విమర్శిస్తారు వాళ్లు....

విమర్శిస్తారు వాళ్లు....
ఏం చేసినా విమర్శిస్తారు,
ఎవ్వరినైనా విమర్శిస్తారు
ఖర్చు లేనిది కదా కాకా,
విమర్శిస్తారు వాళ్లు
ఎన్నో చేసినా సరే,
ఏం చేయలేదో చూపి మరీ విమర్శిస్తారు
చౌకనైనది కదా తమ్మి,
తప్పదు నీకు మరి
విమర్శిస్తారు వాళ్లు
ప్రేమకి మరో రూపం అమ్మని కూడా ప్రేమే తెలియదని విమర్శిస్తారు
అవకాశం దొరికింది కదా తల్లి అందిపుచ్చుకుంటారు అంతే
విమర్శిస్తారు వాళ్లు
బరువులు మోసే నాన్నని కూడా
బాధ్యత తెలియదని విమర్శిస్తారు
బలుపెక్కితే ఎక్కడ తెలుస్తది
విమర్శిస్తారు వాళ్లు
నీకెంత విజ్ఞానమున్నా సరే
లేని జ్ఞానం చూపించి విమర్శిస్తారు
విజ్ఞతను మర్చిపోయారు మిత్రమా
వింత జీవులు కదా
విమర్శిస్తారు వాళ్లు
విని ఉరుకుందాం
వెన్నంటి నిలిచే అన్ననే
వెనకేసుకున్నాడని విమర్శిస్తారు
అన్నం బదులు గడ్డి తింటున్నారు వాళ్లు
ఆవేదన అసలే వద్దన్నా
అనుమానపు అసలు రూపాలు
అలాగే విమర్శిస్తారు వాళ్లు
పుల్ల తీసి పక్కన పెట్ట చేతకాదు గానీ
పులిలాంటి మనిషినే విమర్శిస్తారు
పుట్టుకతో పుట్టిన బుద్ధి కదా మామ
పురిటి దాకా వుంటది అది
అప్పటివరకు విమర్శిస్తూనే ఉంటారు వాళ్లు...
RV Writings

Comments

Popular posts from this blog

రాఖీ మెరుపులు

అతనెక్కడికీ వెళ్లలేదు - చిత్తలూరి ఎస్సెన్