⚡⚡ మెరుపులు ⚡⚡ కావాలి జాగ్రత్త

⚡⚡ మెరుపులు ⚡⚡
————————————

దగ్గు జలుబులతో
కరోనా వైరస్సు
త్రాగే నీళ్ళతో
చంపచ్చు వైరస్సు !! 556

అసలే తాగద్దు
చల్లని పానియాలు
అసలే తాకద్దు
చల్లని గాలులు !! 557

ఎండలలో తిరగి
కరోనాను చంపండి
వేడివేడిగా తిని
కరోనాను పంపండి !! 558

చేతులు శుభ్రంలేకున్న
కరోనా వచ్చు
దండం పెట్టకున్న
కరోనా వచ్చు !! 559

విందులు వినోధాలు
దూర ముంచుదాం
షాపింగులు సినిమాలు
బందు పెడదాం !! 560

సకలజనుల సమ్మెను
సంక్కంగ జేత్తిమి
కరోనాను సంపను
తీర్మానము జేత్తిమి !! 561

ఒక్కరం వేరైన
ఓడి పోయినట్లే
అందరం ఒక్కటైన
కరోనాను చంపినట్లే !! 562

అనుమాన మనిపిస్తే
వైద్యున్ని చేరాలి
మందులను మానేస్తే
పేషెంట్ గా మారాలి !! 563

ఒక్కొక్క నీటిబొట్టు
చెరువైనట్టు
నియమాలుపాటిస్తే ఒట్టు
మనం బ్రతికినట్టు !!564

కావాలి జాగ్రత్తలు
మనం బ్రతకడానికి
పాటించాలి నియమాలు
కరోనాను చంపడానికి !! 565
తాండ్ర చిరంజీవిి

Comments

Popular posts from this blog

రాఖీ మెరుపులు

అతనెక్కడికీ వెళ్లలేదు - చిత్తలూరి ఎస్సెన్