⚡⚡ మెరుపులు ⚡⚡మాటలు

⚡⚡ మెరుపులు ⚡⚡
—————————————

మాటలు బాణాలైన
మనసులు విరిగిపోవును
మాటలు పూవ్వులైన
మనసులు కరిగిపోవును !! 513

మాట మంత్రముకాదు
చింతకాయ రాలుటకు
మాట తంత్రముకాదు
చనిపోయిన లేపుటకు !!
514

మాట మృదువైన
నడిచేటి బాట
మాట సున్నితమైన
వికసించు తోట !! 515

మంచి మాట
కారము కాదు
జీవితంలో మాట
భారము కాదు !! 516

పైసలతో కానివి
మాటతో అయితవి
ప్లాట్లున్న కానివి
మాటతో అయితవి !! 517

మంచిమాట లెల్ల
మర్యాదతెచ్చు
చెడుమాట లెల్ల
హృదయంలో గుచ్చు !! 518

మాటల పూదోటలు
అందరికి కావాలి
వికసించే తోటలు
అందరు నడవాలి !! 519

మాటలు అభయము
చెడుకు దారితీయ్యనప్పుడు
మాటలు దుర్లబము
మంచిని గ్రహించనప్పుడు !! 520

మాటలల్ల ఆప్యాయత
విరిసిన పుష్పము
మాటలల్ల సారుప్యత
గుబాలించు పుష్పము !! 521
తాండ్ర చిరంజీవి

Comments

Popular posts from this blog

రాఖీ మెరుపులు

అతనెక్కడికీ వెళ్లలేదు - చిత్తలూరి ఎస్సెన్