జాషువా గారి కోసం... కాస్తంత కవిత్వంగా-చిత్తలూరి Follow the below youtube link for more Chittaluri Kavithalu https://www.youtube.com/channel/UCertyXyNh5qIfgj_LVvpl0A
అతనెక్కడికీ వెళ్లలేదు - చిత్తలూరి ఎస్సెన్ అతనెక్కడికీ వెళ్లలేదు మంచివాళ్లెక్కడికైనా వెళ్లగలరా? ఒక పాటగానో మాటగానో ప్రజల మనసుల్లో చెరగని ముద్రలు వేసినవాళ్లు ఎక్కడికెళ్లగలరు? గుండెల్లోనే గూడుకట్టుకుని వుంటారు ప్రజల ప్రాణ శ్వాసకు స్వర కల్పనలు చేస్తూ వినిపిస్తారు అతనూ అంతే అతనెక్కడికీ వెళ్లిపోలేదు మన నరాలను వీణా తంత్రుల్ని చేసి మీటినవాడు మన దేహాలను సంగీతం పెట్టెలా మార్చి పులకింప చేసినవాడు మన యాసలో ధ్యాసలో మన శ్వాసలో పాటల ప్రాణవాయువై మోగినవాడు అతనెక్కడికెళ్లగలడు? అతనెక్కడికీ వెళ్ల లేదు దేశానికి పాటనిచ్చి ప్రపంచానికి మనదైన స్వరాన్నిచ్చి మన కీర్తి ప్రతిష్టలకు తనదైన బాణీ కూర్చి ఇచ్చినవాడు మన గుండె లబ్ డబ్ ల సంగీతంలో శృతి లయలై పరుచుకున్నవాడు అతనెక్కడికీ వెళ్లలేదు కొత్త కొత్త చరణాలు తూలిపడుతున్న చోట పల్లవిగా నిలబడి పాట భుజం తట్టినవాడు పాడుతా తియ్యగా అంటూ పలకరించినవాడు అతనెక్కడికెళ్లగలడు? మన పాటకి పల్లవిగా మన రాగానికి తాళంగా మన జీవన సంగీతానికి మధురమైన స్వరంగా ...
Comments
Post a Comment