగెత్తుతూ కంటి నిదురను చంపుకొని కాసుకు కూర్చున్నావు పోలిసన్నా !! కలిగిందే తిన్నావు కదలకుండ వున్నావు కుట్టినా దోమలను చంపుకుంటూ.. కారు చీకట్లలో పడుకున్నావు కరోనా రోగానికి జడియక కంచెలను వేశావు కాకి వేగం పుంజుకొని కారడవిలో తిరిగినట్లు... కార్లల్లో తిరుగుతూ.. కఠినంగా ప్రజలతో వ్యవహారించావు !! కమ్మనైన మనసు నీది కరోనాను అంతమొందించు ఆలోచన నీది కవ్వింపులకు తావులేదు కరోనాకు బతికే హక్కు లేదు కార్యశీలుడా మా పోలిసన్న " సెల్యూట్ " !! తాండ్ర చిరంజీవి ఖిలా వరంగల్ , పడమర కోట వరంగల్ అర్భన్ జిల్లా సెల్ : 9959180762.

నమ్మకమైన బంటు

మాన్యులు ముప్పవరపు వెంకయ్యనాయుడు గారి జయంతిని పురస్కరించుకొని రాసినది ఈ కవిత. అంశం : నమ్మకమైన బంటు ప్రక్రియ : మెరుపులు పేరు    : తాండ్ర చిరంజీవి ఊరు  : ఖిలా వరంగల్ ,పడమర కోట జిల్లా   : వరంగల్ అర్భన్ , తెలంగాణ చరవాణి : 9959180762. ———————————————— తెలుగువారి ఖ్యాతి వెంకయ్యనాయుడు వారికిలేదెన్నడు భీతి మంచి పరిపాలకుడు !! ప్రసంగాలలో కురిపిస్తడు తెలుగుపై మక్కువ ఉన్నతవిద్యా పట్టాలుపొందాడు చదువంటే ఇష్టంఎక్కువ !! నమ్మకమైన కార్యకర్తై పార్టీని నడిపించాడు ఇల్లాలికి మంచిభర్తై కుటుంబానికి పేరుతెచ్చాడు !! తెలుగు సాంప్రధాయం వెంకయ్య పంచెకట్టు వారిదిమంచి అభిప్రాయం నుదుటపెట్టరు బొట్టు !! రాజకీయంలో రాఠుతేలిన అనుభవసారుడు తెలుగువెలుగుకు నడుముకట్టిన కార్యధీక్ష పరుడు !! వెంకయ్యకు మంచితనంతో ఉపరాష్ర్టపదవి వరించింది తనజీవితం సహనంతో కష్టాలు భరించింది !! ఎందరికో వెంకయ్యనాయుడు ఇలలో ఆదర్శమూర్తి భువిపై ఆనాయకుడు పొందాడు ఘనకీర్తి !! హామిపత్రం : ————— ఇది నా సొంత రచన. దేనికి అనుకరణ, అనుసరణ కాదు. ప్రత్యేకముగా వెంకయ్యనాయుడు జన్మదినం గూర్చి రాసినది. తాండ్ర చిరంజీవి.

మండే నిప్పురవ్వ దాశరథి

దాశరథి గారి 96 వ జయంతిని పురస్కరించుకొని రాసినది ఈ కవిత అంశం : మండే నిప్పురవ్వ దాశరథి పేరు    : తాండ్ర చిరంజీవి ఊరు   : ఖిలా వరంగల్ పడమర కోట జిల్లా    : వరంగల్ అర్భన్  చరవాణి : 9959180762. చిన్నగూడురులో జన్మించి సాహిత్యానికి వెలుగయ్యాడు చైతన్యవంతమైన కవితలురచించి సమాజాన్ని మేల్కోలిపాడు !! జైలుగోడలపై పద్యాలనురాసిన దాశరథి ఒకధీరుడు నిజాంపాలనను  ఎదిరించిన పఠిమగల పోరాటయోధుడు !! కేంద్రసాహిత్య అహార్డుగ్రహిత దాశరథి కృష్ణమాచార్యులు ఎప్పటికుంటుంది వారిచరిత వారెందరికో గురుతుల్యులు !! పద్యశైలితో రచనలుచేసిన పుణ్యపురుషుడు దాశరథి పోరాడుటకు ప్రోత్సహించిన సంకల్పభగీరధుడు దాశరథి !! హామిపత్రం : —————— ఇది నా సొంతరచన. దేనికి అనువాదం, అనుకరణ కాని కాదు. దాశరథి జయంతి కొరకు మాత్రమే రాసినది. ఎక్కడా పరిశీలనలో కూడ లేదు. ప్రచురణకు స్వీకరించగలరు. తాండ్ర చిరంజీవి.

అవని ఘోశిస్తుంది

ప్రపంచ జనాభా దినోత్సవాన్ని  పురస్కరించుకొని రాసినది ఈ కవిత అంశం : అవని ఘోశిస్తుంది ప్రక్రియ : మెరుపులు పేరు    : తాండ్ర చిరంజీవి ఊరు  : ఖిలా వరంగల్ , పడమర కోట జిల్లా   : వరంగల్ అర్భన్  సెల్    : 9959180762. ** మెరుపులు ** ——————————— జనాభాపెరగడం ప్రమాదం కూడుగుడ్డకు కూసోనిఏడ్వాలే తక్కువజనాభా అవనికిమోదం ముందుతరాలకు భరోసాఇవ్వాలే !! జనాభా పెరిగితే ఆహారపదార్థాలు కలుషితం జనాభా తక్కువైతే అవనినేర్పిస్తది హితం !! బంధాలకు విలువలేదు జనసంఖ్య పెరుగుటతో ధనాన్ని దాచుటలేదు దుబారా ఖర్చులతో !! అధికజనాభా పెరుగుట అవస్థలు తప్పవు అవనిశక్తి విరుగుట వైరస్ బాధలు తప్పవు !! హామిపత్రం :  —————— ఇది నా సొంత రచన. దేనికి అనువాదం కాని అనుసరణ కాని కాదు. ప్రపంచ జనాభా దినోత్సవం కొరకు రాసినది. స్వీకరించగలరు. సంతకం ———— తాండ్ర చిరంజీవి.

