నిజమైన దేవుడు " డాక్టరే " !!

నిజమైన దేవుడు " డాక్టరే " !!
——————————————

మనుషులకు దేవుడిపై నమ్మకం వుండాలి
అంతేకాని గుడ్డినమ్మకం కాదు
పూజలు,ప్రార్థనలు , నమాజులు చెప్పాయా
"కరోనా " ఎపుడు చచ్చి పోతుందని
ఏదో చెప్పాలి కాబట్టి అందరు ఏవేవో మాటలు
వారి కడుపు తిప్పల కోసం చెబుతున్నారు
కంటికే కనిపిస్తలేదు " కరోనా " ఐన
ప్రపంచాన్ని కల్లోలం చేసి శవాలుగా మారుస్తుంది
ఇంకా కొందరు ఈదేవుడని ఆదేవుడని
బుకాయింపు మాటలు చెబుతున్నారు
దేవుళ్ళే గుడి తలుపులు మూసుకొని పడుకున్నారు
ఇక దయ్యాల ఊసేలేదు
మహామహా సంపన్న దేశాలే కరోనా కత్తికి
భలైపోతుంటే ఇంకా గుడ్డినమ్మకాలే....!
మంత్రాలకు చింతకాయలు రాలవని తెలిసిన
మన పద్దతులు ఆచారాలు...
కరోనాకు ఆడమగ తేడాలేదు
వున్నోళ్ళు లేనోళ్ళు అని తేడాలేదు
చిన్నాపెద్దా , ఈమతం ఆమతం, నలుపు తెలుపు
అనే తేడాలు అసలు లేవు
క్షణాలలో ఎటునుంచి ఎటైన వచ్చి చంపేస్తుంది
మనల్ని మనం రక్షించుకోవాలంటే
ఇల్లుదాటి బయటకు రాకుండా వుండడమే
అనునిత్యం శుభ్రతను పాటించడమే
ఇప్పుడు ప్రపంచానికి ఒక్కదేవుడే వున్నాడు
ఆయనే ప్రాణంపోసే " డాక్టరు "
ఆ వైద్యుని నిరంతర పోరాట ఫలితమే
మన ప్రాణాలకు రక్షణ.
అతడు కనిపెట్టే మందు
కరోనాకు విరుగుడు మందు
ఏకులమైన ఏమతమైన పూజించాల్సింది డాక్టరును
ప్రాణాపాయం అని తెలిసిన వారి ప్రాణాల్ని
పణంగా పెట్టి కరోనాతో పోరాడుతున్నారు
చివరికి సైన్సు గెలిచింది
ఇకనైన తారతమ్యాలు ,భేదాలు వదలి
అందరం మనుషులుగా బ్రతుకుదాం
సైన్సు మన నమ్మకం
ప్రపంచానికి సైన్సు ప్రాణరక్షణ ప్రాణభిక్షణ !!

" వైద్యుల పాదాలకు శతకోటి వందనాలు "
తాండ్ర చిరంజీవి
వరంగల్ అర్భన్

Comments

Popular posts from this blog

రాఖీ మెరుపులు

అతనెక్కడికీ వెళ్లలేదు - చిత్తలూరి ఎస్సెన్