** కరోనా పాట **

** కరోనా పాట **
—————————

పల్లవి :—
—————
కరోనా..కరోనా — ఉయ్యాలో తుంగుటుయ్యాలో
చైనాలో పుట్టింది — ఉయ్యాలో తుంగుటుయ్యాలో !! 2 !!

చరణం :—
—————
నూరేండ్ల కోసారి — ఉయ్యాలో తుంగుటుయ్యాలో
కొత్తపేరుతో వస్తావే — ఉయ్యాలో తుంగుటుయ్యాలో !! 2 !!

చరణం :—
—————
మాయాదారి మహామ్మారివే — ఉయ్యాలో తుంగుటుయ్యాలో
మనుషులను సంపుతుంటివే — ఉయ్యాలో తుంగుటుయ్యాలో !! 2 !!

చరణం :—
—————
నిను బొందపెడతామే — ఉయ్యాలో తుంగుటుయ్యాలో
నిను కాల్చివేస్తామే — ఉయ్యాలో తుంగుటుయ్యాలో !! 2 !!

చరణం :—
—————
చేతులను కడుగుతాము — ఉయ్యాలో తుంగుటుయ్యాలో
శుభ్రంగా వుంటాము — ఉయ్యాలో తుంగుటుయ్యాలో !! 2 !!

చరణం :—
—————
మాస్కులు వేస్తాము — ఉయ్యాలో తుంగుటుయ్యాలో
టిష్యులు పెడతాము — ఉయ్యాలో తుంగుటుయ్యాలో !! 2 !!

చరణం :—
—————
వేడివేడిగా తింటాము — ఉయ్యాలో తుంగుటుయ్యాలో
వేడినీరు తాగుతాము — ఉయ్యాలో తుంగుటుయ్యాలో !! 2 !!

చరణం :—
—————
ఉద్యమాలనే ఉరకలెత్తించినం — ఉయ్యాలో తుంగుటుయ్యాలో
నిను సంపుడొలెక్కా — ఉయ్యాలో తుంగుటుయ్యాలో !! 2 !!

చరణం :—
—————
తెలంగాణ బిడ్డలం — ఉయ్యాలో తుంగుటుయ్యాలో
గర్జించే సింహాలం — ఉయ్యాలో తుంగుటుయ్యాలో !! 2 !!

చరణం :—
—————
పోరు బిడ్డలం — ఉయ్యాలో తుంగుటుయ్యాలో
నిన్ను పారదోలుతం — ఉయ్యాలో తుంగుటుయ్యాలో !! 2 !!

తాండ్ర చిరంజీవి
వరంగల్ అర్భన్

Comments

Popular posts from this blog

రాఖీ మెరుపులు

అతనెక్కడికీ వెళ్లలేదు - చిత్తలూరి ఎస్సెన్