⚡⚡ మంచిచేయు మెరుపులు ⚡⚡

⚡⚡ మంచిచేయు మెరుపులు ⚡⚡

ఒదిగి వుంటే
ఎదుగుదల అన్నట్లు
అహంకారంతో వుంటే
అడుగుస్థాయి అన్నట్లు !! 671

మంచి మాటలేపుడు
మాలలు అవుతాయి
మంచి పనులేపుడు
జ్ఞాపికలు అవుతాయి !! 672

రంగు ఏదైనా
పరిగణలోకి రాదు
ఎత్తుపల్లాలు ఏవైనా
లెక్కలోకి రాదు !! 673

మంచిచేయుట కొరకు
మనిషి బతకాలి
మంచిమార్గముల కొరకు
మనిషి వెతకాలి !! 674

స్వార్థబుద్దిని ఎపుడు
సమాధి చేయాలి
మంచిబుద్దిని ఎపుడు
భుజాలపై మోయాలి !! 675

ఉన్నందంత నీవు
ఊడ్చి ఇవ్వకు
ఇచ్చేవారిని చూసినీవు
ఎపుడు ఏడ్వకు !! 676

దాతగా బతికితే
నీకు దండాలు
రక్తదాతగా బతికితే
వేయి దండాలు !! 677

పుట్టుకతో ఏమి
తేలేదు భూమికి
వెళ్ళెటప్పుడు ఏమి
తీసుకుపోలేము ఆకాశానికి !! 678

మంచి చెడులు
రెండు దారులు
మనంవేసే అడుగులు
కావాలి మంచిదారులు !! 679

అహమన్నది చస్తేనే
ఇలలో వుంటాము
అందరితో కలిసుంటేనే
పరంలో వుంటాము !! 680

దోచుకొని దాచువాడు
దాత కాలేడు
నిత్యము పెట్టువాడు
అవినీతుడు కాలేడు !! 681

కష్టంలో మనము
చేయి సాపాలి
దాతృత్వంలో మనము
చేయి ఒదలాలి !! 682

అస్థిరము ఐనది
ఈ అస్థిపంజరము
స్థిరమేమో కానిది
ఈ చిలకపంజరము !! 683

నవ్వుతూ బతికితే
ఆయుష్యు పెరుగు
నలుగురిని ఓర్చితే
సంపదలు కలుగు !! 684

ద్వేషం విరిగినపుడు
మనిషికి స్థాయివచ్చు
కోపం నలిగినపుడు
అతనిస్థాయి హెచ్చు !! 685

మనం బతకాలి
పదిమంది కొరకు
మనం అన్నంపెట్టాలి
ప్రపంచాని కొరకు !! 686

హుండిలో కోట్లేస్తే
భగవంతుడు మెచ్చునా
పరులను కాటేస్తే
దీవెనలు ఇచ్చునా !! 687

గాలి బుడగలాంటిది
ఈ జీవితం
ఎపుడు ఏమౌతుంటుంది
తెలియని గతం !! 688

దాతరాల మీకు
కోట్ల దండాలు
జీవితంలో మీకు
రావు సుడిగుండాలు !! 689

ఎన్నటికి పైసతో
కొనలేము మంచిని
ఎన్నటికి ఐసుతో
పోల్చలేము మనిషిని !! 700
తాండ్ర చిరంజీవి
వరంగల్ అర్భన్ .

Comments

Popular posts from this blog

రాఖీ మెరుపులు

అతనెక్కడికీ వెళ్లలేదు - చిత్తలూరి ఎస్సెన్