Posts

నువ్వూ, నేనూ, వాడూ, వీడూ....

పసికందు పారిపోలేకపోయింది చిన్నారిని చిదిమేశారు మగువ మసకబారింది స్త్రీ మూర్తి చితికిపోయింది ముసలవ్వలకూ తప్పలేదు మగతనపు మదం, బలుపు. చేసేదేం లేదా అంటే చెయ్యాల్సింది చాలానే వుంది నువ్వూ, నేనూ, వాడూ, వీడూ ఇంకెవ్వడైనా, ఎక్కడైనా కనిపించిన ప్రతి స్త్రీ ని కని పెంచిన అమ్మలానే చూస్తే, కనిపించిన మగ మృగాలను మరపురాని రీతిన బడిత పూజ చేస్తే బరితెగించిన బడ్డూ గాల్లకి బ్రతికే హక్కుని హరింపజేస్తే రేపటి మాతృ మూర్తులకైనా రక్షణ వస్తుందేమో. నువ్వూ, నేనూ, వాడూ, వీడూ ఇంకెవ్వడైనా, ఇంకెప్పుడైనా ఆడదంటే 'అవసరం' కాదు "ఆదిశక్తి" స్వరూపం అనుకుంటే రేపటి మాతృ మూర్తులకైనా మంచి రోజులు వస్తాయేమో ఈ అనాగరికపు ఆలోచనకి  నువ్వూ, నేనూ, వాడూ, వీడూ  బాధ్యత వహిస్తే, మగాడికి, మగువంటే  ఏంటో తెలిపే బాధ్యత  నువ్వూ, నేనూ, వాడూ, వీడూ భుజానెత్తుకుంటే, రేపటి మాతృ మూర్తులకైనా రక్షణకవచం మనమౌతామేమో, రేపటి మాతృ మూర్తులకైనా మంచి రోజులు వస్తాయేమో   RV Writings......

దబాయింపు - నిరంతర

 దబాయింపు                          - నిరంతర కళ్ల ముందు కనిపించేదాన్ని చూపించొద్దంటావ్ వినిపడినదాన్ని వినిపించొద్దంటావ్ మాట్లాడాల్సినదాన్ని మాట్లాడొద్దాంటావ్ ప్రశ్నించాల్సినదాన్ని ప్రశ్నించొద్దంటావ్ మాటా లేక  చూపూ లేక నేనో నువ్వో ఉన్నామన్న  అలికిడే లేక గడ్డ కట్టిన శిలలా పడివుండమంటావ్ ప్రాంతమొద్దంటావ్  కులం‌లేదంటావ్  మతం‌లేదంటావ్  వాదం లేదంటావ్  వివాదానికి తావులేదంటావ్  అసలు చర్చకు  తావేలేదంటావ్  జరుగుతున్న వాస్తవాలేవీ  ఉటంకించొద్దంటావ్  రాయటానికివన్నీ నిషేధమే అయినపుడు ఇంకా రాయటమెందుకు? ఎండకు ఎండి  వానకు తడిసి గమ్మునుండే శిలాజంలా పడివుండటానికి మనిషిగా‌ నీకో పేరెందుకు? పైగా దానికి కవిత్వమని దబాయింపెందుకు?                  - నిరంతర

జాషువా గారి కోసం... కాస్తంత కవిత్వంగా- చిత్తలూరి

Image
 జాషువా గారి కోసం... కాస్తంత కవిత్వంగా-చిత్తలూరి   Follow the below youtube link for more Chittaluri Kavithalu https://www.youtube.com/channel/UCertyXyNh5qIfgj_LVvpl0A

చిత్తలూరి- మీ కవిత- నా విశ్లేషణ 3

Image
చిత్తలూరి- మీ కవిత- నా విశ్లేషణ 3   Follow the below youtube link for more Chittaluri Kavithalu https://www.youtube.com/channel/UCertyXyNh5qIfgj_LVvpl0A

Exclusive interview with poet, Lyricist Thandra Chiranjeevi

Image
Exclusive interview with poet, Lyricist Thandra Chiranjeevi            

అతనెక్కడికీ వెళ్లలేదు - చిత్తలూరి ఎస్సెన్

Image
 అతనెక్కడికీ వెళ్లలేదు                      - చిత్తలూరి ఎస్సెన్ అతనెక్కడికీ వెళ్లలేదు మంచివాళ్లెక్కడికైనా వెళ్లగలరా? ఒక పాటగానో మాటగానో ప్రజల మనసుల్లో చెరగని ముద్రలు వేసినవాళ్లు ఎక్కడికెళ్లగలరు? గుండెల్లోనే గూడుకట్టుకుని వుంటారు ప్రజల ప్రాణ శ్వాసకు స్వర కల్పనలు చేస్తూ వినిపిస్తారు అతనూ అంతే అతనెక్కడికీ వెళ్లిపోలేదు మన నరాలను వీణా తంత్రుల్ని చేసి మీటినవాడు మన దేహాలను   సంగీతం పెట్టెలా మార్చి పులకింప చేసినవాడు మన యాసలో ధ్యాసలో మన శ్వాసలో పాటల ప్రాణవాయువై మోగినవాడు అతనెక్కడికెళ్లగలడు? అతనెక్కడికీ వెళ్ల లేదు దేశానికి పాటనిచ్చి ప్రపంచానికి మనదైన స్వరాన్నిచ్చి మన కీర్తి ప్రతిష్టలకు తనదైన బాణీ  కూర్చి ఇచ్చినవాడు మన గుండె లబ్ డబ్ ల సంగీతంలో శృతి లయలై పరుచుకున్నవాడు అతనెక్కడికీ వెళ్లలేదు కొత్త కొత్త చరణాలు తూలిపడుతున్న చోట పల్లవిగా నిలబడి పాట భుజం తట్టినవాడు పాడుతా తియ్యగా అంటూ పలకరించినవాడు అతనెక్కడికెళ్లగలడు? మన పాటకి పల్లవిగా మన రాగానికి తాళంగా మన జీవన సంగీతానికి మధురమైన స్వరంగా ...

గంధర్వుల చెంత గానకచేరికేగెనో...

 ...✒️ బింగిదొడ్డి వెంకటేష్, ...📞 9885380371.              భువిపై శ్రోతల నలరించిన బాలు కోట్లాది హృదయాల గెలిచేసిన బాలు దివిపై దేవతల ఆహ్వానమందెనో గంధర్వుల చెంత గానకచేరికేగెనో మధురమైన స్వరంతో మైమరిపింపజేయంగ స్వర్గానికి చేరారు సురులనలరించగ.           --*-- బాధాతప్త హృదయంతో  గానగంధర్వ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారికి అశ్రునయన నివాళి😢😢..