ప్రళయం-విలయం-భీకరం
ప్రళయం-విలయం-భీకరం
తొందర పడకు ఓ భూపరి
ఈ భువిపై ఉన్నవి రెండే జతులు
ఒకటి సజీవ రాశి రెండు నిర్జీవ రశి
అచిర కాలపు స్వప్నంలో, సృష్ఠికార్యపు తీరం అంచున
మిథ్యానాదపు సాధన వలలో, హృదయం వీడి, తనువే మరచి,
మైమరచిన జీవం జాడలు, ఆత్మ మూలాలు ఎరుగని ఓ భూపరి
చరిత్ర విజయం నీదే అంటివి, అజీవలోకం శాసనమాయె,
నీలాకాషపు భ్రమలో నిలబడి, పూర్వపు గాద నీదే అంటివి
ప్రళయకాలపు అంకురంలొ, నిర్జీవ రాశుల విలయ తాండవం
భీకర జీవశ్చవాల ఆర్తనాదం, సంఘజీవుల శోకసంద్రం
పూర్వపు చరిత్ర పుటల్లో శోధించు, వర్తమానంలో జీవించు
అనుభవంతో భవిష్యత్ ను శాసించు ఓ భూపరి
ఈ ఇహలో నీకంఠ పడని గోప్యాలెన్నో, మరుగున పడిన రహస్యాలెన్నో
అన్వేశించి తర్కించు జీవనపయణం సాగించు ఓ భూపరి
---చంద్రహాసన్
Comments
Post a Comment