నీలో కలిసిపోవాలని....

నిన్ను చేరాలంటే భయంగా ఉంది ఎక్కడ నన్ను నీలో కలిపేస్తావేమోనని
అయినా చేరాలని ఆత్రుతగా ఉంది లేదంటే చెరిపేస్తావేమోనని….
నిన్ను చూడాలంటే భయంగా ఉంది ఇంకేది చూడలేనేమోనని
చూడకపోతే భాదగా ఉంది నాకు నేనే కనిపించట్లేదని….
నిన్ను తాకాలంటే తప్పనిపిస్తుంది ఎక్కడ కందిపోతావేమోనని
అయినా తాకాలనుంది లేదంటే చేజారిపోతావేమోనని….
నీతో మాట్లాడాలంటే మొహమాటంగా ఉంది ఎక్కడ ఓడిపోతానేమోనని
అయినా మాట్లాడాలనుంది లేదంటే వాడిపోతానేమోనని….
నువ్వు గుర్తొస్తే గుబులుగా ఉంది దూరంగా ఉన్నావని
అయినా గుర్తుకు తెచ్చుకోవాలనుంది ఎందుకంటే నా గుర్తే నువ్వని…
నీతో వాదించాలంటే వణుకొస్తుంది ఓటమి నాదవుతుందని
అయినా ఓడాలనుంది నా ఓటమే నీ గెలుపని…..
నిన్ను తిట్టాలంటే తడబడుతున్నా తప్పుగా అనుకుంటావని
తప్పైనా తిట్టేస్తున్నా నీ కన్నీరు తుడిచేది నేనే కదా అని…..
దీన్ని ప్రేమ అనాలంటే సంశయంగా ఉంది
ఇలాగే నీకు కూడా అనిపించాలి కదా అని….
నిజంగానే నాకు భయంగా ఉంది
నేనేమైపోతానోనని… నాలో ఉన్న నువ్వేమైపోతావోనని…

Comments

Popular posts from this blog

రాఖీ మెరుపులు

అతనెక్కడికీ వెళ్లలేదు - చిత్తలూరి ఎస్సెన్