మెరుపులు - ఊహల గాలం

🙏మెరుపులు 🙏 ————————— ఉదయమే మనకు ఊహా జనితము మనం సాయంత్రంవరకు దానితో పోరాడుతము !! 858 పడుకొని వుంటే పంటికిందికి రాదు కలలు కంటుంటే మనకు మంచిదికాదు !! 859 కనిపించే కాలం పరుగెడుతనే వుంటది మనఊహల గాలం దాన్ని ఆపనంటది !! 860 తాండ్ర చిరంజీవి వరంగల్ అర్భన్

తలుపుల మెరుపులు

తలుపుల మెరుపులు —————————— తలుపులు ఇంటికి ఆలు మగలు మనిషి కంటికి అవికర్ర వస్తువులు !! 851 కోట్లతో ఇల్లుకట్టిన తలుపులులేక వ్యర్థం తలుపులుంటే గుడిసెకైన అదే నిగుడార్థం !! 852 మారుపేర్లు రక్షణకు ఇంటికున్న తలుపులు గురిచేయవు భక్షణకు కాపాడే మలుపులు !! 853 కర్రైనా లోహమైన ఇంటికి రక్షణ ఒదులుతవి ప్రాణమైన చేయనీయవు భక్షణ !! 854 తలుపులను తన్నినా తగువు పెట్టుకోవు విరగగొట్టుటకు వలవేసినా విజృంభిస్తూ మీదికిరావు !! 855 ఓర్చుకొని ఉండరా ఓరి.. మానవుడా తగ్గించుకొని బతకరా మాయమయ్యే విగతజీవుడా !! 856 అమ్మానాన్న ఉన్నఇల్లు సంతోషంగా ఉంటది తలుపులున్న ఇల్లు అతిసుందరంగా ఉంటది !! 857 తాండ్ర చిరంజీవి వరంగల్ అర్భన్  సెల్ : 9959180762.

ఓటమి ఎరుగని సమరం

ఓటమి ఎరుగని సమరం రససాగర సమరంలో విజయాలెవరివి  చుంబన వింధులో మదురం ఎవరిది  బాహువుల బందీల్లో పరాజయాలెవరివి రతితీరం అంచున ఫలితం ఎవరిది నఖలేఖన ముద్రల వివరం ఎవరిది సుఖజీవన రాత్రుల సమయం ఎవరిది మైమరచిన మనసుల మాటలెవరివి గతితప్పిన హృదపు ద్వనులెవరివి సుతిమెత్తని మధుర స్వరాలెవరివి సృష్ఠికార్యపు తలంపుల మోహం ఎవరిది అతివేగపు ఆత్మల పయణం ఎవరిది గ్గీంకార పెదవుల నాధం ఎవరిది రమారమి సమరంలో ఓటమి ఎవరిది లవణజలదారలో స్వేదం ఎవరిది పెనవేసిన తనువుల అందాలెవరివి చీకటిరాత్రి అళలలో సొగసులెవరివి దుర్భేద్యమైన ఎడారిలో దాహం ఎవరిది రసికమయ నాట్యంలో గెలుపు ఎవరిది భువనచర లోకంలో బందం ఎవరిది రాసలీలల సంసారంలో బహుమానం ఎవరిది ఇట్లు పద్మతార నాభిలో ఇంద్రజాల దండం --- చంద్రహాసన్

ప్రతాపః కావ్యః

ప్రతాపః కావ్యః జగన్నాటకంలో నేనొక నిమిత్త ప్రాయుడను నేను సంగీతం ఎరుగను, సాగరసంగమాల వారసుడను కాను నా పసితనంలో సంస్కృతం మూడు, నాలుగు కక్ష్యలలో నామమాత్రంగా అభ్యసించాను నేను తెలుగు భాషా ప్రావీనుడనుకాను నా అక్షరమాల ఇప్పటికీ గతి తప్పుతూనేఉంటుంది నాలోని భావాలను సంభాషణ ద్వారా వ్యక్త పరచలేని స్వరనాళిక ఉన్న మూగవాడిని నామదిలోని భావాలను వ్యక్తపరచాలనే కుతూహలం నన్ను వెంటాడుతుంది భావ వ్యక్తీకరణకు నేను ఎంచుకున్న మార్గమే నా ఈ కావ్యరూప అక్షరాలు --- చంద్రహాసన్

సుందర సృష్ఠి సాక్షాత్కరించె మన పల్లెలోన

సుందర సృష్ఠి సాక్షాత్కరించె మన పల్లెలోన జల్లు జల్లు మంది వాన జర జరా సాగింది గంగ గళ్ళు గళ్ళున గోమాత చెంగు చెంగున పైరగాలి   వెన్నెల గానం మ్రోగించె విక్రయశాల వికసించె లక్ష్మీ మీట పరిచయమాయె గంగిరెద్దుల ఆటవిడుపు   అక్షర ఙనం మదినచేరె పరిణయబందం ఏర్పరిచె ఉత్తమ కార్యం జరిపించె సిరివెన్నెల ముత్యం చిందులువేసె   అద్బుత సంఘం సహకరించె సేవామార్గం ప్రజ్వరిల్లె జనగణమన అదినయకుడాయె బ్రహ్మపాదం మోపె మన బంగారు పల్లెలోన... --- చంద్రహాసన్

ప్రళయం-విలయం-భీకరం

ప్రళయం-విలయం-భీకరం తొందర పడకు ఓ భూపరి ఈ భువిపై ఉన్నవి రెండే జతులు ఒకటి సజీవ రాశి రెండు నిర్జీవ రశి   అచిర కాలపు స్వప్నంలో, సృష్ఠికార్యపు తీరం అంచున మిథ్యానాదపు సాధన వలలో, హృదయం వీడి, తనువే మరచి, మైమరచిన జీవం జాడలు, ఆత్మ మూలాలు ఎరుగని ఓ భూపరి   చరిత్ర విజయం నీదే అంటివి, అజీవలోకం శాసనమాయె, నీలాకాషపు భ్రమలో నిలబడి, పూర్వపు గాద నీదే అంటివి   ప్రళయకాలపు అంకురంలొ, నిర్జీవ రాశుల విలయ తాండవం భీకర జీవశ్చవాల ఆర్తనాదం, సంఘజీవుల శోకసంద్రం   పూర్వపు చరిత్ర పుటల్లో శోధించు, వర్తమానంలో జీవించు అనుభవంతో భవిష్యత్ ను శాసించు ఓ భూపరి ఈ ఇహలో నీకంఠ పడని గోప్యాలెన్నో, మరుగున పడిన రహస్యాలెన్నో అన్వేశించి తర్కించు జీవనపయణం సాగించు ఓ భూపరి --- చంద్రహాసన్

