చేరని తీరం కోసం...

ముద్దులొలికే పసిపాప చిరునవ్వుని

అలసిన మనసును తాకే వర్షపు తుంపరలని

ముఖాన్ని స్పృశించే చల్లని ఎదురు గాలిని

ఎవరు మాత్రం వద్దనగలరు….

జోలపాట పాడే అమ్మల అనురాగాన్ని

దూరమైనా గుర్తొచ్చే జ్ఞాపకపు పరంపరల్ని

అలుపు తీర పాడే పల్లెపడుచు కూని రాగాన్ని

ఎవరు మాత్రం కాదనగలరు…..

నిన్ననే గడిచాయనిపించే చిన్ననాటి సరదాల్ని

బంతి, బ్యాటుతో బడిలోనే తిష్టేసిన చల్లని సాయంత్రపు గుర్తుల్ని

బంగారంతోనైనా కొనలేని బాల్యపు తెలియనితనాన్ని

ఎవరు మాత్రం గుర్తుకు తెచ్చుకోరు…

కోట్లకు పడగలెత్తిన కోటీశ్వరుడైనా

కూటికి చేజాచే బిచ్చగాడయినా

రాత్రయ్యాక చేరేది నిద్రగూటికే

తన పాత్రయిపోయాక చేరేది స్మశానానికే…..

దానికోసం ప్రత్యేకంగా పరుగులు పెట్టక్కర్లేదు 

నీకిష్టమైన చిన్ని చిన్ని సరదాల్ని వదిలిపెట్టక్కర్లేదు

                                             చేరని తీరం కోసం, పకృతి చెలిమిని విడిచే అవసరమే లేదు

Comments

Popular posts from this blog

రాఖీ మెరుపులు

అతనెక్కడికీ వెళ్లలేదు - చిత్తలూరి ఎస్సెన్