తలుపుల మెరుపులు
తలుపుల మెరుపులు
——————————
తలుపులు ఇంటికి
ఆలు మగలు
మనిషి కంటికి
అవికర్ర వస్తువులు !! 851
కోట్లతో ఇల్లుకట్టిన
తలుపులులేక వ్యర్థం
తలుపులుంటే గుడిసెకైన
అదే నిగుడార్థం !! 852
మారుపేర్లు రక్షణకు
ఇంటికున్న తలుపులు
గురిచేయవు భక్షణకు
కాపాడే మలుపులు !! 853
కర్రైనా లోహమైన
ఇంటికి రక్షణ
ఒదులుతవి ప్రాణమైన
చేయనీయవు భక్షణ !! 854
తలుపులను తన్నినా
తగువు పెట్టుకోవు
విరగగొట్టుటకు వలవేసినా
విజృంభిస్తూ మీదికిరావు !! 855
ఓర్చుకొని ఉండరా
ఓరి.. మానవుడా
తగ్గించుకొని బతకరా
మాయమయ్యే విగతజీవుడా !! 856
అమ్మానాన్న ఉన్నఇల్లు
సంతోషంగా ఉంటది
తలుపులున్న ఇల్లు
అతిసుందరంగా ఉంటది !! 857
తాండ్ర చిరంజీవి
వరంగల్ అర్భన్
సెల్ : 9959180762.
Comments
Post a Comment