అశ్రు ప్రళయంలో పన్నీటి జల్లు

అశ్రు ప్రళయంలో పన్నీటి జల్లు జన సమ్మతిలో నిజవల్లుడవై, వెలిగిపో ఓ మహత్మా జగమే యెరుగని, నటనే తెలియని జీవన పయణంలో, అహింసా మార్గం నీది నూతన ఆయుధ శాంతి పథంలో ఎగిరింది ఎగిరింది త్రివర్ణం, బెదిరింది బెదిరింది శ్వేతవర్ణం అశాంతి గుండెల్లో, సుశాంతివై సాగావు హింసా సమయంలో, నిర్భయుడవై వెలిగావు అధర్మ పయణంలో ధర్మపాదమై నిలిచావు బ్రిటిష్ పాలన వణికింది, చరిత్ర గమణం మారింది నూతన ఆశయాలు వెలిసాయి, నాలుగు పాదాల ధర్మసత్రం వెలసింది ఈ నవయుగ ప్రపంచంలో నీ ఆయుధమెరుగని నాధుడు లేడు నీ మార్గమే సమసమాజ నిర్మాణానికి వారధిగా నిలిచింది. జన సమ్మతిలో నిజవల్లుడవై, వెలిగిపో ఓ మహత్మా ---చంద్రహాసన్

నా ప్రాణసఖి

నా ప్రాణసఖి ఈ భువిపై ఉన్నవి రెండే తనువులు మొదటిది నా ప్రాణసఖి, చివరిది ఈ ఇష్ఠ సఖుడు ప్రకృతిలో సంచరిసున్న నాకు సృష్ఠి అందాలు ఆసాంతం నీలో పల్లవించాయి తొలిచూపులో మైమరచి, హరివిల్లుపై ఊయలలూగాం సూర్యుడేహోమగుండమై, ఉరుములు-మెరుపులు భాజాభజంత్రీలై, సె లయేటి ద్వనులు పెళ్ళి మంత్రాలై పంచభూతాల సమక్షంలో మనువాడాం సప్తలోకాలలో ఇంద్రపాన్పుపై, పారిజాతాపూల పరిమళాలతో విరజిల్లే షయ్యపై, అమృత రుచిని అందించే ద్రాక్ష తోటపై వెన్నెల వెలుగులలో ఇద్దరం పెనవేసుకొని ఒకరిలో ఒకరం మమేకమయ్యాం. చంద్రహాసన్

నా చిన్ని జన్మ

నా చిన్ని జన్మ ఈ అలసిన దేహనికి నీ కౌగిలి... హృదయపు ఆశలురేపే పెదాలచుంబనం ఇంద్రజాల హస్తానికే రసరమ్యాలునేర్పే ఆ నడుంవంక మనసుకి ప్రశాంతతచేకూర్చే నీ మనోహర కన్ళు ముణివేళ్ళకు సైతం జీవంపోసే నీ విశాలమెడ నాలో అణువనువు ప్రేరేపింపజేసే నీ సుగంథ పరిమల మేని ఈ ఇంద్రజాల ప్రపంచంలో నా చిన్ని జన్మ... రమణులొలికే నీ సాష్ఠాంగ అందాలకే అంకితం. చంద్రహాసన్

నా చిన్ని ఆశ

నా చిన్ని ఆశ నీ ఊపిరి జ్వాలల హృదయపు దారులలో నా చిన్ని ఊహపు అళ... నీ ఆత్మసౌంధర్యము, బాహ్యసౌంధర్యము నా అనువణువునూ ప్రేరేపిస్తున్నాయి జన్మజన్మల ఈ పాదసేవకుడిని ఈ జన్మకైనా కరుణించవా ఓ చెలి... నీ విశాలహృదయంలో పవలించాలన్న నా చిన్ని ఆశ, మన్నిస్తావు కదూ… చంద్రహాసన్

నామామృతం

నామామృతం ఓ ప్రియ నీ వెచ్చని శ్వాసతొ నా మనసుని మేల్కొల్పావు అమృతంకై పరితపించిన నా హృదయం నీ ఊపిరిలో మువ్వలా స్పదిస్తుంది ప్రాణవాయువుకై శోదించే నేను నీ అంమృతజ్వాలతొ అమరుడనైనాను నా నిర్జీవ శరీరానికి ప్రాణంపోసిన నీ శ్వాసల ఊపిరితో యుగాతాలను సైతం శాషించే అజేయుడనై జన్మతా నీ నామస్మరణ గావిస్తాను. చంద్రహాసన్

ఓ సొగసరి

ఓ సొగసరి ఓ సొగసరి నీ అందలను వర్ణించదనికి, నా కలం బాసలు వెతుకుతుంది నీ నవ్వుల చిత్రాలు నా హృదయాన్ని స్పర్శిస్తున్నాయి నీ చక్కిల్ల వర్ణాలకు నామనసు దాసోహం నీ శిల్పాన్ని మలచిన ఆ బ్రహ్మ ఓ చమత్కారి నీ రమణులను వర్నించే నాకలం నీ పాదాలకే అంకితం.   చంద్రహాసన్

నా జీవన్మరణం

నా జీవన్మరణం నిన్న ఒక గతకాలపు చరిత్ర, రేపు ఆశాప్రయానపు సౌధం, జీవిత గమణంలొ నేడు ఒక అందమైన సత్యపు నిజం.   ఈ సృష్తిలొ భువి ఒక ఆధార మర్గం, బ్రమ్మ ఒక మిధ్యాశాస్త్రం, విష్ణుమూర్తి వీణాప్రళయవిహంగం, మహేశ్వర నాట్యం గతిచక్రం.   జననమరణాలు అనురాగ బంధాల విస్పొటనం, గతకాలపు చరిత్రలొ, మిధ్యాసౌధపు సాధనలొ, వీణాప్రళయపు సృష్తిమర్మంలో, గతిచక్రపు సత్యనాట్యం, ఈ భువిపై నా జీవన్మరణం. --- చంద్రహాసన్

