** మెరుపులు ** విద్యార్థులు

** మెరుపులు **
————————

విద్యార్థులు అంటే
వికసించే పూవ్వులు
గుర్తోస్తాయి వారినిచూస్తుంటే
పరిమళించు నవ్వులు !! 546

మార్కులు రావాలంటే
కష్టపడి చదవాలి
పేరు నిలపాలంటే
ఇష్టపడి చదవాలి !! 547

విందులు వినోదాలకు
దూరం ఉండండి
చిందులు మందులకు
దరి చేరకండి !! 548

దిక్కులు చూసిన
సమయం పోవు
పక్కలు చూసిన
పరీక్ష పోవు !! 549

పరీక్షలు ఇచ్చు
మంచి ఫలితాలు
రాయకపోతే వచ్చు
దుష్ ఫలితాలు !! 550
తాండ్ర చిరంజీవి
వరంగల్ అర్భన్

Comments

Popular posts from this blog

రాఖీ మెరుపులు

అతనెక్కడికీ వెళ్లలేదు - చిత్తలూరి ఎస్సెన్