దబాయింపు - నిరంతర
దబాయింపు
- నిరంతర
కళ్ల ముందు
కనిపించేదాన్ని
చూపించొద్దంటావ్
వినిపడినదాన్ని
వినిపించొద్దంటావ్
మాట్లాడాల్సినదాన్ని
మాట్లాడొద్దాంటావ్
ప్రశ్నించాల్సినదాన్ని
ప్రశ్నించొద్దంటావ్
మాటా లేక
చూపూ లేక
నేనో నువ్వో
ఉన్నామన్న
అలికిడే లేక
గడ్డ కట్టిన శిలలా
పడివుండమంటావ్
ప్రాంతమొద్దంటావ్
కులంలేదంటావ్
మతంలేదంటావ్
వాదం లేదంటావ్
వివాదానికి తావులేదంటావ్
అసలు చర్చకు
తావేలేదంటావ్
జరుగుతున్న వాస్తవాలేవీ
ఉటంకించొద్దంటావ్
రాయటానికివన్నీ
నిషేధమే అయినపుడు
ఇంకా రాయటమెందుకు?
ఎండకు ఎండి
వానకు తడిసి
గమ్మునుండే
శిలాజంలా
పడివుండటానికి
మనిషిగా నీకో
పేరెందుకు?
పైగా దానికి
కవిత్వమని
దబాయింపెందుకు?
- నిరంతర
Comments
Post a Comment