⚡⚡ మంచిచేయు మెరుపులు ⚡⚡

⚡⚡ మంచిచేయు మెరుపులు ⚡⚡ ఒదిగి వుంటే ఎదుగుదల అన్నట్లు అహంకారంతో వుంటే అడుగుస్థాయి అన్నట్లు !! 671 మంచి మాటలేపుడు మాలలు అవుతాయి మంచి పనులేపుడు జ్ఞాపికలు అవుతాయి !! 672 రంగు ఏదైనా పరిగణలోకి రాదు ఎత్తుపల్లాలు ఏవైనా లెక్కలోకి రాదు !! 673 మంచిచేయుట కొరకు మనిషి బతకాలి మంచిమార్గముల కొరకు మనిషి వెతకాలి !! 674 స్వార్థబుద్దిని ఎపుడు సమాధి చేయాలి మంచిబుద్దిని ఎపుడు భుజాలపై మోయాలి !! 675 ఉన్నందంత నీవు ఊడ్చి ఇవ్వకు ఇచ్చేవారిని చూసినీవు ఎపుడు ఏడ్వకు !! 676 దాతగా బతికితే నీకు దండాలు రక్తదాతగా బతికితే వేయి దండాలు !! 677 పుట్టుకతో ఏమి తేలేదు భూమికి వెళ్ళెటప్పుడు ఏమి తీసుకుపోలేము ఆకాశానికి !! 678 మంచి చెడులు రెండు దారులు మనంవేసే అడుగులు కావాలి మంచిదారులు !! 679 అహమన్నది చస్తేనే ఇలలో వుంటాము అందరితో కలిసుంటేనే పరంలో వుంటాము !! 680 దోచుకొని దాచువాడు దాత కాలేడు నిత్యము పెట్టువాడు అవినీతుడు కాలేడు !! 681 కష్టంలో మనము చేయి సాపాలి దాతృత్వంలో మనము చేయి ఒదలాలి !! 682 అస్థిరము ఐనది ఈ అస్థిపంజరము స్థిరమేమో కానిది ఈ చిలకపంజరము !! 683 నవ్వుతూ బతికితే ఆయుష్యు పెరుగు నలుగురిని ఓర్చితే సంపదలు కలుగు !! 684 ద్వేషం విరిగి...

⚡⚡ ఆరోగ్య మెరుపులు ⚡⚡

⚡⚡ ఆరోగ్య మెరుపులు ⚡⚡ ————————————————— ఆరోగ్యం ఉండాలంటే వ్యాయమం చేయ్యాలి భాగ్యం ఉండాలంటే కష్టం చేయ్యాలి !! 656 విష పదార్థాలతో విందులు ఎందుకు ఆల్కాహాల్ లతో ఆరోగ్యం పాడెందుకు !! 657 కోట్లున్నయని కరోనా వదిలి పెడుతుందా చేస్తుంది హైరానా ప్రాణంపోనిది ఒదులుతుందా !! 658 పొద్దుగాల నడక మంచి ఆరోగ్యమిచ్చు త్వరగా పడక దేహ ధారుడ్యమిచ్చు !! 659 గొంతు ఎండకుండ తాగాలి నీరెపుడైన కడుపు మండకుండ తినాలి అన్నమెపుడైన !! 660 ఎక్కువ నీరు శరీరానికి అందం కొట్టదు బోరు నడకే అందం !! 661 ప్రాణం వుంటేనే తిండి బాధ మనిషే లేకుంటే కన్నీటి రోధ !! 662 మనిషికి తెలిసింది డబ్బుతో రక్షణలేదని మనసుకు తెలిసింది బంధంలేనిది బుతుకులేదని !! 663 అల్లం వెల్లుల్లి అబ్బో ఎంతఘాటు అవిచేయవు లొల్లి శరీరానికి చేటు !! 664 ఆరోగ్యం అంటే ఆకుకూరల తిండి మహాభభాగ్యం అంటే వ్యాయామమే కదండి !! 665 పాలు పెరుగులు శరీర బలాలు పప్పు దినుసులు ఐరనిచ్చు కణాలు !! 666 నేరుగా పండుతింటే అది ఆరోగ్యం ఐస్ లోవేసి తాగుతుంటే అది అనారోగ్యం !! 667 భాదాంలు పిస్తలు తెలివిని పెంచుతాయి ఖర్జూర చెర్రీలు చురుకుగ నిలుపుతాయి !! 668 కలిసుండే నవ్వు అందరిలో ఆరోగ్యమిచ్చు కష్టపడే చిరునవ్వు...

⚡⚡నాన్న మెరుపులు ⚡⚡

⚡⚡నాన్న మెరుపులు ⚡⚡ ———————————— నాన్న కష్టంలేనిది కుడుపు నిండదు నాన్న ఇష్టంలేనిది అమ్మకూర వండదు !! 646 ఎప్పుడు నలిగిపోతడు నాన్న అన్నింటిలో ఎప్పుడు వెలిగిపోతడు నాన్న విజయాలలో !! 647 నవమాసాలు మోసేది జన్మనిచ్చే అమ్మ నిరంతరం నలిగేది నడకనేర్పు నాన్న !! 648 తలతాకట్టు పెడతడు కుటుంబం కోసం ఉన్నందంత పెడతడు బంధాల కోసం !! 649 శ్రమనే నమ్ముతడు పోషన కొరకు దేనిని అమ్మడు ముందుచూపు కొరకు !! 650 అవమానాలు ఎన్నైనా అరిగించు కుంటడు కష్టాలు ఎన్నైనా ఇష్టంగ చేసుకుంటడు !! 651 కనబడని సంద్రాన్ని కళ్ళల్లో మోస్తడు చెరగని ధైర్యాన్ని మనకేమో ఇస్తడు !! 652 సూటిపోటి మాటల్ని పెడచెవిన పెడతడు బతికేటి రాతల్ని మనముందు పెడతడు !! 653 కలలేన్నో కంటడు కష్టాల్ని మరచి నిదురపోక మేల్కోంటడు మార్పుకొరకు అరచి !! 654 ఆస్తులు లేకున్న ఆనందిస్తడు కోట్లు ఇవ్వకున్న నమ్మకమనే రెక్కలిస్తడు !! 655 తాండ్ర చిరంజీవి

