రాఖీ మెరుపులు

 ⚡⚡రాఖీ మెరుపులు ⚡⚡

———————————————


ఆస్తులన్ని పోయినా

అన్నాచెల్లెల్లు విడిపోరు

దోస్తులు ఎందరైనా

అన్నాచెల్లెల్లకంటే గొప్పకారు !! 932


చెల్లిఅంటే అన్నకు

అమితమైన ప్రేమ

అన్నంటే చెల్లకు

తోడుంటాడనే దీమ !! 933


రాఖీపండుగ అనగానే

చెల్లమ్మకు సంబురం

రాఖీని కట్టగానే

అన్నందుకుంటడు అంబురం !! 934


కోట్లతోకొనలేని బంధం

అన్నాచెల్లల్లది

బహుమతులతో ముడిపెట్టనిబంధం

సోదరిసోదరులది !! 935


చెల్లెమ్మను చూడగానే

అన్నకు కడుపునిండుతది

అన్నను చూడగానే

చెల్లెమ్మకు కన్నీరుతన్నుకొస్తది !! 936


పుట్టినింటి దీపం

ముద్దుల చెల్లెమ్మ

మెట్టినింటి వరం

బంగారు చెల్లెమ్మ !! 937


మనసువిప్పి మాట్లాడుకునే

పండుగ రాఖీ

గోరుముద్దలు తినిపించుకునే

జ్ఞాపకాలగుర్తు రాఖీ !! 938


కష్టంలో తోడుంటానని

అన్న బాసచేస్తడు

కన్నీరు తుడుస్తనని

అన్న హామిఇస్తడు !! 939


చెల్లెమ్మ అడుగే

ఇంటికి వెలుగైతది

చెల్లెమ్మ దీవిస్తేనే

మనకు బతుకైతది !! 940


తాండ్ర చిరంజీవి

Comments

Popular posts from this blog

అతనెక్కడికీ వెళ్లలేదు - చిత్తలూరి ఎస్సెన్