ప్రతాపః కావ్యః
ప్రతాపః కావ్యః
జగన్నాటకంలో నేనొక నిమిత్త ప్రాయుడను
నేను సంగీతం ఎరుగను, సాగరసంగమాల వారసుడను కాను
నా పసితనంలో సంస్కృతం మూడు, నాలుగు
కక్ష్యలలో నామమాత్రంగా అభ్యసించాను
నేను తెలుగు భాషా ప్రావీనుడనుకాను
నా అక్షరమాల ఇప్పటికీ గతి తప్పుతూనేఉంటుంది
నాలోని భావాలను సంభాషణ ద్వారా వ్యక్త పరచలేని స్వరనాళిక ఉన్న మూగవాడిని
నామదిలోని భావాలను వ్యక్తపరచాలనే కుతూహలం నన్ను వెంటాడుతుంది
భావ వ్యక్తీకరణకు నేను ఎంచుకున్న మార్గమే నా ఈ కావ్యరూప అక్షరాలు
---చంద్రహాసన్
Comments
Post a Comment