⚡⚡ మెరుపులు ⚡⚡ శుభ్రత లేకుంటే

⚡⚡ మెరుపులు ⚡⚡ ————————————— కరోనా వచ్చిందని కంగారు పడోద్దు వైరస్ పోతుందని చేతులుకడుగుట మానద్దు !! 638 మనకు భయముంటే ఎక్కువకాలం బతకలేము శుభ్రత లేకుంటే ఆరోగ్యంగ ఉండలేము !! 639 చైనోని దురాగతం కరోనా బాధ మనుషుల అంతం అదిఒక గాధ !! 640 అడ్డమైనవి తింటే కరోనా పుట్టుక ఇల్లు దాటకుంటే మనముంటాం గిట్టక !! 641 కుక్కలపాముల కూరలు మనుషులు తింటరా గబ్బిలాల కూరలు ఆలోచిస్తే తింటరా !! 642 ఆరోగ్యమును ఇచ్చె ఆకుకూరలు ఉన్నవి ఐరన్ లను ఇచ్చె పప్పు దినుసులున్నవి !! 643 మనుషుల పోలిన రాక్షాసులు మీరు వైరస్ లను సృష్టించిన దుష్టులు మీరు !! 644 వస్తులను కొనకుండ చైనాకుబుద్ది చెప్పాలి వైరస్ పాకకుండ బొందలేసి కప్పాలి !! 645 తాండ్ర చిరంజీవి

⚡⚡మాట మెరుపులు ⚡⚡

⚡⚡మాట మెరుపులు ⚡⚡ ——————————————— మాట అహమైతది ప్రాణాలు తీయడానికి మాట మమైతది ప్రాణాలు పొయ్యడానికి !! 623 మాట ఆవిరైతది నమ్మకం లేనప్పుడు మాట ఊపిరైతది నమ్మకం ఉన్నప్పుడు !! 624 మాట బలపడుతది తోడు ఉన్నప్పుడు మాట సన్నగిల్లుతది ఒంటరి అయినప్పుడు !! 625 మాట పరిమళిస్తుంది మంచిగా ఉన్నప్పుడు మాట నశిస్తుంది " చీ " కొట్టినప్పుడు !! 626 మాట గేయం రాగంతో పాడినపుడు మాట గాయం ఆలోచించక మాట్లాడినపుడు !! 626 మాట మంత్రం నమ్మినోళ్ళు ఉన్నప్పుడు మాట తంత్రం అనుసరించి నడచినప్పుడు !! 627 మాట ఆహారం సంతోషంగ ఉన్నప్పుడు మాట ఓకారం చెప్పింది విననప్పుడు !! 628 మాట మమకారం అమ్మ మాట్లాడినపుడు మాట " ఓం " కారం తండ్రి చెప్పినప్పుడు !! 629 మాట స్వీకారం పెద్దలనుండి గ్రహించినపుడు మాట వికారం మంచేదో తెలువనపుడు !! 630 మాట ఉత్తదే ఎవరు విననప్పుడు మాట గట్టిదే ఐక్యంగ ఉంచినప్పుడు !! 631 మాట ఎగిరిస్తది ఉత్తమ నటుడిగా మాట ఒదిగిస్తది ఉత్తమ ఇల్లాలిగా !! 632 మాట వేదనపడుతది నిజాన్ని మార్చినప్పుడు మాట బాధపడుతది తొందర పడ్డప్పుడు !! 633 మాట ఇస్తది మంచి నైవేద్యం మాట చేస్తది ఉత్తమ వైద్యం !! 634 మాట సుగంధం ఇతరుల నవ్వించినప్పుడు మాట ద...

⚡⚡ మెరుపులు ⚡⚡ సాయమొక్కటి చాలు

⚡⚡ మెరుపులు ⚡⚡ ఉదయం చూడని హృదయం వ్యర్థం ఉత్సాహంగా పాడని స్వరపేటిక వ్యర్థం !! 606 మేడలు అద్దాలుకావు రాయితో పగలడానికి గోడలు కాగితాలుకావు చేతితో చింపడానికి !! 607 సాయమొక్కటి చాలు నీతిగ బతికినందుకు గాయమొక్కటి మేలు తిరిగితప్పు చేయనందుకు !! 608 దోచి పెట్టెందుకు రాశులు వుండాలి పంచి పెట్టెందుకు పైసలు వుండాలి !! 609 నువ్వెత్తే పిడికిలి దున్నే నాగలవ్వాలి ముగ్గుసే ముంగిలి హితభోద నేర్పాలి !! 610 పోయిన దొరుకుతది కష్టపడ్డ సొమ్ము ఇష్టం అయినది కష్టకాలమందు అమ్ము !! 611 రాజులు పాలించారని గాజులపై చరిత్రల్లేవు రాజులు పోయారని బతుకుల్లో మార్పుల్లేవు !! 612 ఉద్దండ పిండమంటె పోటికి రాడు సత్తిగాడు సన్నగంటె అసలు ఊరుకోడు !! 613 నీరుగారోద్దు ఎపుడు నీరుత్సాహంతో ఉన్నా పొంగిపోవద్దు ఎపుడు ఉత్సాహంతో ఉన్నా !! 614 మాటవినని మనిషి లేకున్న ఒక్కటే తీసుకుంటాడు మనిషి ఎప్పటికైన నిర్ణయమొక్కటే !! 615 మనసు మంచిగుంటే నయనం నాట్యమాడుతది పాత్ర మంచిగుంటే అభినయం కొట్టస్తది !! 616 గాలిలో మేడలు స్థిరము కాదెపుడు కలలో జాడల...

⚡⚡ కరోనా మెరుపులు ⚡⚡

⚡⚡ కరోనా మెరుపులు ⚡⚡ ———————————————— మనుషులను చంపేది కనపడని వైరస్ మనుషులను బతికించేది ఐక్యంగావుండే కోరస్ !! 591 కరోనాకు కళ్లులేవు అందరిని చూస్తుంది కరోనాకు చేతుల్లేవు అందరిని చంపేస్తుంది !! 592 కరోనాకు జాలిలేదు అందరిని మింగుతుంది కరోనాకు బాధలేదు చంపికుప్ప పెడుతుంది !! 593 నీళ్ళు తాగకుంటే కరోనా వచ్చు శుభ్రంగా వుంటే కరోనా చచ్చు !! 594 ఇంట్లో ఉండడం కరోనాకు మందు కుటుంబంతో గడపడం అందరికి విందు !! 595 మాస్కులు వాడితే కరోనా చచ్చు దండాలు పెడితే మర్యాద హెచ్చు !! 596 పెంపొందు అనురాగం ఇంట్లో వుంటే అదేమనకు బంగారం అందరితో కలిసుంటే !! 597 లాక్ డౌన్ అంటే లాక్ వేయడంకాదు మనుషులు అంటే బయట తిరగడంకాదు !! 598 మనకమనం వేసుకోవాలి కఠినమైన శిక్ష ఆరోగ్యాలను దాచుకోవాలి అదేమనకు రక్ష !! 599 కరోనాను చంపుట డాక్టర్ల లక్ష్యం కరోనాను పంపుట మనందరి లక్ష్యం !! 600 రోడ్లను ఊడ్చేను సఫాయి కార్మికులు రోగాలతో ఏడ్చేను కష్టబోతు శ్రామికులు !! 601 వారివల్ల మనకు ఎపుడు శుభ్రత కలలోనైన కనకు కరోనాకులేదు భద్రత !! 602 చేతులెత్తి మొక్కాలి వారి త్యాగాలకు విలువిచ్చి చూడాలి వారి పనులకు !! 603 కరోనాను చంపుటకు డాక్టర్లే దేవుళ్ళు దాన్ని తరిమేయుట...

