నాలో నిండిన శ్వాసవి నువ్వు

నా కలల కోటకి రాణివి నువ్వు నా కమ్మని కలలకి రూపం నువ్వు…

నా ఊహల ఊపిరి రెక్కవి నువ్వు నా ఊపిరిలోని ఊహవి నువ్వు…

నా జీవికి పోసిన ప్రాణం నువ్వు నా ప్రాణంలోని జీవం నువ్వు…

నా ప్రేమకి నిజరూపం నువ్వు నే నిజమని చెప్పే ప్రేమవి నువ్వు…

నా దాహం తీర్చే నీరువి నువ్వు నీటిని అడిగే నా దాహం నువ్వు…

పున్నమి రోజు వెన్నెల నువ్వు  వెన్నెలనిచ్చే పున్నమి నువ్వు…

పువ్వులనిచ్చే చెట్టువి నువ్వు చెట్టుకి పూచే పువ్వువి నువ్వు…

వెలుగులనిచ్చే కిరణం నువ్వు కిరణాలిచ్చే వెలుగూ నువ్వు…

నా గుండె గుడిలో దేవత నువ్వు దేవత నిలిచిన గుడివీ నువ్వు…

నా గుండెకి లయవి నువ్వు లయపుట్టించే గుండెవి నువ్వు…

నే పలికే ప్రతి మాటవి నువ్వు నా మాటల మాటున అర్థం నువ్వు…

ఆ మాటలకందని రూపం నువ్వు రూపం లేని గాలివి నువ్వు…

నా అడుగుల శబ్దం నువ్వు శబ్దంనిచ్చే అడుగువి నువ్వు…

నాలో నిండిన శ్వాసవి నువ్వు ఆ శ్వాసని విడిచే నేనే నువ్వు…

Comments

Popular posts from this blog

రాఖీ మెరుపులు

అతనెక్కడికీ వెళ్లలేదు - చిత్తలూరి ఎస్సెన్