⚡ మెరుపులు ⚡అమ్మ
⚡⚡ మెరుపులు ⚡⚡
—————————————
అమ్మలేని జన్మ
అసలు వుండదు
జరగకపోతే కర్మ
స్వర్గం వుండదు !! 533
మాటలో స్పష్టత
దారి చూపిస్తది
వేటలో నిపుణత
గురి చేదిస్తది !! 534
గుండెలుతీసిన బంటు
బండలు కొట్టడు
విలువతెలువని చింటు
ఎంగిలి ముట్టడు !! 535
విమర్శలే విజయాలు
ఓపికతో వున్నవారికి
ప్రశంసలే అపజయాలు
గర్వంతో నడచువారికి !! 536
బాధ్యతలనేవి ఎపుడు
బరువులు కాదు
మాటలనేవి ఎపుడు
అరుపులు కాదు !! 537
మోముపై చిరునవ్వు
రోగాలు నయం
నవ్వాలి చిరునవ్వు
విజయం కాయం !! 538
కన్ను చిన్నదైన
మిన్నంత జూస్తది
కలము చిన్నదైన
బుక్కంత రాస్తది !! 539
అతుకుల బతుకుకు
అర్థం ఉండదు
గతికే మెతుకు
ఆకలి తీర్చదు !! 540
పూవ్వులు విరభూస్తే
నవ్వులు వస్తవి
రాతలు రంజిస్తే
హృదయాలు సంతసిస్తవి !! 541
తాండ్ర చిరంజీవి
Comments
Post a Comment