⚡⚡ మెరుపులు ⚡⚡ ధైర్యమే బతికిస్తది

⚡⚡ మెరుపులు ⚡⚡ ————————————— భయమే చంపేస్తది మనలను ఇపుడైన ధైర్యంమే బతికిస్తది మనలను ఎపుడైన !! 581 ఉద్యమాలు చేశాము తెలంగాణ కోసము అడుగులను దాచాము కరోనా కోసము !! 582 మనకు కనబడకుంటనే శరీరంలోకి వస్తుంది మనం దగ్గరుంటనే ప్రాణాలు బలిచేస్తుంది !! 583 కరోనానుండి బ్రతుకుటకు ఇల్లేమనకు శరణ్యం సమాజాన్ని కాపాడుటకు మాటేమనకు శరణ్యం !! 584 కరోనా ఎంతటిదైన మనశుభ్రత ఖతంచేస్తది ఇట్లుండుట కష్టమైన ఫలితం చూపిస్తది !! 585 అడ్డమైనవి తిని కొత్తరోగాలు తేవద్దు వాటిని అంటిపెట్టుకొని పదిమందిని బలిచేయ్యద్దు !! 586 సపాయి కార్మికులు చేస్తున్నరు శుభ్రత నిజమైన ధార్మికులు వారిపనివల్ల మనకుభద్రత !! 587 నిదురలేదు గర్జించేసింహాలకి మనకోసం తిప్పలుపడుతున్నరు కరోనా కట్టడికి లాఠీలు పడుతున్నరు !! 588 ఏవ్యాధికి భయపడద్దు ప్రాణంపోయు వైద్యం వైరస్ లకు జడియద్దు డాక్టర్లుపెడతరు నైవేద్యం !! 589 హిమాలయ కొండల్లో గస్తిగాస్తు వుంటరు శత్రువుల గుండెల్లో జవాన్లు నిదురపోతువుంటరు !! 590 పోలిసులు జవాన్లు ప్రజల రక్షణకొరకు సపాయిలు డాక్టర్లు ప్రజల సేవకొరకు !! 591 ఈనలుగురు బ్రతికుంటారు ఎపుడు హృదయాలలో వారు కూడబెట్టుకుంటారు ధనాన్ని అభిమానరుపాలలో !! 592 తాండ...

నిజమైన దేవుడు " డాక్టరే " !!

నిజమైన దేవుడు " డాక్టరే " !! —————————————— మనుషులకు దేవుడిపై నమ్మకం వుండాలి అంతేకాని గుడ్డినమ్మకం కాదు పూజలు,ప్రార్థనలు , నమాజులు చెప్పాయా "కరోనా " ఎపుడు చచ్చి పోతుందని ఏదో చెప్పాలి కాబట్టి అందరు ఏవేవో మాటలు వారి కడుపు తిప్పల కోసం చెబుతున్నారు కంటికే కనిపిస్తలేదు " కరోనా " ఐన ప్రపంచాన్ని కల్లోలం చేసి శవాలుగా మారుస్తుంది ఇంకా కొందరు ఈదేవుడని ఆదేవుడని బుకాయింపు మాటలు చెబుతున్నారు దేవుళ్ళే గుడి తలుపులు మూసుకొని పడుకున్నారు ఇక దయ్యాల ఊసేలేదు మహామహా సంపన్న దేశాలే కరోనా కత్తికి భలైపోతుంటే ఇంకా గుడ్డినమ్మకాలే....! మంత్రాలకు చింతకాయలు రాలవని తెలిసిన మన పద్దతులు ఆచారాలు... కరోనాకు ఆడమగ తేడాలేదు వున్నోళ్ళు లేనోళ్ళు అని తేడాలేదు చిన్నాపెద్దా , ఈమతం ఆమతం, నలుపు తెలుపు అనే తేడాలు అసలు లేవు క్షణాలలో ఎటునుంచి ఎటైన వచ్చి చంపేస్తుంది మనల్ని మనం రక్షించుకోవాలంటే ఇల్లుదాటి బయటకు రాకుండా వుండడమే అనునిత్యం శుభ్రతను పాటించడమే ఇప్పుడు ప్రపంచానికి ఒక్కదేవుడే వున్నాడు ఆయనే ప్రాణంపోసే " డాక్టరు " ఆ వైద్యుని నిరంతర పోరాట ఫలితమే మన ప్రాణాలకు రక్షణ. అతడు కనిపెట్టే మందు కరోన...

⚡⚡ మెరుపులు ⚡⚡ దేనికి భయపడని గుండెధైర్యం మాది

⚡⚡ మెరుపులు ⚡⚡ ————————————— ఓ... కరోనా జలుబుతో వస్తావే నీవల్ల హైరానా త్వరలో చస్తావే !! 571 దేనికి భయపడని గుండెధైర్యం మాది అసలే మాటతప్పని మనసు మాది !! 572 చేతులు కడుగి నిన్ను చంపుతాము టిష్యులు వాడి నిన్ను బొందపెడతాము !! 573 మాట తప్పే మనుషులం కాము రోగాన్ని కప్పే మనుషులం కాము !! 574 అహంతో విర్రవీగుట నీ వంతు నిన్ను విరిచివేయుట మా వంతు !! 575 నీకు కనపడకుండ చంపే గుణముంది మేము చావకుండ కఠిన నియమముంది !! 576 నిన్ను హత్యచేస్తుంది మా శుభ్రతే మాకు రక్షణనిస్తుంది మా భద్రతే !! 577 సానిటైజర్ ను వాడి చక్కగ బతుకుదాము షేక్ ఆండ్ లను వీడి దండాలు పెడదాము !! 578 వీరులను కన్న దేశం మాది ఐక్కతతో ఉన్న సమాజం మాది !! 579 కరోనాను చంప అందరోక్క టౌవుదాము నియమాలు పాటింప కఠినంగా వుందాము !! 580 తాండ్ర చిరంజీవి వరంగల్ అర్భన్ సెల్ : 9959180762.

