అందనిదానవై...

వానవై వయ్యారిలా…

ఒంపులు సొంపులతో పరుగెత్తుతావు

పట్టుకుందామంటే దొరకవు

నీలా నేను పరుగెట్టలేనుకదా పాప.

 

పున్నమినాటి వెన్నెలలా నిండుగా నవ్వేస్తావు…

అంత దూరానుండి కనువిందు చేస్తావు

ఎంత ఎగిరినా అందనిదానవే

నువ్వెంత ముదిరినా చక్కని జానవే.

 

వేసవిలో ఎండమావిలా ఎంచక్కా నృత్యమాడుతావు…

దరిచేరి తరిస్తానంటే దూరమే నీ రూపమంటావు

దరిచేరని రూపమేల బాల.

 

చలివై వచ్చి నిండా రగ్గులు కప్పి…

నీ రూపు చూపంటే నా లోపలుందంటావు

మరి నిన్ను చూసేదెలా దేవి.

 

అందిందు ఎందునైనా అందంగా కనిపించి…

అమావాస్య చంద్రునిలా తుర్రుమని జారుకుంటావు

ఇదేమి న్యాయమమ్మా పుత్తడిబొమ్మ.

Comments

Popular posts from this blog

రాఖీ మెరుపులు

అతనెక్కడికీ వెళ్లలేదు - చిత్తలూరి ఎస్సెన్