అమ్మంటే అన్నీ...

అమ్మ… ఓ అనుభూతి…..
అది అనుభవిస్తేనే తెలుస్తుంది.
అమ్మంటే అనురాగం, ఆప్యాయత…
అమ్మ నీ కోసం చేసే ప్రతి పనిలో అది తెలుస్తుంది.
అమ్మంటే అనునయం.. అమ్మంటే ఆత్రుత…
అది నీకై చూసే కళ్ళలో ఉంటుంది.

అమ్మంటే ఆనందం…అది నీకై తను పడే కష్టంలో
నువ్వు పడే సుఖంలో ఉంటుంది.
అమ్మంటే అభినందన…
నువ్వు గెలిచిన ప్రతిసారి కనిపిస్తుంది

అమ్మంటే ఓ ఆవేదన, అమ్మంటే ఆక్రందన
నీకై పరితపించిన క్షణాన కనబడుతుంది
అమ్మంటే ఒకటేమిటి
అమ్మంటే అన్నీ, అమ్మంటేనే అన్నీ

అమ్మంటే అనుసరణ, అమ్మంటే అనుకరణ
నిత్యం నీడలా నిన్నంటే ఉంటుంది.
అమ్మంటే ఆలాపన, అమ్మంటే ఓ ఆలోచన
నిన్ను నడిపే దారిలో తోడై ఉంటుంది

అమ్మంటే ఆకాశం, అమ్మంటే అవకాశం
నువ్వు కోరిన ప్రతీది,
కోరినన్నిసార్లు తెచ్చివ్వడమే తన పని మరి
అమ్మంటే ఓ ఆశ, అమ్మంటే నీ శ్వాశ
తన వల్లే నువ్వు నీలా వున్నది
అమ్మంటే ఆరాటం, అమ్మంటే ఓ పోరాటం
నీ ఎదుగుదలే తన లక్ష్యంగా బతుకుతుంది
అమ్మంటే అది ఇది మాత్రమే కాదు
అమ్మంటే అన్నీ, అమ్మంటేనే అన్నీ….

Comments

Popular posts from this blog

రాఖీ మెరుపులు

అతనెక్కడికీ వెళ్లలేదు - చిత్తలూరి ఎస్సెన్