*కరోనాను మించిన హైరానా* ...✒️ *బింగిదొడ్డి వెంకటేష్* *విద్వద్గద్వాల సాహితీ సేవకులు*

&nbsp; కరోనాకి క్లోనింగ్ చేస్తే అచ్చంగా మానవుడే మళ్లీ పుడతాడు వీడు మనిషని జాలిపడితే ఖచ్చితంగా వైరస్ను తలదన్నే విషపుజీవై మళ్ళీ మళ్ళీ కుడతాడు పచ్చని కానలను మొక్కజొన్న కంకుల్లా కాల్చుకుతిన్నాడు వెచ్చని కాంక్రీటు కీకారణ్యంలో బంధాన్ని అందాన్ని బందూకులా మార్చాడు కండ్లున్నా అంధగాడిలా నటిస్తూ నర్మగర్భంగా ఊరేగుతున్నాడు విలువల్ని వలువల్లా గాలికొదిలేస్తూ నగ్నంగా చెలరేగుతున్నాడు అయ్యా.!ఎవరయ్యా.!కరోనా అత్యంత ప్రమాదకరమని అరిచింది ఓరయ్యో.!కనరయ్యా.! దాన్ని మించిన వింతజీవెప్పుడో అవతరించింది. <hr /> <em>ఇంట్లో ఉందాం</em> <em>సామాజిక దూరం పాటిద్దాం</em> <em>ఆరోగ్యంగా ఉందాం,ఉంచుదాం</em>

** కరోనా పాట **

** కరోనా పాట ** ————————— పల్లవి :— ————— కరోనా..కరోనా — ఉయ్యాలో తుంగుటుయ్యాలో చైనాలో పుట్టింది — ఉయ్యాలో తుంగుటుయ్యాలో !! 2 !! చరణం :— ————— నూరేండ్ల కోసారి — ఉయ్యాలో తుంగుటుయ్యాలో కొత్తపేరుతో వస్తావే — ఉయ్యాలో తుంగుటుయ్యాలో !! 2 !! చరణం :— ————— మాయాదారి మహామ్మారివే — ఉయ్యాలో తుంగుటుయ్యాలో మనుషులను సంపుతుంటివే — ఉయ్యాలో తుంగుటుయ్యాలో !! 2 !! చరణం :— ————— నిను బొందపెడతామే — ఉయ్యాలో తుంగుటుయ్యాలో నిను కాల్చివేస్తామే — ఉయ్యాలో తుంగుటుయ్యాలో !! 2 !! చరణం :— ————— చేతులను కడుగుతాము — ఉయ్యాలో తుంగుటుయ్యాలో శుభ్రంగా వుంటాము — ఉయ్యాలో తుంగుటుయ్యాలో !! 2 !! చరణం :— ————— మాస్కులు వేస్తాము — ఉయ్యాలో తుంగుటుయ్యాలో టిష్యులు పెడతాము — ఉయ్యాలో తుంగుటుయ్యాలో !! 2 !! చరణం :— ————— వేడివేడిగా తింటాము — ఉయ్యాలో తుంగుటుయ్యాలో వేడినీరు తాగుతాము — ఉయ్యాలో తుంగుటుయ్యాలో !! 2 !! చరణం :— ————— ఉద్యమాలనే ఉరకలెత్తించినం — ఉయ్యాలో తుంగుటుయ్యాలో నిను సంపుడొలెక్కా — ఉయ్యాలో తుంగుటుయ్యాలో !! 2 !! చరణం :— ————— తెలంగాణ బిడ్డలం — ఉయ్యాలో తుంగుటుయ్యాలో గర్జించే సింహాలం — ఉయ్యాలో తుంగుటుయ్యాలో !! 2 !! చరణం :— ————— ...

⚡⚡ మెరుపులు ⚡⚡ కావాలి జాగ్రత్త

⚡⚡ మెరుపులు ⚡⚡ ———————————— దగ్గు జలుబులతో కరోనా వైరస్సు త్రాగే నీళ్ళతో చంపచ్చు వైరస్సు !! 556 అసలే తాగద్దు చల్లని పానియాలు అసలే తాకద్దు చల్లని గాలులు !! 557 ఎండలలో తిరగి కరోనాను చంపండి వేడివేడిగా తిని కరోనాను పంపండి !! 558 చేతులు శుభ్రంలేకున్న కరోనా వచ్చు దండం పెట్టకున్న కరోనా వచ్చు !! 559 విందులు వినోధాలు దూర ముంచుదాం షాపింగులు సినిమాలు బందు పెడదాం !! 560 సకలజనుల సమ్మెను సంక్కంగ జేత్తిమి కరోనాను సంపను తీర్మానము జేత్తిమి !! 561 ఒక్కరం వేరైన ఓడి పోయినట్లే అందరం ఒక్కటైన కరోనాను చంపినట్లే !! 562 అనుమాన మనిపిస్తే వైద్యున్ని చేరాలి మందులను మానేస్తే పేషెంట్ గా మారాలి !! 563 ఒక్కొక్క నీటిబొట్టు చెరువైనట్టు నియమాలుపాటిస్తే ఒట్టు మనం బ్రతికినట్టు !!564 కావాలి జాగ్రత్తలు మనం బ్రతకడానికి పాటించాలి నియమాలు కరోనాను చంపడానికి !! 565 తాండ్ర చిరంజీవిి

* మెరుపులు * కాలం

** మెరుపులు ** ———————— సమయం కరిగిపోతున్న కాలం ఆగదు ఆలోచన పెరుగుతున్న ఆశ చావదు !! 551 బంధించి వుంచలేము కాలాన్ని పట్టి కాలంతో పోరాడలేము హృదయాన్ని తట్టి !! 552 ఆగమంటే ఆగేదికాదు కాలం ఎపుడు సాగమంటే సాగేదికాదు కాలం ఎపుడు !! 553 ఉన్నాము మనం దాని గుప్పిట్లో అనుకున్నాం మనం అదిబానిసని అప్పట్లో !! 554 కాలం నాగుపామైతది కాటు వేయుటకు తప్పించు కోవాల్సివస్తది మనం బ్రతుకుటకు !! 555 తాండ్ర చిరంజీవి

