ఓటమి ఎరుగని సమరం

ఓటమి ఎరుగని సమరం


రససాగర సమరంలో విజయాలెవరివి 

చుంబన వింధులో మదురం ఎవరిది 

బాహువుల బందీల్లో పరాజయాలెవరివి


రతితీరం అంచున ఫలితం ఎవరిది

నఖలేఖన ముద్రల వివరం ఎవరిది

సుఖజీవన రాత్రుల సమయం ఎవరిది

మైమరచిన మనసుల మాటలెవరివి

గతితప్పిన హృదపు ద్వనులెవరివి

సుతిమెత్తని మధుర స్వరాలెవరివి

సృష్ఠికార్యపు తలంపుల మోహం ఎవరిది

అతివేగపు ఆత్మల పయణం ఎవరిది

గ్గీంకార పెదవుల నాధం ఎవరిది

రమారమి సమరంలో ఓటమి ఎవరిది

లవణజలదారలో స్వేదం ఎవరిది

పెనవేసిన తనువుల అందాలెవరివి

చీకటిరాత్రి అళలలో సొగసులెవరివి

దుర్భేద్యమైన ఎడారిలో దాహం ఎవరిది

రసికమయ నాట్యంలో గెలుపు ఎవరిది

భువనచర లోకంలో బందం ఎవరిది

రాసలీలల సంసారంలో బహుమానం ఎవరిది


ఇట్లు

పద్మతార నాభిలో ఇంద్రజాల దండం

---చంద్రహాసన్

Comments

Popular posts from this blog

రాఖీ మెరుపులు

అతనెక్కడికీ వెళ్లలేదు - చిత్తలూరి ఎస్సెన్