** మెరుపులు ** విద్యార్థులు

** మెరుపులు ** ———————— విద్యార్థులు అంటే వికసించే పూవ్వులు గుర్తోస్తాయి వారినిచూస్తుంటే పరిమళించు నవ్వులు !! 546 మార్కులు రావాలంటే కష్టపడి చదవాలి పేరు నిలపాలంటే ఇష్టపడి చదవాలి !! 547 విందులు వినోదాలకు దూరం ఉండండి చిందులు మందులకు దరి చేరకండి !! 548 దిక్కులు చూసిన సమయం పోవు పక్కలు చూసిన పరీక్ష పోవు !! 549 పరీక్షలు ఇచ్చు మంచి ఫలితాలు రాయకపోతే వచ్చు దుష్ ఫలితాలు !! 550 తాండ్ర చిరంజీవి వరంగల్ అర్భన్

⚡ మెరుపులు ⚡అమ్మ

⚡⚡ మెరుపులు ⚡⚡ ————————————— అమ్మలేని జన్మ అసలు వుండదు జరగకపోతే కర్మ స్వర్గం వుండదు !! 533 మాటలో స్పష్టత దారి చూపిస్తది వేటలో నిపుణత గురి చేదిస్తది !! 534 గుండెలుతీసిన బంటు బండలు కొట్టడు విలువతెలువని చింటు ఎంగిలి ముట్టడు !! 535 విమర్శలే విజయాలు ఓపికతో వున్నవారికి ప్రశంసలే అపజయాలు గర్వంతో నడచువారికి !! 536 బాధ్యతలనేవి ఎపుడు బరువులు కాదు మాటలనేవి ఎపుడు అరుపులు కాదు !! 537 మోముపై చిరునవ్వు రోగాలు నయం నవ్వాలి చిరునవ్వు విజయం కాయం !! 538 కన్ను చిన్నదైన మిన్నంత జూస్తది కలము చిన్నదైన బుక్కంత రాస్తది !! 539 అతుకుల బతుకుకు అర్థం ఉండదు గతికే మెతుకు ఆకలి తీర్చదు !! 540 పూవ్వులు విరభూస్తే నవ్వులు వస్తవి రాతలు రంజిస్తే హృదయాలు సంతసిస్తవి !! 541 తాండ్ర చిరంజీవి

*అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు* 🌹🌹🌹🙏🌹🌹🌹

<em>అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు</em> 🌹🌹🌹🙏🌹🌹🌹 కాలం మహాచక్రం కాళ్లకు చక్రాలను ధరించి కాలంతో పోటీపడి మనల్నీ మనకుటుంబాన్ని మనం వసిస్తున్న వసుధైకకుటుంబాన్ని అభివృద్ధి వైపు పరుగెత్తిస్తున్న, అతివలు అవనియంతటి ఓపికతో తరుణులు కల్పతరువులా కాంతలు కామధేనువులా మహిలో మకుటంలేని మహారాణులు మహిళలు... కుటుంబంలో కార్యాలయంలో కార్ఖానాలో కర్షకవృత్తిలో హర్షాతిరేకాలతో వారికి వారి పనికి గౌరవంను విలువను ఇచ్చి మనస్ఫూర్తిగా అభినందిద్దాం <em>అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో</em> 🌹🌹🌹🌹🙏🌹🌹🌹🌹 <em>బింగిదొడ్డి వెంకటేష్</em>

⚡⚡ మెరుపులు ⚡⚡మహిళ

⚡⚡ మెరుపులు ⚡⚡ ————————————— సృష్టికి మూలం తల్లియైన మహిళ ఆమెచేతులు హలం కష్టపడే మహిళ !! 522 బరువులను మోసేది బాధ్యతగల మహిళ ఇంటికిపేరు తెచ్చునది నైపుణ్యమున్న మహిళ !! 523 మహిళ మనసు వెన్నపూస ఆమెకు తెలుసు నలిగే గోస !! 524 సమస్యలను మౌనంగా ఎదుర్కోను మహిళ కష్టాలకు అనుగునంగా మసలుకొను మహిళ !! 525 కడుపులో దుఃఖాన్ని కళ్ళనుండి కారానీయదు మనసులో దుఃఖాన్ని మదినుండి జారనీయదు !! 526 ఆకాశం ఎత్తుని తాడుతో కొలువలేము మహిళ మనసుని దేనితో తూచలేము !! 527 ఓపిక మంతురాలు ఓర్చుకొను మహిళ ఇంటిలో గుణవంతురాలు అర్థంచేసుకొను మహిళ !! 528 మనసు గాయమైన దిగులు చెందు పని చేతనైన అభివృద్ది చెందు !! 529 మహిళ పొయ్యిగాదు ప్రతినిత్యం మండుతది మహిళ నెయ్యికాదు రుచులను వండుతది !! 530 మహిళ విలువ వెలపెట్టి కొనలేము ఆమెజీవితాన్ని మలువ త్యాగాలు చేయ్యలేము !! 531 మహిళ మాట గుండెలోదిగే తూట ఆమెనడుచు బాట పరిమళించు తోట !! 532 తాండ్ర చిరంజీవి వరంగల్ అర్భన్

⚡⚡ మెరుపులు ⚡⚡మాటలు

⚡⚡ మెరుపులు ⚡⚡ ————————————— మాటలు బాణాలైన మనసులు విరిగిపోవును మాటలు పూవ్వులైన మనసులు కరిగిపోవును !! 513 మాట మంత్రముకాదు చింతకాయ రాలుటకు మాట తంత్రముకాదు చనిపోయిన లేపుటకు !! 514 మాట మృదువైన నడిచేటి బాట మాట సున్నితమైన వికసించు తోట !! 515 మంచి మాట కారము కాదు జీవితంలో మాట భారము కాదు !! 516 పైసలతో కానివి మాటతో అయితవి ప్లాట్లున్న కానివి మాటతో అయితవి !! 517 మంచిమాట లెల్ల మర్యాదతెచ్చు చెడుమాట లెల్ల హృదయంలో గుచ్చు !! 518 మాటల పూదోటలు అందరికి కావాలి వికసించే తోటలు అందరు నడవాలి !! 519 మాటలు అభయము చెడుకు దారితీయ్యనప్పుడు మాటలు దుర్లబము మంచిని గ్రహించనప్పుడు !! 520 మాటలల్ల ఆప్యాయత విరిసిన పుష్పము మాటలల్ల సారుప్యత గుబాలించు పుష్పము !! 521 తాండ్ర చిరంజీవి